Meditation For Peace: రోజులో ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ కోసం కేటాయించండి! ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడండి!

Best Web Hosting Provider In India 2024

Meditation For Peace: రోజులో ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ కోసం కేటాయించండి! ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడండి!

Ramya Sri Marka HT Telugu
Feb 07, 2025 08:30 PM IST

Meditation For Peace: మీ మానసిక ప్రశాంతత కోసం రోజులో ఎంత సమయం కేటాయిస్తున్నారు. గంటల సమయానికి భయపడి యోగా చేయడం మానేస్తున్నారా.. కేవలం 5 నిమిషాలు కేటాయించండి. ఏకాగ్రతను పెంచి, ప్రశాంతమైన జీవితం పొందండి.

 రోజులో ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ కోసం కేటాయించండి!
రోజులో ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ కోసం కేటాయించండి!

రోజువారీ కార్యక్రమంలో నుంచి కేవలం 5 నిమిషాలు మీ కోసం కేటాయించడం ద్వారా మీరు శరీరానికి అనేక ప్రయోజనాలను అందించవచ్చు. మెడిటేషన్ అనేది యోగాలోని ఒక శక్తివంతమైన అభ్యాసం, దీని ద్వారా మనస్సును నియంత్రించవచ్చు. అదే సమయంలో, మెడిటేషన్ ద్వారా మీరు మొత్తం శరీరంపై నియంత్రణను పొందవచ్చు. సాధారణంగా, ప్రజలు కనీసం 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలి, కానీ ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో మీ కోసం మీరు అంత సమయం కేటాయించుకోవడం కూడా చాలా కష్టం. అయినప్పటికీ, మీరు మెడిటేషన్ కోసం ఒక 5 నిమిషాల సమయం కేటాయించినా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

yearly horoscope entry point

రోజుకు ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం

బ్లడ్ ప్రెషర్ (బీపీ) నియంత్రణలో సహాయపడుతుంది

అనేక అధ్యయనాలు మెడిటేషన్ బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించే మందుల మాదిరిగా పనిచేస్తుందని కనుగొన్నాయి. మెడిటేషన్ చేయడం వల్ల శరీరం ఒత్తిడి హార్మోన్లకు తక్కువగా స్పందిస్తుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మీరు చేస్తున్న పనిపై ఫోకస్ పెంచడం కోసం

ఒక అధ్యయనంలో, మెడిటేషన్ బోరింగ్ పనులపై దృష్టి పెట్టడాన్ని అడ్డుకుంటుందని తేలింది. అంతేకాకుండా, మెడిటేషన్ చేసేవారు సులభంగా మెమొరీలను గుర్తుంచుకోగలుగుతారు. అంతేకాకుండా నిర్ణయాలను సమర్థవంతంగా తీసుకోగలుగుతారు.

దైనందిన జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది

చాలా మంది భవిష్యత్తు గురించి ఆందోళన, పదేపదే ఒకే విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి వారు మెడిటేషన్ చేస్తే, మీలో కలిగే గందరగోళ ఆలోచనల నుంచి, మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలుగుతారు. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

మంచి ప్రశాంతమైన నిద్రకు ఉపయోగకరం

మెడిటేషన్ ద్వారా నిద్రించే ముందు మనస్సును శాంతింప చేయవచ్చు. అంతేకాకుండా, మెడిటేషన్ నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు తోడ్పాటు

ఒత్తిడి ప్రభావం నేరుగా జీర్ణవ్యవస్థపై ఉంటుంది. ఒత్తిడి కారణంగా వాపు, యాసిడ్ రియాక్షన్, పేగుల్లో పుండ్లు, ఆహారం వల్ల అలర్జీలు కూడా కలగవచ్చు. మీరు మెడిటేషన్ చేసినప్పుడు, శరీరం రిలాక్స్ అవుతుంది. దీని వల్ల విరేచనాలు, మలబద్ధకం లక్షణాలలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

యోగా చేయాలనుకునేవారు గుర్తించుకోవాల్సిన విషయాలు

శాంతియుత ప్రదేశం ఎంచుకోండి

యోగా చేయాలనుకుంటున్న మీరు ఆత్మస్థితిలో ఉండటానికి మంచి ప్రదేశం ఎంచుకోండి. మౌనంగా ఉండే స్థలం, లేదా మీకు ఇష్టం అయిన పరికరాలు (మీ దృష్టిని కేంద్రీకృతం చేసుకునేందుకు కొవ్వొత్తులు, కౌంట్ డౌన్ శాండ్) కూడా ఉపయోగకరమైనవనే చెప్పాలి.

దీర్ఘ శ్వాస

మీ శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభించండి. గాఢమైన, దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ, ప్రతి శ్వాస తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

మనస్సు నిలిపివేయండి

ఎటువంటి ఆలోచనలకు కూడా అనుమతించకుండా, ప్రస్తుతమున్న క్షణంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

వర్క్ అవుట్ చేస్తూ ఉండండి

ప్రతి రోజు 5 నిమిషాల పాటు చేయాలనుకుంటున్న మెడిటేషన్‌ను క్రమంగా పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఒక 10 నిమిషాలకు ఆ తర్వాత 15 నిమిషాల వరకూ పెంచుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024