![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Parental_Care_1738898938715_1738898938939.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Parental_Care_1738898938715_1738898938939.jpg)
Parenting Tips: పిల్లల ఎదుగుదలకు హాని కలిగించేలా వారి పట్ల అతి జాగ్రత్త తీసుకుంటున్నారా? ఈ 8 లక్షణాలు మీలోనూ ఉన్నాయా?
Parenting Tips: పిల్లల విషయం ఎక్కువగా పట్టించుకుంటున్నామనే సందేహం మీలో ఉందా? అలాంటప్పుడు కాస్త తగ్గడమే మంచిది. ఈ 8 లక్షణాలు మీలో ఉంటే, మీరు కచ్చితంగా అతి జాగ్రత్త తీసుకుంటున్న వారిలో ఒకరని గుర్తుంచుకోండి.
పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు. కానీ, అది అతి కాకూడదు. మరీ బొమ్మరిల్లు ఫాదర్‌లాగా ప్రతి విషయం నేనే చూసుకుంటా. వాళ్ల ముందు నేనే ఒక షీల్డ్ అని ఫీలైపోయి బిహేవ్ చేయకండి. ఇలా చేయడం వల్ల ఒకానొక దశలో వారు మానసికంగా దూరం అయిపోతారు. లేదంటే పూర్తిగా మీ మీదే డిపెండ్ స్వతహాగా ఆలోచించడం ఆపేస్తారు. వాస్తవిక ప్రపంచంలో ఈ రెండూ ప్రమాదకరమే. ప్రేమగా దగ్గరుండి నేర్పించాలి. కానీ, అంతా మనమై నడిపించడం వల్ల వారి ఎదుగుదలను అడ్డుకున్న వాళ్లమవుతాం. మరి మీ పిల్లలతో మీరెలా ప్రవర్తిస్తున్నారు. ఓవర్ ప్రొటెక్టివ్ (అతి జాగ్రత్త)గా వ్యవహరిస్తున్నారా..? ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా? అయితే వెంటనే మార్చుకోండి.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
పిల్లల విషయంలో అతి జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మీలో కనిపించే లక్షణాలివే..
ఫలితాన్ని ముందే అంచనా వేయడం
మీ పిల్లలు పరీక్షలు, కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆందోళన చూపిస్తుంటారు. ఫలితాలు, స్కోర్లు, మెడల్స్ వంటి అంశాలనే లక్ష్యంగా ఉంచుకోమని ప్రేరేపిస్తారు. కానీ, దీనికి బదులుగా ఫలితాన్ని ముందే అంచనా వేసి, పిల్లలకు ఫలితం గురించి బాధపడొద్దని తెలియజేయడం బెటర్.
ఒకవేళ అలా జరగకపోతే
పిల్లల ఆరోగ్యం, చదువు పట్ల తల్లిదండ్రులకు ఆందోళన ఉండటం సహజమే. కానీ, ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్నట్లు జరగకపోవడం వల్ల ఎక్కువగా బాధపడకండి. పదేపదే అదే విషయం గురించి ఆలోచించి పిల్లలపై మీ బాధను, ఆవేదనను తెలిసేలా చేయకండి.
ఒకేలా చేయమనడం
పిల్లలకు కోరికలు సహజమే. ఒక్కోసారి ఒక్కో విధంగా అనిపించొచ్చు. మీరు వాటిని ప్రాధాన్యంగా తీసుకుని, గతంలో చేసినట్లుగానే ప్రతిసారీ చేయమంటుంటారు. ఇలా చేయడం వల్ల వారి భవిష్యత్ బాగుంటుందని మీరు ఆశించినా అది కరెక్ట్ కాదట.
వారి పని కూడా మీరు చేసేయడం
వయస్సుతో పాటుగా పిల్లల్లో ఛాలెంజింగ్ స్వభావం పెరుగుతుండాలి. అలా కాకుండా మీ ప్రేమ వారిని ఛాలెంజింగ్ లకు దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు. దానికి బదులుగా వారికి సపోర్ట్ అందించి సూచనలు ఇస్తే సమస్యను చాలా సులువుగా పరిష్కరించగల్గుతారు.
పేరెంటల్ ఎమోషనల్స్
తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎమోషనల్ గా ఉండటం సర్వసాధారణమే. కానీ, మీలో ఉన్న ఆందోళన, అసూయ, కోపం, విచారం వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోటివేషనల్ సపోర్ట్ మాత్రమే ఇవ్వండి. ఎమోషనల్‌గా అంతా మీరే అయి సమస్య పరిష్కరించాలనుకోవడం తప్పు.
పిన్ పాయింట్ మానిటరింగ్
పిల్లల విషయంలో మీరు తరచూ వారితో మాట్లాడుతూ ఉన్నారంటే, అది చాలా మంచి విషయం. ఇంకా మీరు స్మార్ట్ పేరెంట్ కూడా. కానీ, ఆ విషయాలు తెలుసుకుని వారిని గమనిస్తూ మాత్రమే ఉండాలి. అలా కాకుండా వారి స్నేహితులను, టీచర్‌ను పిల్లలకు స్పైలా ఉంచాలనుకోకండి. పిల్లల దగ్గర నమ్మకం కోల్పోతే మీ భవిష్యత్ లో మీ బంధంలో సమస్యలు ఏర్పడవచ్చు.
అన్ని ఛాయీస్‌లు మీరే తీసుకుంటున్నారా
మీ పిల్లల విషయంలో ప్రతి నిర్ణయం మీరే తీసుకుంటుంటే, వారు రిస్క్ అంటేనే భయపడిపోతారు. ఇది సెల్ఫ్ ట్రస్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటి విషయాలకు దూరమైపోతారు.దీని కోసం ప్రతి నిర్ణయం మీరే తీసుకోకుండా వారికి కూడా అభిప్రాయాన్ని చెప్పే అవకాశాన్ని ఇవ్వండి. ఒకవేళ అది తప్పైతే వివరించడం మర్చిపోకండి.
ఒక కవచంలా వ్యవహరిస్తున్నారా
మీ పిల్లలకు ఒక రక్షణ కవచంలా ఉంటుంటే, వారు మానసికంగా మరింత సెన్సిటివ్‌గా మారిపోతారు. చిన్నపాటి ఓటమిని లేదా ఫెయిల్యూర్‌ను కూడా యాక్సెప్ట్ చేయలేరు. క్రమంగా ఇదే పెరిగితే ఆఫీసులో కొలీగ్ లేదా తోటివారెవరైనా వారిలో కాన్ఫిడెన్స్‌ను ఈజీగా అణచివేస్తారు. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా లేక మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సంబంధిత కథనం