Best Web Hosting Provider In India 2024
TG Group1 Results: ఫిబ్రవరిలోనే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల, ఏర్పాట్లు చేస్తోన్న టీజీపీఎస్సీ
TG Group1 Results: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న గ్రూప్ 1 ఫలితాల విడుదలకు గడువు దగ్గర పడుతోంది. ఏప్రిల్‌లోపు పెండింగ్ నోటిఫికేషన్లకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయనున్నారు.
TG Group1 Results: తెలంగాణలో గ్రూప్1 ఫలితాలు మరో వారం పదిరోజుల్లో విడుదల కానున్నాయి. గ్రూప్1 తో పాటు ప్రాధాన్యత క్రమంలో గ్రూప్ 2, గ్రూప్3 నియామకాలను ఏప్రిల్‌లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాలను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో తెలంగాణలో563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే ముగి సింది. గ్రూప్ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సాధించిన మార్కులను బట్టి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుది పరిశీలన చేస్తోంది.
ఫిబ్రవరిలోనే మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మెయిన్స్ ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
తెలంగాణ గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 38 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గ్రూప్ 1 నియామకాలు పూర్తైన తర్వాత గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే బ్యాక్లాగ్ ఉండవని ఈ మేరకు నిర్ణయించారు.
గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను కమిషన్ వెబ్సైట్లో విడుదల చేస్తారు. సబ్జె క్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచుతారు. మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ కలిపి మెరిట్ జాబితాతో ఆప్షన్ కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ. వెయ్యి చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్-I మెయిన్ పరీక్షల మూల్యాంకనాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. గతేడాది నవంబర్ మాసంలోనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా….జనవరిలో ఈ ప్రక్రియను ముగించింది.
గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు 21,151 మంది (67.3 శాతం) హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. జనరల్ ర్యాకింగ్ లిస్ట్ విడుదలైతే… గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి దాదాపు లైన్ క్లియర్ అవుతోంది.
ఇప్పటికే గ్రూప్ 2, 3 ప్రాథమిక కీలు కూడా విడుదలయ్యాయి. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. వీటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కూడా సిద్ధం చేసే పనిలో టీజీపీఎస్సీ ఉంది. మొత్తంగా చూస్తే మార్చి నెలఖారు నాటికి కీలకమైన గ్రూప్ 1, 2,3 ఫలితాలన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పరీక్షలు ఆదివారం 27వ తేదీతో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత పొందారు. వీరిలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
సంబంధిత కథనం
టాపిక్