Best Web Hosting Provider In India 2024
OTT Romantic Comedy: తెలుగులో రిలీజైన మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ – ఐదుగురు హీరోయిన్లతో దేవర విలన్ రొమాన్స్!
OTT Romantic Comedy: దేవర ఫేమ్ షైన్ టామ్ చాకో హీరోగా నటించిన మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ తెలుగులోకి వచ్చింది. వివేకానందన్ వైరల్ పేరుతో శుక్రవారం ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటించారు.
మలయాళంలో రొమాంటిక్ కామెడీ మూవీ వివేకానందన్ విరలను తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. వివేకానందన్ వైరల్ పేరుతో ఆహా ఓటీటీలో శుక్రవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో టామ్ షైన్ చాకో హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో షైన్ టామ్ చాకోకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై కథానాయికగా నటించారు.
పాజిటివ్ టాక్…
గత ఏడాది మలయాళంలో థియేటర్లలో రిలీజైన వివేకనందన్ వైరల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. షైన్ టామ్ చాకో యాక్టింగ్‌తో పాటు సినిమాలోని మెసేజ్ బాగుదంటూ కామెంట్స్ వచ్చాయి. వివేకనందన్ వైరల్ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కమల్ దర్శకత్వం వహించాడు.
వివేకానందన్ వైరల్ కథ ఇదే…
వివేకానందన్ వైరల్… కథ విషయానికి వస్తే.. ఇద్దరు మహిళల్ని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని వారిని… వేధిస్తూ తిరిగే ఓ భర్త.. అతనికి బుద్ది చెప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథ ఇది. వివేకానందన్ ప్రభుత్వ ఉద్యోగి. మంచి విలాస పురుషుడు .. ఆపై శృంగార పురుషుడు. భార్య సితార ఉండగానే మరో మహిళతో లివింగ్ రిలేషన్‌లో ఉంటాడు. భర్త నిజస్వరూపం తెలుసుకున్న సితార ఏం చేసింది? వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? వివేకానందన్‌కు బుద్ది చెప్పిన ఐదుగురు మహిళలు ఎవరు? అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ కమల్ ఈ మూవీని రూపొందించాడు.
వందో సినిమా…
షైన్ టామ్ చాకో నటించిన 100వ సినిమా ఇది. ఈ మూవీలో ఉమనైజర్‌గా పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్‌లో తన యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించాడు షైన్ టామ్ చాకో. మలయాళంలో విలన్‌గా ఫేమస్ అయినా షైన్ టైమ్ చాకో నాని దసరా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డాకు మహారాజ్, దేవర, రంగబలి సినిమాలు చేశాడు. ప్రస్తుతం మలయాళంలో బిజీ యాక్టర్స్‌లో ఒకరిగా కొనసాగుతోన్నాడు. పదికిపైగా సినిమాలు చేస్తోన్నాడు. 2024లో మలయాళం, తెలుగు, తమిళంలో కలిపి పదిహేనుకుపైగా సినిమాలు చేశాడు.
నలభైకిపైగా సినిమాలు….
మలయాళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కమల్ పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో నలభైకిపైగా సినిమాలు చేసిన ఆయన పలు అవార్డులు అందుకున్నాడు. 2019లో లైంగిక ఆరోపణలతో సినిమాలకు దూరమైన కమల్…వివేకానందన్ విరలను మూవీతో ఐదేళ్ల తర్వాత మలయాళంలోకి రీఎంట్రీ ఇచ్చాడు.