Leftover Food Magic: ఈ ఆహారాలు వండిన రోజు కన్నా మరుసటి రోజు తింటేనే రుచిగా ఉంటాయట, పోషకాలు కూడా రెండింతలు అవుతాయట!

Best Web Hosting Provider In India 2024

Leftover Food Magic: ఈ ఆహారాలు వండిన రోజు కన్నా మరుసటి రోజు తింటేనే రుచిగా ఉంటాయట, పోషకాలు కూడా రెండింతలు అవుతాయట!

Ramya Sri Marka HT Telugu
Feb 07, 2025 10:30 AM IST

Leftover Food Magic: తాజా ఆహారం తినడమే ఆరోగ్యానికి మంచిదనీ, పాతబడ్డ, మిగిలిపోయిన ఆహారాలు మంచివి కావిని మీరు విని ఉంటారు. కానీ కొన్ని రకాల ఆహారాలు పాతబడితేనే రుచిగా ఉంటాయని మీకు తెలుసా? మరుసటి రోజుకు వీటిలోని పోషక విలువలు కూడా రెండింతలు అవుతాయంటే నమ్ముతారా? ఆ ఆహారాలేంటో ఓ లుక్ ఏసేద్దాం రండి!

ఈ ఆహారాలు వండిన రోజు కన్నా మరుసటి రోజు తింటేనే రుచిగా ఉంటాయట, పోషకాలు కూడా రెండింతలు అవుతాయట!
ఈ ఆహారాలు వండిన రోజు కన్నా మరుసటి రోజు తింటేనే రుచిగా ఉంటాయట, పోషకాలు కూడా రెండింతలు అవుతాయట! (Shutterstock)

ఎప్పుడూ తినగలిగేంత ఆహారం మాత్రమే వండాలని పెద్దలు చెబుతుంటారు. ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రాలు కూడా ఎల్లప్పుడూ తాజాగా వండుకున్న ఆహారాలను మాత్రమే తినాలని చెబుతాయి. మిగిలిన పాత ఆహారాలను రిఫ్రిజిరేటర్లో ఉంచి లేదా మళ్ళీ వేడి చేసి తినడం వల్ల దాంట్లోని పోషక విలువలు తగ్గుతాయి, రుచి కూడా చెడిపోతుంది. పైగా వాటిలోకి బ్యాక్టీరియా ప్రవేశించి ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదముంది. అందుకే మిగిలిపోయిన ఆహారాలను తినకూడదు అంటారు. అయితే అన్ని రకాల ఆహార పదార్థాలకు ఇది వర్తించదట.

yearly horoscope entry point

కొన్ని రకాల పదార్థాలు పాతబడిన తర్వాత మరింత రుచికరంగా మరతాయట. వాటిలోని పోషక విలువులు కూడా రెండింతలు అవుతాయట. ఆశ్చర్యకరంగా అనినిపించినప్పటికీ ఇది వాస్తవమే అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలు వండిన రోజు కన్నా మరుసటి రోజే రుచిగా ఉంటాయట. వీటిలోని పోషక విలువలు కూడా పెరుగుతాయట. ఆ ఆహారాలేంటో తెలుసుకుందాం..

మరుసటి రోజుకు మరింత రుచిగా మారే ఆహారాలు..

పాత రొట్టెలు:

ఇంట్లో పెద్దలు రాత్రి మిగిలిన రొట్టెలను మరుసటి ఉదయం టీతో తినడం మీరు చూసే ఉంటారు. ఇది వృథా కాకుండా ఉండేందుకు మాత్రమే అనుకుంటే మీరు పొరపడ్డట్టే. మిగిలిపోయిన రొట్టెలను వేడి చేసి తినడం ఆరోగ్యానికి చాలా మంచిదట. నిజానికి పాత రొట్టెల్లో పులియింపు ప్రక్రియ జరుగుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

మిగిలిపోయిన అన్నం:

అప్పట్లో ఇడ్లీ, దోశ వడ అంటే రోజూ పొద్దున్నే టిఫిన్లు చేసుకునే వాళ్లు కాదట. సద్దె అన్నంలో పెరుగు వేసుకుని ఆవకాయ నంచుకుని తినేవాళ్లు. ఏమాటకు ఆ మాట గానీ సద్దెన్నం, ఆవకాయ కలిపి తింటే ఆ రుచే వేరబ్బా! ఇంకో విషయం ఏంటంటే.. మిగిలిన అన్నం మరుసటి ఉదయం నాటికి మరింత పోషక విలువలను కలిగి ఉంటుందట.

భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలా మిగిలిన అన్నాన్ని ఒక ప్రత్యేకంగా వంటకంగా తింటారు. ఉడికించిన అన్నాన్ని రాత్రిపూట నీటిలో నానబెడతారు. ఆ తర్వాత ఉదయం దాంట్లో ఉల్లిపాయలు, ఉప్పు, మిర్చి వేసుకుని తింటారు. ఇలా పులియబెట్టిన అన్నం జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీంట్లో ఇనుము, సోడియం, పొటాషియం, కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పాత పాయసం:

భారతీయ ఇళ్లలో భోజనం తర్వాత కొంత తీపి తినే అలవాటు ఉంది. ఈ తీపి కోసం ఎక్కువగా అన్నం పాయసం(పరవన్నం లేదా బెల్లపుఅన్నం) తయారు చేస్తారు. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కానీ మీరు రాత్రి మిగిలిన పాయసం లేదా పరవన్నాన్ని ఉదయం తిన్నారా? తినకపోతే ఈ సారి తప్పకుండా ట్రే చేయండి. నమ్మండి, ఇది తినడానికి మరింత రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉంటుంది.

కావాలంటే రాత్రి మిగిలిన పాయసంను రిఫ్రిజిరేటర్లో చల్లబరచండి, ఆ తర్వాత మరుసటి రోజు తినండి. చల్లని పాయసం రబ్డిలా రుచిగా ఉంటుంది. ఇది మీ ప్రేగుల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పాత పెరుగు కూడా మరింత ఆరోగ్యకరం

ఒకటి లేదా రెండు రోజులు ఉంచిన పెరుగు అంటే పులిసిన పెరుగు కూడా ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా మారుతుంది. దీనిలో పులియింపు ప్రక్రియ వేగవంతమవుతుంది, ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ రకమైన పులియబెట్టిన ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. పాతబడటం వల్ల పెరుగులో అనేక రకాల విటమిన్ల మొత్తం పెరుగుతుంది. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పాలు లేదా పెరుగు జీర్ణం కానివారికి, పాత పులిసిన పెరుగు మంచి ఎంపిక అవుతుంది.

మిగిలిన రాజ్మా రేస్:

ఉట్టి అన్నం మాత్రమే కాదు.. రాజ్మా రైస్ కూడా పాతబడిన తర్వాత అంటే మరుసటి రోజుకు మరింత రుచిగా, ఆరోగ్యకరంగా మారుతుందట. రాత్రంతా ఉండటం వల్ల దీంటకలో మసాలాలు, చిక్కుళ్లు, బీన్స్ వంటివి బాగా కలిసిపోతాయి. ఫలితంగా రుచి మెరుగుపడటంతో పాటు దీంట్లోని కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. దీని వల్ల వీటిని జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది. రాజ్మాలో పుష్కలంగా ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిని గ్రహించడం కూడా శరీరానికి మరింత సులభం అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024