Hyd To Vja: రూ.99కే హైదరాబాద్‌ – విజయవాడ మధ్య బస్సు ప్రయాణం, ఫ్లిక్స్‌ బస్సులో లాంచింగ్ ఆఫర్

Best Web Hosting Provider In India 2024

Hyd To Vja: రూ.99కే హైదరాబాద్‌ – విజయవాడ మధ్య బస్సు ప్రయాణం, ఫ్లిక్స్‌ బస్సులో లాంచింగ్ ఆఫర్

Bolleddu Sarath Chand HT Telugu Feb 07, 2025 07:15 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bolleddu Sarath Chandra HT Telugu
Feb 07, 2025 07:15 AM IST

Hyd To Vja: హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాన్ని రూ.99కే అందిస్తున్నట్టు ఫ్లిక్స్‌ బస్ సర్వీసెస్ ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో ఫ్లిక్స్‌ సర్వీసుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నాలుగు వారాల పాటు లాంచింగ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.

ఫ్లిక్స్‌ బస్ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
ఫ్లిక్స్‌ బస్ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Hyd To Vja:  హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రూ.99 ఛార్జీతోనే ప్రయాణించే అవకాశాన్ని ఫ్లిక్స్‌ బస్ సర్వీస్ కల్పిస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్ సర్వీస్ సంస్థ సేవల్నితెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం ప్రారంభించారు. 

yearly horoscope entry point

పూర్తి స్థాయిలో  సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయా ణించే అవకాశం  కల్పిస్తారు. ఈ బస్సుల్లో అయిదు గంటల్లో విజయవాడ చేరుకుంటాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అన్ని రాయితీలు  తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో  49 మంది ప్రయాణించే సదుపాయం ఉంటుంది. రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్  బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను(ఈవీ) ప్రోత్సహిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.  ఈటీవో మోటార్స్‌ భాగస్వామ్యంలోప్లిక్స్ బస్ ఇండియా ఎలక్ట్రిక్‌  బస్సులను గురువారం  మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 

రానున్న  మూడు, నాలుగు వారాల్లో  హైదరా బాద్-విజయవాడ మధ్య ఫ్లిక్స్‌ ఈవీ బస్సులు నడుస్తాయని, తర్వాత  విజయవాడ-విశాఖ మధ్య బస్సుల్ని ప్రారంభిస్తామని తెలిపారు. బస్సు సర్వీసులు మొదలైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99కే ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. 

Whats_app_banner

టాపిక్

TravelElectric BusTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsPonnam Prabhakar
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024