Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Karthika_Feb_8_1738979589804_1738979600538.jpg)
Karthika Deepam 2 Serial February 8: జ్యోత్స్న ఫోన్.. కావేరిపై శ్రీధర్ అనుమానం.. విషయం దాచిన దీప.. కంగారు పెట్టిన దాసు
Karthika Deepam 2 Serial Today Episode February 8: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో.. శౌర్య ఆపరేషన్‌కు ఎవరు డబ్బు ఇచ్చారని జ్యోత్స్న పేపర్లో రాసుకొని మరీ ఆలోచిస్తుంది. శివన్నారాయణ ఫ్యామిలీని హోమానికి పిలిచిన విషయాన్ని దీప దాచేస్తుంది. దాసు స్పృహలోకి వస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 8) ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్ జరిగిన సందర్భంగా నిర్వహించే హోమానికి కావేరికి ఆహ్వానం పలుకుతుంది దీప. ఆపరేషన్ కోసం డబ్బు ఇచ్చిన కావేరికి ఆప్యాయంగా బొట్టు పెట్టి పిలుస్తుంది. తప్పకుండా రావాలని అంటుంది. ఇదంతా బయటి నుంచే చూస్తాడు శ్రీధర్. దీప ఇంటికి ఎందుకొచ్చిందేంటి, నా పెళ్లానికి బొట్టు పెడుతోందేంటి అని ఆలోచిస్తుంటాడు. దీప అక్కడి నుంచి వెళ్లి వెంటనే ఇంట్లోకి వస్తాడు శ్రీధర్.
అసలు విషయం చెప్పని కావేరి
ఇంటికెవరో వచ్చినట్టు ఉన్నారు అని కావేరి శ్రీధర్ ప్రశ్నిస్తాడు. ఎక్కడో ఏదో హోమం ఉందంట, పిలవడానికి వచ్చారని బదులిస్తుంది కావేరి. ఇంతకీ ఎవరో వచ్చిన వాళ్లు అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. నాకు కావాల్సిన వాళ్లు అని కావేరి అంటుంది. అంతకావాల్సిన వాళ్లా.. ఎవరో వాళ్లు అని సాగదీస్తాడు శ్రీధర్. పేరేంటి.. వరుసేంటి అని ప్రశ్నిస్తాడు. మంచి పేరే అని కావేరి అంటుంది. నా కూతురి మొగుడి పెద్ద అత్తయ్య మనవరాలి తండ్రికి బాగా కావాల్సిన మనిషి అని పజిల్లా చెబుతుంది కావేరి. వచ్చింది దీప అని చెప్పలేక ఈ డొంక తిరుగుడు వ్యవహారం ఎందుకో అని శ్రీధర్ అనుకుంటాడు.
శ్రీధర్‌పై జ్యోత్స్న అనుమానం
దీప మాటలకు శివన్నారాయణ ఎక్కడ కరిగిపోతాడో.. అలా జరగకూడదని ప్రయత్నించానని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఇంతలో పేపర్‌పై శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర, పారిజాతం, శ్రీధర్, కాశీ, స్వప్న కావేరి పేర్లను రాసి ఉంటుంది దీప. జనాభా లెక్కలు రాస్తున్నావా అని పారు అంటే.. దీపకు సాయం ఎవరు చేశారో ఆలోచస్తున్నానని జ్యోత్స్న బదులిస్తుంది. అది కనిపెట్టాలని చెబుతుంది.
తాత శివన్నారాయణ, తల్లిదండ్రులు దశరథ్, సుమిత్ర.. శౌర్య ఆపరేషన్‌కు డబ్బు సాయం చేసి ఉండరని కారణాలతో చెబుతుంది. పారిజాతం కూడా నన్ను అనుమానిస్తావా అంటే.. లేదులే అంటుంది జ్యోత్స్న. కాశీ, స్వప్నకు అంత సీన్ లేదు అని చెబుతుంది. దాసు పేషెంట్ అని గుర్తు చేస్తుంది. కావేరి ఇచ్చి ఉంటే అని పారిజాతం అంటుంది. కాంచన అత్తయ్య కావేరికి అసలు విలువ ఇవ్వదు.. కావేరిని సెకండ్ సెటప్లాగే అందరూ చూస్తారని, ఆమె సాయం చేసి ఉండదని జ్యోత్స్న అంటుంది. కార్తీక్‌కు కూడా ఎప్పుడూ ఆమెను పిన్ని అని కూడా పిలవలేదని అంటుంది. నిజంగా డబ్బు ఇచ్చిన కావేరి పేరును కొట్టేస్తుంది. కార్తీక్ బావకు సాయం చేస్తానని అతడి తండ్రి శ్రీధర్ చాలాసార్లు ఆఫర్ ఇచ్చాడని, అతడే శౌర్య ఆపరేషన్‌కు డబ్బు ఇచ్చి ఉంటాడని జ్యోత్స్న అనుమానిస్తుంది. పేపర్‌పై శ్రీధర్ పేరును రౌండప్ చేస్తుంది. ఏ రకంగా ఆలోచించినా బావకు హెల్ప్ చేయగలిగిన మనిషి శ్రీధర్ మామయ్యే అయి ఉంటాడని జ్యోత్స్న అంటుంది.
పిలుపుల విషయం దాచిన దీప
హోమం కోసం వస్తువులను తీసుకొని ఇంట్లోకి వస్తాడు కార్తీక్. దీప అని అరిస్తే ఇంట్లో లేదని అనసూయ చెబుతుంది. ఎక్కడికి వెళ్లిందని అంటే.. ఇంతలోనే కావాల్సిన వాళ్లను పిలిచేందుకు వెళ్లానంటూ దీప వస్తుంది. బాబాయి దాసును చూసుకునేందుకు కాశీ ఉండిపోతాడని, స్వప్న మాత్రమే వస్తుందని దీప చెబుతుంది.
కావాల్సిన వాళ్లందరినీ పిలిచేశావా, ఏమన్నారు అని దీపను కార్తీక్ అడుగుతాడు. మరీమరీ పిలిచాను బాబు, మర్యాద కోసమైనా వస్తారని దీప అంటుంది. మర్యాద కోసం కాకుండా.. మనుషుల కోసం వచ్చేవారే కావాలని అని కార్తీక్ అంటాడు. అలాంటి వారినే పిలుచానంటుంది దీప. ఈ చోటికి కొత్త కదా.. పిలిచిన వారు ఏమీ అనలేదు కదా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. దీంతో శివన్నారాయణ అన్న మాటలను దీప గుర్తుచేసుకుంటుంది. అనేవాళ్లు అంటూనే ఉంటారు బాబు, మంచి కోసం మనం ఓ అడుగు ముందుకు వేస్తే వాళ్లే అర్థం చేసుకుంటారని దీప అంటుంది.
ఎవరు ఏమైనా అన్నారా అని కార్తీక్ అంటే దీప చెప్పదు. తాత శివన్నారాయణ కుటుంబాన్ని పిలిచేందుకు వెళ్లిన సమయంలో తనకు ఎదురైన మాటలను, అవమానాన్ని గురించి దాచేస్తుంది. కావేరిని పిలిచిన విషయం కూడా చెప్పదు.
పెళ్లామంటే ఎంత ప్రేమో
హోమానికి ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి అని కార్తీక్ అంటాడు. మిమల్ని ఇబ్బంది పెట్టను బాబు అని దీప చెబుతుంది. నువ్వు ఇబ్బంది పడితే.. అది కూడా నాకు ఇబ్బందే అని అక్కడి నుంచి వెళతాడు కార్తీక్. చూశావా చెల్లెమ్మ పెళ్లామంటే కార్తీక్ బాబుకు ఎంత ప్రేమో అని కాంచనకు చెప్పి మురిసిపోతుంది అనసూయ. మా అమ్మానాన్నకు దిష్టిపెట్టకు అని శౌర్య చెబుతుంది. నీకు, నాన్నకు దిష్టి తీస్తా అని శౌర్య అంటుంది. నేను దిష్టి పెట్టానని చెప్పకే అని అనసూయ అంటే.. చాక్లెట్ ఇస్తావా అని శౌర్య అడుగుతుంది. లడ్డూ పెట్టనా అని అనసూయ అడిగితే.. నేను అలాగే ఉన్నా కదా అని సరదాగా శౌర్య మాట్లాడుతుంది. చాక్లెటే కావాలంటుంది. కావాల్సిన వాళ్లను పిలిచారు కదా.. సొంతవాళ్లు పరాయివాళ్లు అయిపోయారని దిగాలుగా ఉంటుంది కాంచన. మీరు దిగులు పడకండి.. కావాల్సిన వాళ్లందరినీ పిలిచాను.. వస్తారు అంటుంది దీప.
కంగారు పెట్టిన దాసు
శౌర్యకు అంత పెద్ద ఆపరేషన్ జరిగితే తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని కాశీపై స్వప్న కోప్పడుతుంది. కార్తీక్ బావ చెప్పొద్దన్నాడని కాశీ చెబుతాడు. తాత కుటుంబం నుంచి సాయం అందకపోవడం బాధగా ఉందని స్వప్న అంటుంది. అడ్డుపడేందుకు జ్యోత్స్న ఉంది కదా అని కాశీ అంటాడు. జ్యోత్స్న పేరు వినగానే దాసు స్పృహలోకి వస్తాడు. దీపక్కకు సాయం అందకుండా జ్యోత్స్న అడ్డుపడిందని కాసీ చెబుతాడు.
మంచం నుంచి పైకి లేచి నడుస్తాడు దాసు. అన్నయ్యకు నిజం చెప్పాలి.. అది మంచిది కాదు.. నన్ను కొట్టారు.. వారసురాలు అని దాసు అయోమయంగా అంటాడు. దీంతో కాశీ, స్పప్న కంగారు పడతారు. ఎవరు కొట్టారు.. ఏమైంది.. ఏం చెప్పాలి అంటూ అంటూ వరుసగా ప్రశ్నిస్తాడు కాశీ. ఇంతలో టేబుల్‌పై ఉన్న బొమ్మ కిందపడంతో ఆ శబ్దానికి దాసు మౌనంగా మారతాడు. కాశీ, స్వప్నను గుర్తు పట్టనట్టు చూస్తాడు. నిజం ఏంటి కాశీ అడిగితే.. ఏ విషయం అంటూ అంతా మర్చిపోయినట్టు దాసు అంటాడు. దాసును మళ్లీ మంచంపై పడుకోబెతడారు కాశీ, స్పప్న.
మామయ్యను ఎందుకు అన్ని ప్రశ్నలు వేస్తున్నావని కాశీపై స్వప్న అరుస్తుంది. నాన్న ఏదో చెప్పాలనుకుంటున్నారని కాశీ అంటాడు. బొమ్మ కింద పడ్డ సౌండ్ రాగానే మామయ్య మరో రకంగా మారారనని మారారు.. గమనించావా అని స్వప్న అంటుంది. తలలో కొన్ని నరాలు చెడిపోవడం వల్ల కొందరికి ఈ సమస్యలు వస్తాయని, పూర్తిగా మొమరీ రికవరీ అయ్యే వరకు ఇలాంటి స్వింగ్ మూవ్మెంట్స్ ఉంటాయని డాక్టర్ చెప్పినట్టు స్వప్న అంటుంది. మామయ్యను మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని, కోలుకున్నాక ఆయనే చెబుతారు కదా అని కాశీతో అంటుంది. మా నాన్నను కొట్టింది ఎవరైనా నేను వదిలిపెట్టనని, వారికి ఇదే గతి పడుతుందని కోపంగా అంటాడు కాశీ. ఊరికే ఎందుకు ఆవేశపడుతున్నావని స్వప్న చెబుతుంది.
శ్రీధర్‌కు జ్యోత్స్న కాల్..
మందు తాగేందుకు అంతా సెటప్ చేసుకుంటుంటాడు శ్రీధర్. తన స్టైల్లో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. దీప వచ్చిన విషయాన్ని నా పెళ్లాం కావేరి ఎందుకు దాచింది అనుకుంటాడు. ఇంతలో జ్యోత్స్న అతడికి కాల్ చేస్తుంది. కార్తీక్‌కు మీరు దగ్గరయ్యారు కదా.. అంతా కలిసి పోయారు కదా అని జ్యోత్స్న అంటుంది. ఏ ఎదవ చెప్పింది అని శ్రీధర్ వెటకారంగా అంటాడు. నాకు నిజం తెలిసింది.. శౌర్య ఆపరేషన్ కోసం బావకు నువ్వే రూ.50లక్షల డబ్బు ఇచ్చావ్ కదా.. అందుకే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది.
ఏంటి కార్తీక్‌కు నేను హెల్ప్ చేశానా.. రూ.50లక్షలు ఇచ్చానా అని ఆశ్చర్యంగా అంటాడు శ్రీధర్. తాను ఇంకా తాగలేదని, వింటున్నది నిజమేనా అని అనుకుంటాడు. ఇలా చెప్పిన సన్నాసి ఎవరు అని, తాను కార్తీక్‌కు డబ్బు ఇవ్వలేదని తెగేసి చెబుతాడు. నువ్వు తప్ప దీపకు సాయం చేసే వారు ఎవరూ లేరు అని జ్యోత్స్న అంటుంది. దీప నా కోడలు ఏంటి.. ప్రాణం పోయినా దీపను కోడలికి అంగీకరించను.. నా కోడలు అంటే ఎప్పటికైనా నువ్వే అంటాడు శ్రీధర్. కార్తీక్, దీప వచ్చిన అడిగి ఉంటే సాయం చేసే వాడినేమో.. వారు రాలేదు.. నేను చేయలేదు అని శ్రీధర్ చెప్పేస్తాడు. మరి ఎవరు సాయం చేసి ఉంటారని జ్యోత్స్న అంటే.. నాకెలా తెలుస్తుందని శ్రీధర్ చెబుతాడు. కావేరికి ఇంత సీన్ లేదని, గీసిన గీత దాటదు చెబుతాడు. ఎక్కడో తప్పు జరిగింది మామయ్య, ఎక్కడో సాయం అందిందని జ్యోత్స్న అంటుంది. దీప పూజ చేస్తోందంట.. మమల్ని పిలిచింది అని చెబుతుంది. మీ ఇంటికి కూడా వచ్చిందా అని శ్రీధర్ అంటాడు. మీ ఇంటికి వచ్చిందా మామయ్య అంటే.. లేదు అంటూ అబద్ధం చెబుతాడు శ్రీధర్. రాలేదు.. రానివ్వను అని చెబుతాడు. మీ ఇంటికి నుంచే సాయం అంది ఉంటుందని నా డౌట్ అని జ్యోత్స్న అంటుంది. మావయ్య కూడా కాకపోతే ఇంకెవరు సాయయం చేశారని జ్యోత్స్న అనుకుంటుంది.
కావేరిపై అనుమానం.. బ్యాంక్ ఫ్రెండ్‌కు ఫోన్
దీప వచ్చిన విషయాన్ని కావేరి నా వద్ద ఎందుకు దాచిందని శ్రీధర్ అనుకుంటాడు. సూట్‌కేస్‌లో పూజ సామగ్రి సంగతి ఏంటో చూడాలని వెళతాడు. గదికి వెళ్లి సూట్‌కేస్ చూడగా అందులో పూజ సామగ్రి ఉండదు. దీంతో కావేరిపై శ్రీధర్ అనుమానం పెరుగుతుంది. తనకు సమాచారం ఇచ్చేందుకు బ్యాంక్ ఫ్రెండ్ ఆనంద రావు ఉన్నాడు కదా అని.. అతడికి కాల్ చేస్తాడు శ్రీధర్. నా వైఫ్ ఎఫ్‌డీల గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలని శ్రీధర్ అడుగుతాడు. ఆ తర్వాత షాక్ అవుతాడు. “ఏంటి ఈరోజు కావేరి బ్యాంకుకు వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేసిందా” అని శ్రీధర్ అవాక్కవుతాడు. శౌర్య ఆపరేషన్‌కు కావేరిని డబ్బు ఇచ్చిందని అర్థమైనట్టు చూస్తాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 8) ముగిసింది.
సంబంధిత కథనం