![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/trains_1696755267564_1738904276572.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/trains_1696755267564_1738904276572.jpg)
Trains Cancellation: ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు
Trains Cancellation: తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్లు రద్దు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు- ఏలూరు నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో ఏపీలో, ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో తెలంగాణలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Trains Cancellation: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సెక్షన్లలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో భారీగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
విజయవాడ రైల్వే డివిజన్‌లో నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్‌ను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్ లాకింగ్ పనుల్ని చేపడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 8న ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లి స్తున్నారు.
ఈ రైళ్లు రద్దు…
రాజమహేంద్రవరం-విజయవాడ (67261), విజయవాడ- రాజమహేంద్రవరం (67262), విజ యవాడ-రాజమహేంద్రవరం (67202), రాజమ హేంద్రవరం-విజయవాడ (67201). కాకినాడ పోర్టు-విజయవాడ(17258), విజయవాడ-కాకి నాడ పోర్టు(17257) రైళ్లు శనివారం (ఫిబ్రవరి 8వ తేదీన) రద్దు చేశారు.
శుక్రవారం దారి మళ్లించే రైళ్లు…
- షాలిమార్-చెన్నై సెంట్రల్ (12841), షాలిమార్-హైదరాబాద్ (18045), ధన్బాద్-అలప్పుజ (13351), సంత్రాగచి-చెన్నై సెంట్రల్ (22801), టాటా-బెంగళూరు (12883) ఎక్స్ ప్రెస్ రైళ్లను నిడదవోలు-గుడివాడ-విజయవాడ మీదుగా మళ్లిస్తారు.
- సీఎస్టి ముంబై- భువనేశ్వర్ (11019), బెంగళూరు-గౌహతి (12309) రైళ్లను విజయవాడ-గుడివాడ-నిడదవోలు మీదుగా దారి మళ్లిస్తారు.
- శనివారం ఫిబ్రవరి 8వ తేదీన కాకినాడ పోర్టు-ఎన్టీటీ ముంబయి (17221), విశాఖపట్నం-గుంటూరు (17240) రైళ్లను నిడదవోలు-గుడి వాడ-విజయవాడ మీదుగా, గుంటూరు-విశాఖ పట్నం (17239). సికింద్రాబాద్- సంత్రాగచి (07221), (12806), చెన్నై సెంట్రల్-షాలిమార్ (12842) రైళ్లను విజ యవాడ-గుడివాడ-నిడదవోలు మీదుగా మళ్లిస్తారు.
తెలంగాణలో రైళ్లు రద్దు…
ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న నాన్ఇం టర్ లాకింగ్ పనుల నేపథ్యంలో 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజ యవాడ, భద్రాచలంరోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 10 వ తేదీ నుంచి 20 వరకు రద్దు చేశారు.
గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. మరో 9 రైళ్లను దారి మళ్లిస్తారు. నాలుగు రైళ్లు 60 నుంచి 90 నిమిషాల ఆలస్యంగా బయల్దేరనున్నాయి.
రద్దయిన రైళ్లు ఇవే…
- సికింద్రాబాద్-గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు రద్దు చేశారు.
- సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లను 10 నుంచి 21 వరకు రద్దు చేశారు.
- గుంటూరు-సికింద్రాబాద్ (12705/12706) ఇంటర్సెటీ ఎక్స్‌ప్రెస్ 10, 11, 15, 18, 19, 20 తేదీలలో రద్దు చేశారు.
- విజయవాడ- సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 11, 14, 16, 18, 19, 20 తేదీల్లో రద్దు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్ ప్రెస్ 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ప్రెప్రెస్ 9, 11, 14, 18, 19 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా నడుస్తాయి.
టాపిక్