Ishika Taneja: సన్యాసం పుచ్చుకున్న మరో నటి.. ఈసారి మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేయొద్దంటూ..

Best Web Hosting Provider In India 2024

Ishika Taneja: సన్యాసం పుచ్చుకున్న మరో నటి.. ఈసారి మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేయొద్దంటూ..

Hari Prasad S HT Telugu
Feb 07, 2025 04:22 PM IST

Ishika Taneja: మాజీ మిస్ ఇండియా ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంది. పొట్టి దుస్తుల్లో మహిళలు డ్యాన్స్ చేయొద్దంటూ హితవు పలుకుతోంది. ఈమె పేరు ఇషికా తనేజా. మహా కుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో మునిగి కాషాయం కట్టింది.

సన్యాసం పుచ్చుకున్న మరో నటి.. ఈసారి మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేయొద్దంటూ..
సన్యాసం పుచ్చుకున్న మరో నటి.. ఈసారి మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేయొద్దంటూ..

Ishika Taneja: మహా కుంభమేళాకు క్యూ కడుతున్న నటీమణులు.. గ్లామర్ ప్రపంచానికి గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. ఈ మధ్యే మమతా కులకర్ణి కాషాయం కట్టగా.. తాజాగా మరో నటి, మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా కూడా అదే రూట్లో వెళ్లింది. మహా కుంభమేళాలో త్రివేణీ సంగమంలో మునిగిన ఆమె.. ఇక నటనకు గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టనున్నట్లు చెప్పింది.

yearly horoscope entry point

ఇషికా తనేజా సన్యాసం

ఇషికా తనేజా మహా కుంభమేళాలో ఉన్న పలు ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఈ నటి ఇక గ్లామర్ ప్రపంచానికి దూరం కానుంది. ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. పొట్టి దుస్తుల్లో మహిళలు డ్యాన్స్ చేయకూడదని కూడా బోధిస్తోంది. 2017లో వచ్చిన ఇందు సర్కార్ మూవీలో నటించిన ఇషికా తీసుకున్న ఈ నిర్ణయం షాక్ కు గురి చేసింది.

ఆధ్యాత్మికత మార్గంలో వెళ్లినప్పుడే జీవితంలో నిజమైన మనశ్శాంతి లభిస్తుందని ఆమె చెప్పడం విశేషం. ఆమె ఈ మధ్యే స్వామీ కైలాష్ ఆనంద్ గిరి జీ మహారాజ్ మహామండలేశ్వర్ నిరంజిని అఖాడాను కలిసింది. ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించే ప్రపంచ ప్రఖ్యాత గురువును కలవడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ ఓ వీడియోను ఇషికా పోస్ట్ చేసింది.

ఎవరీ ఇషికా తనేజా?

ఇషికా తనేజా 2017-18లో మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ కూడా గెలుచుకుంది. 2016లో 100 సక్సెస్‌ఫుల్ వుమెన్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇందు సర్కార్ మూవీతోపాటు విక్రమ్ భట్ తీసిన హ్యాడ్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. అంతేకాదు ఆమె 60 నిమిషాల్లో 60 మందికి ఫుల్ ఎయిర్ బ్రష్ మేకప్స్ పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.

ఈ ఏడాది జనవరిలో ఇషికా తనేజా గురు దీక్ష తీసుకుంది. తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు లభించినా.. జీవితం మాత్రం పరిపూర్ణమైన ఫీలింగ్ కలగలేదని అప్పట్లో ఆమె చెప్పింది. అందుకే తాను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నట్లు తెలిపింది. ప్రతి అమ్మాయికి తన మతం గొప్పతనం తెలియాలని కూడా అభిప్రాయపడింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024