![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/5_1738400397638_1738890465056.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/5_1738400397638_1738890465056.jpg)
AP Liquor Prices: ఏపీలో త్వరలో పెరుగనున్న మద్యం ధరలు! దుకాణాలకు కమిషన్ల పెంపుకు సర్కారు అమోదం
AP Liquor Prices: ఏపీలో మద్యం ధరలు త్వరలో పెరుగ నున్నాయి. ఓ వైపు ప్రైవేట్ మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోగా మరోవైపు లైసెన్స్ దారులకు నష్టాలు వస్తుడంటంతో ధరల్ని పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది.
AP Liquor Prices: ఆంధ‌్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెరుగనున్నాయి. మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్నమార్జిన్ చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిషన్ పెంపుకు ప్రభుత్వం అమోదం తెలిపింది. ఇప్పటికే ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2023-24లో దాదాపు రూ.36వేల కోట్ల రుపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా లభించింది. ఇందులో డిస్టిలరీలకు చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలకు పోగా రూ.28-30వేల కోట్ల రుపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
ఏపీలో గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది. ఏపీలో ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇచ్చే మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని సూచించినా ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. గత ఏడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో 3వేలకు పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి.
మద్యం దుకాణాల్లో విక్రయాలకు 20శాతం కమిషన్ లభిస్తుందని ప్రచారం చేయడంతో పోటీ పడి దరఖాస్తులు చేశారు. ఏపీలో మద్యం వ్యాపారాలన్నీ అయా నియోజక వర్గాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులకు తగిన విధంగా లాభాలు రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్‌లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపివేస్తామని అల్టిమేటం కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో వ్యాపారుల ఆందోళనతో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై చెల్లిస్తున్న మార్జిన్‌ను పెంచేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన క్యాబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది.
ధరల తగ్గింపు లేనట్టే…
ఏపీలో మద్యం ధరలు తగ్గుతాయంటూ కొద్ది నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే బ్రాందీలో ఒక బ్రాండ్, విస్కీలో మరో బ్రాండ్ మాత్రమే రూ.30 వరకు ధరలు తగ్గాయి. బ్రాందీకి ఓ ప్రముఖ నటుడు బ్రాండ్ ప్రమోటర్‌గా ఉన్నారు. లిక్కర్ వ్యాపారంలో గత ఐదేళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మరో బ్రాండ్ కూడా ధర తగ్గించింది. ఈ క్రమంలో దాదాపు పది బ్రాండ్ల ధరలు తగ్గుతాయని డిసెంబర్ నుంచి ఎక్సైజ్ శాఖ లీకులు ఇచ్చింది. మద్యం ధరల ఖరారు విషయంలో రకరకాల పిల్లిమొగ్గలు వేసినా ధరలు మాత్రం తగ్గలేదు. ఎక్సైజ్ శాఖ నిర్వాకంతోనే ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టు తెలుస్తోంది.
వైసీపీ హయంలో నాణ్యత లేని మద్యంతో పాటు 2019 మే నాటికి ఉన్న ధరల కంటే దాదాపు 80-100శాతం ధరలు పెరిగాయి. సంపూర్ణ మద్యం నిషేధం పేరుతో మొదట్లో 200శాతం ధరలు పెంచేసి తర్వాత వాటిని 100శాతానికి తగ్గించారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మద్యం విక్రయాలపై వచ్చే డబ్బును అమ్మఒడి వంటి పథకాలకు వెచ్చించారు. జనం కూలీనాలి చేసుకుని సంపాదించే డబ్బును మద్యం ద్వారా ప్రభుత్వం తీసుకుని పథకాలకు పంచి పెట్టిందనే విమర్శలు వచ్చాయి. ఇది గత ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపించింది.
త్వరలో మద్యం ధరలు పెరుగుదల…
ఏపీలో త్వరలో మద్యం ధరలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుకాణదారులకు ప్రస్తుతం చెల్లిస్తున్న కమిషన్‌ను 14.5శాతానికి పెంచాలని నిర్ణయించడంతో ఆ మేరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న డబ్బును వదులుకోకుండా ఆ మేరకు మద్యం ధరలు పెంచుతారని చెబుతున్నారు.
మద్యంపై వచ్చే ఆదాయం, విక్రయాలు, లైసెన్సుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో ఎక్సైజ్ శాఖ అనాలోచిత చర్యలతో ఖజానాకు గండి పడగా తాజాగా ప్రజలపై కూడా భారం పడనుంది. కొత్త పాలసీ వచ్చిన నాలుగు నెలల్లోనే ధరల పెంచనుండటం విమర్శలకు తావిస్తోంది. మద్యం విక్రయాలపై లైసెన్స్ దారులకు చెల్లించే మార్జిన 14శాతానికి పెంచేలా క్యాబినెట్ అమోదం తెలిపింది
మద్యం లైసెన్స్‌దారులకు చెల్లించే మార్జిన్ ను ఉత్పత్తిపై అన్ని రకాల పన్నులు వేసిన తర్వాత వచ్చే ధరను ఇష్యూ ప్రైస్‌గా నిర్ణయిస్తారు. దీనిపై వ్యాపారులకు మార్జిన్ ఇస్తారు. వ్యాపారులకు చెల్లించే మార్జిన్ కలిపి ఎమ్మార్పీగా నిర్ణయిస్తారు. గత ఏడాది దుకాణాలను ఖరారు చేసిన సమయంలో మద్యం ఇష్యూ ప్రైస్‌పై 20శాతం కమిషన్ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వ్యాపారులకు పదిశాతం లోపే కమిషన్ వస్తోంది. దీంతో వ్యాపారాలు చేయలేమని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సఫలం అయ్యారు.
వ్యాపారులకు 14శాతానికి మార్టిన్ పెంచడం వల్ల రూ.వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వం కోల్పోతుంది. దీని స్థానంలో ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాద నలు సిద్ధం చేసింది. గరిష్ట చిల్లర ధర రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 ధర పెంచాలని ప్రతి పాదన రెడీ చేసింది. మద్యం బ్రాండ్లలో అన్ని కేటగిరీలకు 14శాతం మార్జిన్ ఇచ్చి , రూ.150 ఖరీదు దాటిన బ్రాండ్లపై రూ.10 పెంచితే ప్రభుత్వానికి రూ.135 కోట్లు మాత్రమే నష్టం అని లెక్కలు వేసింది.
క్వార్టర్ రూ.99 బ్రాండ్లు మినహా అన్నిటి పై రూ.10 పెంచి, 14శాతం మార్జిన్ ఇస్తే ప్రభుత్వానికి రూ.320 కోట్లు అదనంగా లభిస్తుంది. రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 పెంచి మార్జిన్ను రెండు కేటగి రీల్లో 10.5, 14 శాతాలుగా అమలుచేస్తే రూ.220 కోట్ల ఆదాయం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మద్యం ధరలు తగ్గిస్తామని ఊదరగొట్టి ఇప్పుడు ధరలు పెంచడానికి ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తుండటంతో విపక్షాలకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్