![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
Visakhapatnam : స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఆదివాసీ నేతల ఆగ్రహం.. రెండ్రోజులు ఏజెన్సీ బంద్!
Visakhapatnam : ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదంలో చిక్కుకున్నారు. 1/70 చట్టాన్ని సవరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అయన్న ఏమన్నారు.. 1/70 చట్టం ఏంటి.. ఓసారి చూద్దాం.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఆదివాసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. 1/70 చట్టాన్ని సడలించాలని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు గుర్రున ఉన్నారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఏజెన్సీ ప్రాంతం బంద్‌కు సిద్ధమయ్యారు. ఈనెల 11, 12 తేదీల్లో 48 గంటల పాటు నిరవధిక ఏజెన్సీ బంద్ నిర్వహించనున్నాట్లు ఆదివాసీ నేతలు ప్రకటించారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
సంయుక్తంగా బంద్‌కు పిలుపు..
ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్‌లో పాల్గొననున్నాయి. ఇప్పటికే వైసీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు.. గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగుల సంఘం, మహిళ సంఘాలు, ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంఘాలు బంద్‌కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన మన్యం పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో కొంత ప్రాంతంలో ఉంటుంది. వేలాది మంది గిరిజన, ఆదివాసీ ప్రజలు బంద్‌లో పాల్గొననున్నట్లు ఆయా సంఘాల నేతలు వెల్లడించారు.
అయ్యన్న ఏమన్నారు?
జనవరి 27న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో పెట్టుబడుల ప్రాంతీయ సదస్సు జరిగింది. దీంట్లో మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి ఆయన అరకు చలి ఉత్సవం బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. పెట్టుబడిదారులు అనుమతి కోసం ఏడాది కాలం తిరగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కాలయాపన కారణంగా పెట్టుబడిదారులు వెనక్కి పోతున్నారని, అప్లికేషన్ వచ్చిన వారం రోజుల్లో సమాధానం ఇచ్చేలా చర్యలు ఉండాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేందుకు స్థానికులుగా ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూపాలని, 1/70 చట్టాన్ని సవరించాలని వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని సడలిస్తే పెట్టుబడిదారులు ముందుకు వస్తారని స్పష్టం చేశారు.
ఆదివాసీ నేతలు ఆగ్రహం..
గిరిజనలకు రక్షణగా కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు.. ఏజెన్సీ ప్రాంతంలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బంద్ చేసేందుకు సిద్ధం అయ్యారు. పాడేరులో రాజకీయ పార్టీల నేతలు, గిరిజన సంఘాల నేతలు గురువారం సాయంత్రం సమావేశం అయ్యారు. వైసీపీ పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, దండకారణ్య ఉద్యోగ సమితి ప్రతినిధి సమరెడ్డి మాణిక్యం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాధాకృష్ణ, కాంగ్రెస్ నేతలు శతక బుల్లిబాబు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సూర్ల అప్పారావు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖీ శేషాద్రి, ఆదివాసీ సేన అధ్యక్షుడు చుంచు రాజు తదితరులు దీంట్లో పాల్గొన్నారు.
క్షమాపణలు చెప్పాలి..
అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. ఆదివాసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 11, 12 తేదీల్లో 48 గంటల పాటు నిరవధికంగా ఏజెన్సీని బంద్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయని ఆరోపించారు. గిరిజన ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకునేందుకు ఈ పన్నాగం పన్నుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతం జోలికి ఎవరు వచ్చిన చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
బ్రిటీష్ హయాంలోనే..
స్వాతంత్ర సమరయోధుల పోరాటాలతో భూ బదలాయింపు నిషేధ చట్టం 1917లో బ్రిటీష్ ప్రభుత్వం హయాంలోనే వచ్చిందని.. ఆదివాసీ నేతలు వివరిస్తున్నారు. 1959, 1970ల్లోనూ మరిన్ని సవరణలు చేసి చట్టాన్ని కఠినతరం చేశారని చెబుతున్నారు. 5వ షెడ్యూల్ గురించి మాట్లాడే హక్కు స్పీకర్ అయ్యన్నకు లేదని, తన అధికార పరిధి మించి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఆయనకు 1/70 చట్టం గురించి అవగాహన లేదని అంటున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్