Best Web Hosting Provider In India 2024
Siddu Jonnalagadda Jack Teaser: స్టార్ బాయ్ యాక్షన్ మోడ్.. సిద్దూ జొన్నలగడ్డ జాక్ టీజర్ చూశారా.. ముద్దొస్తున్న వైష్ణవి
Siddu Jonnalagadda Jack Teaser: స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న జాక్ మూవీ టీజర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజైంది. ఇందులో తన యాక్షన్ మోడ్ ఆన్ చేశాడు సిద్దూ. అటు వైష్ణవి అయితే ముద్దొచ్చేలా ఉంది.
Siddu Jonnalagadda Jack Teaser: సిద్దూ జొన్నలగడ్డకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ మూవీస్ తో అతడు స్టార్ బాయ్ గా మారిపోయాడు. ఇప్పుడీ స్టార్ బాయ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి జాక్ మూవీ చేస్తున్నాడు. వైష్ణవి చైతన్య ఫిమేల్ లీడ్ గా చేస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 7) ఈ సినిమా టీజర్ రిలీజైంది.
జాక్ టీజర్ రిలీజ్
గతేడాది టిల్లూ స్క్వేర్ మూవీతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ. ఇప్పుడు జాక్ అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బొమ్మరిల్లు మూవీ ఫేమ్ డైరెక్టర్ భాస్కర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 7) సిద్దూ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూస్తుంటే సిద్దూ మార్క్ మూవీ మళ్లీ రాబోతోందని స్పష్టమైంది.
ఈ టీజర్ మూవీలో సిద్దూ తండ్రి పాత్ర పోషించిన నరేష్ పాత్ర డైలాగుతో మొదలవుతుంది. తన ప్రాబ్లం పేరు పాబ్లో నెరుడా అని అతడు అంటాడు. తన కొడుకు అసలు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్నది అతని కోరిక. కానీ సిద్దూ మాత్రం సీక్రెట్ గా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. జేబులు కొట్టడం, బైకు దొంగతనాల్లాంటివి చేస్తుంటాడు. మరి ఎందుకిలాంటి డ్రెస్ వేసుకున్నవని అడిగితే.. ఏం చేస్తున్నావని ఎవరూ అడగకుండా ఉండటానికి అలా ఓ డ్రెస్సు, మెడలో ఐడీ కార్డు వేసుకున్నానని హీరోయిన్ కు చెబుతాడు.
అటు తండ్రితో నువ్వు ఉరేసుకున్నా నేను ఏం కావాలనుకుంటున్నానో చెప్పను అని అంటాడు. ఆ వెంటనే టీజర్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మొత్తానికి సుమారు 90 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ద్వారా మూవీ స్టోరీ పెద్దగా రివీల్ కాలేదు. కానీ స్టార్ బాయ్ మాత్రం మరోసారి తన ఛార్మ్ తో ఆకట్టుకున్నాడు. అటు వైష్ణవి చైతన్య క్యూట్ లుక్స్ తో ముద్దొచ్చేలా ఉంది. టీజర్ చివర్లో ఆమె చీర లుక్ అదిరిపోయింది.
జాక్ మూవీ గురించి..
సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటిస్తున్న జాక్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ మూవీని నిర్మిస్తోంది.
మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ సినిమాలో సిద్దూ, వైష్ణవితోపాటు ప్రకాశ్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. జాక్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీంతో ట్రైలర్, మూవీ రిలీజ్ పై మరింత ఆసక్తి పెరిగింది.
సంబంధిత కథనం