Brahmamudi February 8th Episode: బ్రహ్మముడి- గేదెలా రుద్దుకున్న కావ్య- కల్యాణ్ కంట్రోల్‌లో అప్పు- అనామికతో అల్లకల్లోలం!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi February 8th Episode: బ్రహ్మముడి- గేదెలా రుద్దుకున్న కావ్య- కల్యాణ్ కంట్రోల్‌లో అప్పు- అనామికతో అల్లకల్లోలం!

Brahmamudi Serial February 8th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌లో స్వప్న పాపకు బారసాల కావడంతో అందరికి గోరింటాకు పెడుతుంది కావ్య. పిల్లలను కని మీ బాధ్యత కూడా పూర్తి చేయాలని కావ్య, అప్పుతో అంటుంది ఇందిరాదేవి. ఇదే విషయం గదిలో రాజ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా కావ్య అడిగితే అందరిముందు చేద్దాం అని అంటాడు.
 
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 8వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 8వ తేది ఎపిసోడ్
 

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్నకు కావ్య గోరింటాకు పెడుతానంటుంది. అలాగే, ఇంట్లో ఎవరికైనా కావాలంటే చెప్పండి. పెడతాను అని కావ్య అంటుంది. గోరింటాకు పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ, ఆరేవరకు ఉండాలంటే చిరాకుగా ఉంటుంది అని రుద్రాణి అంటుంది. దాంతో ఇందిరాదేవి సెటైర్లు వేస్తుంది. ధాన్యలక్ష్మీ నీకు గోరింటాకు ఇష్టం కదా. పెట్టుకో అని అపర్ణ అంటుంది.

కల్యాణ్ కంట్రోల్‌లో అప్పు

నాకు ఇవ్వాల్సింది ఇస్తే చాలు. గోరింటాకు గట్రాలు వద్దు అని ధాన్యలక్ష్మీ అంటుంది. కావ్య ప్రేమగా అడిగింది. పెట్టించుకునేవాళ్లు పెట్టించుకోండి. అంతేగానీ మాటలతో గుచ్చకండి అని స్వప్న అంటుంది. అప్పును కూడా పెట్టుకోమని ఇందిరాదేవి అంటుంది. కల్యాణ్ సరే అనిచెప్పగానే పెట్టుకోడానికి ఒప్పుకుంటుంది అప్పు. దాంతో పెళ్లాన్ని బాగానే కంట్రోల్‌లో పెట్టుకున్నావురా కల్యాణ్ అని ఇందిరాదేవి అంటుంది.

అంటే, మేము భర్తల మాటలు వినట్లేదా అని కావ్య అంటుంది. ఈ ఇంట్లో పెళ్లాలు మాట వింటున్నారా అని సుభాష్ పంచ్ వేస్తాడు. మీరు కూడా చేరారా మావయ్య గారు అని కావ్య అంటుంది. మా నాన్న ధర్మం ఎటువైపు ఉంటే అటే ఉంటారు అని రాజ్ అంటాడు. మళ్లీ ఆస్తి గొడవ తీసుకొస్తుంది రుద్రాణి. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, అప్పటివరకు ఆగుతాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. సరదాగా మాట్లాడుకున్న మాటలు మళ్లీ కావ్యపైకి వెళ్తాయి.

కావ్యకు అందరం తోడుగా నిలబడాలని. కావ్య ఏం చేసిన అది ఇంటికోసమే అని గుర్తుంచుకోవాలి అని ఇందిరాదేవి అంటుంది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరు మాత్రం నా పార్టీనే అని కావ్య అంటే.. మావయ్య గారు కూడా నీ పార్టీనే కదా. అందుకే ఆస్తి రాసిచ్చారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పు, స్వప్నకు కావ్య గోరింటాకు పెట్టడం పూర్తి కాగానే కావ్యకు ఇందిరాదేవి పెడుతుంది. స్వప్న బిడ్డను కని తన బాధ్యత నెరవేర్చింది. ఇక మీరెప్పుడు నిర్వర్తిస్తారో ఏంటో. పని పని అని కాకుండా పిల్లలు కనే పనిమీద కూడా దృష్టిపెట్టండి అని ఇందిరాదేవి అంటుంది.

 

స్వప్న సెటైర్లు

రాజ్, రాహుల్, కల్యాణ్‌కు ఎలాంటి భార్యలు వస్తారో. కలిసి ఉంటారో లేదో అని ఒక భయం ఉండేది. కానీ, మీ ముగ్గురుని చూశాకా సంతోషంగా ఉంది. ఒకే ఇంటినుంచి ముగ్గురు రావడం మంచిదైంది. తోడి కోడళ్లులా కాకుండా ఇక్కడ కూడా అక్కా చెల్లెళ్లలా ఉన్నారు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో రుద్రాణి పంచ్‌లు వేస్తుంది. స్వప్న సైటెర్లు వేయడంతో పైకి వెళ్లిపోతుంది రుద్రాణి. గోరింటాకు అమ్మమ్మలా అద్భుతంగా ఉందని మురిసిపోతుంది కావ్య.

ఉదయాన్నే లేవాలి అని ఇందిరాదేవి చెప్పడంతో అంతా వెళ్లిపోతారు. అందరు ఇలాగే జీవితాంతం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నేను బావ కోరుకుంది ఇదే అని ఇందిరాదేవి అంటే.. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటాం అని అపర్ణ అంటుంది. మరోవైపు కావ్యను వాటర్ బాటిల్ ఇవ్వమని వర్క్ చేసుకుంటున్న రాజ్ అడుగుతాడు. గోరింటాకు పెట్టుకున్న విషయం తెలిసి అడుగుతున్నారా మర్చిపోయి అడుగుతున్నారా అని కావ్య అంటుంది.

వాటర్ బాటిల్ తీయడానికి కావ్య అవస్థలు పడుతుంటే రాజ్ చూసి తనే తీసుకుంటాడు. గోరింటాకు పెట్టుకున్నట్లు చెప్పొచ్చుగా అని రాజ్ అంటాడు. మీకు బెడ్ రూమ్‌లో వర్కే కావాలి. కానీ, భార్యకు ఏం కావాలి, ఏం ఆశిస్తుంది అని కొంటెగా కొడుతుంది కావ్య. డిస్టర్బ్ చేయకు అని రాజ్ అంటాడు. తర్వాత కావ్యకు వీపులో దురదపెడుతుంది. దాంతో గోడకు వెళ్లి రుద్దుకుంటుంది కావ్య. అది చూసిన రాజ్ ఏయ్.. పొలాల్లో నుంచి వచ్చే గేదె గోడను రుద్దుకుంటున్నట్లు రుద్దుకుంటున్నావ్ అని అంటాడు.

 

పిల్లలను కనడానికి ఒప్పుకున్న రాజ్

అబ్బా పెళ్లాన్ని గేదెలా పోల్చిన మహా రొమాంటిక్ వ్యక్తి. నేను దురదతో బాధపడుతుంటే ఇలా అంటున్నారా అని కావ్య అంటుంది. ఏంటే నీ బాధ. నీ వీపు గోకాలి అంతే కదా అని కావ్య వీపు గోకుతాడు రాజ్. దానికి కావ్య మురిసిపోతుంది. ఇందాక అమ్మమ్మ గారు చెప్పినదాని గురించి ఏమైనా ఆలోచించారా అని పిల్లల గురించి ఇన్‌డైరెక్ట్‌గా అడుగుతుంది కావ్య. తను కోరుకుంది ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు అని కావ్య అంటుంది.

అది మన బాధ్యత కదా. నానమ్మ కోరుకునేవిధంగా రేపు అందరి ముందు చేస్తాను. అప్పుడే కదా నేను ఇచ్చిన మాట మీద నిలబడినట్లు అవుతుంది అని రాజ్ అంటాడు. దాంతో కావ్య పెద్దగా షాక్ అవుతూ అందరి ముందు ఏంటండి. నేను ఒప్పుకోను అని అంటుంది. నువ్ ఒప్పుకునేది ఏంటీ. నేను నీ మొగుడుని నాకు నచ్చినట్లు చేస్తాను. నీకేం ఇబ్బంది. నువ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని రాజ్ అంటాడు. ఛీ ఛీ.. నేనేం హ్యాపీగా ఫీల్ కాను అని కావ్య అంటుంది.

 

బారసాల గ్రాండ్‌గా చేస్తే ఎందుకు ఫీల్ కావు అని రాజ్ అంటాడు. బారసాల గుర్తుంది కానీ, పిల్లల గురించి లేదు అని కోపంగా వెళ్లి గోరింటాకు కడుక్కుంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. గోరింటాకు నచ్చలేదు. మీరు కూడా వర్క్ చేసుకుని ముసుగు తన్ని పడుకోండి అని కావ్య చిరాకుగా పడుకుంటుంది. ఈ ఆడోళ్లు ఏది అర్థమయ్యేలా చెప్పరు అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు కల్యాణ్ గది అంతా చూస్తుంది అప్పు. మర్డర్ జరిగిన ప్లేస్‌లో ఇన్వేస్టిగేషన్ చేసినట్లుగా అలా చూస్తున్నావ్ అని కల్యాణ్ అంటాడు.

అమ్మ చాలా మారిపోయింది

అలా అంటావేంట్రా. నువ్ ఇక్కడ గడిపిన క్షణాలను రీక్రియేట్ చేస్తున్నాను అని అప్పు అంటుంది. అంతా సరిగ్గా ఉంటే మనం ఇదే గదిలో ఉండేవాళ్లం. మనకు నచ్చిన, తిరిగిన స్థలంలో ఉండటం చాలా హ్యాపీగా ఉంటుంది అని కల్యాణ్ అంటాడు. మరి ఇంట్లోవాళ్లు చెప్పినదాని గురించి ఆలోచించొచ్చు కదా అని అప్పు అంటుంది. లేదు మా అమ్మ చాలా మారిపోయింది. ఇంట్లో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయి. మనం ఉంటే ఎక్కువ అవుతాయి. నానమ్మ, తాతయ్యను బాధపెట్టే పని చేయలేను అని కల్యాణ్ అంటాడు.

 

అత్తయ్యను ఎవరో ఇన్‌ఫ్ల్యూయెన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉండి మార్చొచ్చు కదా అని అప్పు అంటుంది. అది ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. కానీ, అందులో ఇన్వాల్వ్ కాను. అమ్మ ఎవరు చెప్పినా వినను. తనకే తెలుస్తుంది. అంతవరకు నానమ్మ చెప్పినట్లుగా మనవడినో, మనవరాలినో కనిస్తే చాలు అని కల్యాణ్ అంటాడు. ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని పిల్లల్ని కనడం అవసరమా అని అప్పు అంటే.. అంతవరకు నో డిన్నరా అని కల్యాణ్ అంటాడు. అంతేగా అని అప్పు అంటుంది.

కనీసం కాఫీ, టిఫిన్స్ కూడా పెట్టవా అని కల్యాణ్ అంటే.. కాఫీ ఓకే అని అప్పు అంటుంది. అది చాలు మనకి అని అప్పును హగ్ చేసుకుంటాడు కల్యాణ్. మరోవైపు అనామికకు కాల్ చేస్తుంది రుద్రాణి. రేపు ఇంట్లో బారసాల కూడా జరిగిపోతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం ఒంటరిగా గుడ్లగూబలా ఎదురు చూస్తున్నాను. నువ్ చాలా మాటలు చెప్పావ్. కానీ, ఒక్కటి కూడా చేయలేదు. నిన్ను నమ్ముకుని ఏంటీ లాభం. నీలో ధైర్యం చచ్చిందా. వీళ్లు సంతోషంగా ఉంటే నాకు నచ్చట్లేదు. నువ్వేమైనా చేయగలవా అని రుద్రాణి అడుగుతుంది.

 

అనామికతో అల్లకల్లోలం

కంగారుపడకండి. వేటాడే మృగాలు సైలెంట్‌గా ఉన్నాయంటే దాని అర్థం వాటిలో చావా చచ్చిందని కాదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. నేను కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. రేపు మీ ఇంట్లో నేను పేల్చే బాంబ్‍‌తో అంతా అల్లకల్లోలం అవుతుంది, నా రాకతో ఆ సంతోషాలు ఆవిరి అయిపోతాయి అని అనామిక చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024