Best Web Hosting Provider In India 2024
PalaKova Recipe: పాలకోవాను ఇలా నిమిషాల్లో పాలపొడితో చేసేయండి, రుచి అదిరిపోతుంది
PalaKova Recipe: పాలపొడితో కోవాను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ చేయడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం.
పాలకోవా పేరు చెబితేనే తెలుగువారికి నోరూరిపోతుంది. ఎన్ని స్వీట్లు ఉన్నా పాలకోవా ప్రత్యేకతే వేరు. దీన్ని ఇష్టపడని వారు ఉండరు. పాలకోవా చేయాలంటే బోలెడన్నీ పాలు కావాలి. అప్పటికప్పుడు ఈ స్వీట్ ను తయారుచేసుకుని తినాలనిపిస్తే పాలతోనే కాదు పాలపొడితో కూడా చేయవచ్చు. కొన్ని నిమిషాల్లోనే ఈ స్వీట్ ను తయారుచేసుకోవచ్చు.
పాలపొడితో కోవా తయారు చేయడం చాలా సులభం. తక్కువ పదార్థాలతో ఇంట్లో రుచికరమైన నోరూరించే కోవా ఎలా తయారుచేయాలో ఇక్కడ ఇచ్చాము. పిల్లలు కూడా దీనిని ఇష్టపడతారు. ఏదైనా పండుగల సమయంలో, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ సులభమైన రెసిపీని ప్రయత్నించండి.
పాలకోవా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పాలు – 1 కప్పు
పాలపొడి – పావు కిలో
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
పంచదార పొడి – పావు కప్పు
కుంకుమపువ్వు – చిటికెడు
యాలకుల పొడి – పావు స్పూన్
పాలకోవా రెసిపీ
- పాలకోవా చేయడానికి ఒక స్పూను పాలలో ముందుగానే కుంకుమ పువ్వు రేకులను వేసి నానబెట్టండి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
- ఆ నెయ్యిలో పాలు పోసి మరిగించండి.
- పాలు మరిగాక అందులో పాలపొడి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపండి.
- ఈ మొత్తం మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రేకులు, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపండి.
- తరువాత అందులో మిక్సీలో మెత్తగా పొడి చేసిన పంచదార పొడిని కూడా వేసి బాగా కలపండి.
- ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
- చేతులకు కాస్త నెయ్యి రాసుకుని కోవా ముద్ద నుంచి కొంత మొత్తాన్ని తీసి కోవాల్లాగా చుట్టుకోవాలి.
- పైన మీకు కావాలంటే డ్రైఫ్రూట్స్ తరుగు చల్లి గార్నిషింగ్ చేసుకోవచ్చు. అంతే కోవాలు రెడీ అయినట్టే.
ఈ కోవాలను నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి. వీటిని తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలన్న కోరిక పెరిగిపోతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కోవాలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇవి మీకు ఎంతో నచ్చుతాయి.
సంబంధిత కథనం