Indians deported from US : అమెరికా నుంచి వచ్చిన వారిలో 33 మంది గుజరాతీలు!

Best Web Hosting Provider In India 2024


Indians deported from US : అమెరికా నుంచి వచ్చిన వారిలో 33 మంది గుజరాతీలు!

Sharath Chitturi HT Telugu
Feb 07, 2025 09:56 AM IST

Indians deported from America : అమెరికా నుంచి 104 మంది భారతీయ వలసదారులు డిపోర్టేషన్​ మీద దేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసందే. వీరిలో 33 మంది గుజరాతీలు, ముగ్గురు యూపీ వాసులు ఉన్నారు.

అమెరికా నుంచి తిరిగొచ్చిన భారతీయ వలసదారులు..
అమెరికా నుంచి తిరిగొచ్చిన భారతీయ వలసదారులు.. (AP)

అక్రమ వలసల కారణంగా అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 104 మంది భారతీయుల్లో గుజరాత్​కు చెందినవారు 33 మంది ఉన్నారు! ప్రభుత్వ వాహనాల్లో, పోలీసుల పర్యవేక్షణల్లో వీరిందరిని స్వస్తలాలకు తరలించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

yearly horoscope entry point

అమెరికా నుంచి వచ్చిన వారిలో 33మంది గుజరాతీలు..

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కఠిన చర్యల నేపథ్యంలో 104 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం అమృత్​సర్​లో ల్యాండ్​ అయిన విషయం తెలిసిందే. కాగా ఆ మరుసటి రోజే, మహిళలు, పిల్లలతో పాటు 33 మంది గుజరాతీ వలసదారులతో కూడిన విమానం అమృత్​సర్ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.

అమృత్​సర్ విమానాశ్రయంలో వెరిఫికేషన్, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్​కు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, ఈ 33 మంది గురువారం ఉదయం 6.10 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగారు. అనంతరం వారిని వారి స్వస్థలాలకు తరలించారు.

తాజా పరిస్థితులను గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని బహిష్కరణకు గురైన వలసదారులను భద్రత కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

యూపీ నుంచి ముగ్గురు..!

కాగా అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన 104మందిలో యూపీకి చెందిన ముగ్గురు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కూడా అమెరికాలోకి అక్రమ దారిలో ప్రవేశించి అధికారులకు దొరికిపోయారు.

పిలిభిత్​ పూరన్​పూర్​లోని బంజారియా గ్రామానికి చెందిన గుర్​ప్రీత్ సింగ్ 22 రోజుల క్రితమే యూకే నుంచి అమెరికాకు చేరుకున్నట్లు అతని తల్లి జస్వీందర్ కౌర్ తెలిపారు. ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక హోటల్ మేనేజ్​మెంట్ కోర్సు చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబర్​లో అతను యూకే వెళ్లాడు. తాను అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు 22 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

అయితే, గుర్​ప్రీత్​తో జనవరి 14న చివరిసారిగా ఫోన్​లో మాట్లాడిన తర్వాత అతడితో సంబంధాలు తెగిపోయాయని, రెండు రోజుల క్రితం అతడిని అరెస్టు చేసి అమెరికా నుంచి బహిష్కరిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

2009 నుంచి ఇప్పటి వరకు 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.

అయితే, బుధవారం అమృత్​సర్ చేరుకున్న పలువురు బహిష్కృతులు విమానం అంతటా తమ చేతులు, కాళ్లు సంకెళ్లు వేశారని, ల్యాండింగ్ అయిన తర్వాతే వాటిని తొలగించారని పేర్కొన్నారు. తిరిగొచ్చిన వారిలో 37 మంది 18-25 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, మరో 30 మంది 30ఏళ్ల లోపు వారు ఉన్నారు. అరెస్టుకు ముందు కొందరు అమెరికాలో కొన్ని రోజులు మాత్రమే గడిపారు. మరికొందరు అనేక వారాల పాటు కస్టడీలో ఉన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link