


కృష్ణాజిల్లా / మచిలీపట్నం :
ది.12-7-2022 (మంగళవారం) ..
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు ..
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆస్తులను పరిరక్షించి .. వాటి ద్వారా ఆదాయ వనరులు పెంపొందించడమే ప్రధాన అంశంగా చర్చించారు , అనంతరం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ,రైతులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే అంశంపై కూడా చర్చ జరిపారు ..
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ ,ఏలూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు ..