Illu Illalu Pillalu February 8th Episode: రామరాజుపై పగ సాధించిన భద్రావతి- ఆవిరైన సంతోషం- కోడలి చెవి మెలిపెట్టిన వేదవతి

Best Web Hosting Provider In India 2024

Illu Illalu Pillalu February 8th Episode: రామరాజుపై పగ సాధించిన భద్రావతి- ఆవిరైన సంతోషం- కోడలి చెవి మెలిపెట్టిన వేదవతి

Illu Illalu Pillalu Serial February 8th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌లో చందు పెళ్లి చూపులకు రామరాజు దంపతులు వెళ్తారు. అమ్మాయి నచ్చి సంబంధం ఓకే చేసుకుంటారు. అది తెలిసిన భద్రావతి అమ్మాయి తండ్రికి కాల్ చేసి చందుతో పెళ్లి చెడగొడుతుంది. దాంతో రామరాజు సంతోషం ఆవిరైపోతుంది.

 
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఫిబ్రవరి 8వ తేది ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఫిబ్రవరి 8వ తేది ఎపిసోడ్
 

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పెద్దోడి పెళ్లి చూపులకు వెళ్లొస్తాం అని వేదవతి, రామరాజు వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కోటి చెబుతారు. ఆడపడుచు కట్నం గురించి కామాక్షి అడిగితే.. నిన్ను ఆడపడుచు కట్నం సంఘానికి అధ్యక్షురాలిని చేయాలే అని అమూల్య అంటుంది. నాకు రావాల్సిన వాటా నేను అడుగుతున్నాను. నీకెంటటా అని కామాక్షి అంటుంది.

సంతోషంగా ఉండేలా చేస్తాను

తర్వాత చందును పిలుస్తాడు రామరాజు. ఒక తండ్రిగా నేను నా కొడుకుల విషయంలో ఓడిపోయానా అని బాధపడుతున్న క్షణంలో నువ్వు గర్వంగా నన్ను తలెత్తుకునేలా చేశావురా. నీ విషయంలో నా తండ్రి బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను. ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి నువ్ జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తాను అని రామరాజు చెప్పి వెళ్తాడు. చందు నుదుటిపై ముద్దుపెట్టి వేదవతి కూడా బయలుదేరుతుంది.

ఇంతలో వచ్చిన నర్మదా బావగారికి చూసే అమ్మాయి అలా, ఇలా ఉండాలని. ఆ లక్షణాలన్ని ఉన్నాయో లేదో ఒకటికి పదిసార్లు చూడండి అని చాలా చెబుతుంది. ఓయ్.. ఏంటీ.. ఎలాంటి కోడలిని తీసుకురావాలో నాకు తెలియదా అని వేదవతి అంటే.. తెలియదు అని తల ఊపుతుంది నర్మద. ఎందుకంటే నేను మీ సెలక్షన్ కాదు కదా అని అంటుంది. దీన్నే గుడ్డొచ్చి తల్లిని వెక్కిరించడం అంటే అని నర్మద చెవి మెలిపెడుతుంది వేదవతి.

మీలాంటి లక్షణాలే కాదు నాలాంటి లక్షణాలున్న కోడలినే తెచ్చుకుంటాను అని వేదవతి అంటుంది. ఛాన్సే లేదు. మా అత్తయ్య సింగిల్ పీస్. తనలాంటి లక్షణాలున్న అమ్మాయి దొరకనే దొరకదు. మా అత్తయ్య బంగారం అని నర్మద అంటే.. వేదవతి పొంగిపోతుంది. అంతలోనే కసురుకున్న వేదవతి నీకు నాకు మాటలు లేవు కదా అని వెళ్తుంది. రామరాజు, వేదవతి వెళ్లడం పైనుంచి భద్రావతి చూస్తుంది. పెద్దొళ్లుడు అప్పుడే నీ మొహంలో పెళ్లికళ వచ్చేసిందిరోయ్ అని మామ అంటాడు.

 

పెళ్లి తర్వాత కూడా జాబ్

అదంతా భద్రావతి చూస్తుంది. కానీ, ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నట్లు అని డౌట్ పడుతుంది. మరోవైపు అమ్మాయిని చూస్తారు రామరాజు దంపతులు. అమ్మాయి లక్షణంగా ఉంది. పెద్దోడికి అద్భుతమైన జోడి అని వేదవతి అంటుంది. మా అమ్మాయి బీఈడీ చేస్తోంది. ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా జాబ్ చేయాలనుకుంటుంది అని అమ్మాయి తల్లి అంటుంది. మాకు అలాంటిదేం లేదండి అని రామరాజు అంటాడు.

ఇంట్లో మొదటి పెళ్లి కాబట్టి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసేలా ఉన్నారు అని తండ్రి అంటాడు. దాంతో మీకో విషయం చెప్పాలని నడిపోడు, చిన్నోడి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు అని రామరాజు చెబితే.. అందరం కలిసే ఉంటున్నాం. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వేదవతి అంటుంది. ఈరోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. మీ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు అని తండ్రి అంటాడు.

దాంతో చందు గురించి గొప్పగా చెబుతాడు రామరాజు. మీ గురించి చాలా బాగా గొప్పగా విన్నాం. మీరు పిల్లలను చాలా గొప్పగా పెంచి ఉంటారని ఊహించుకుంటున్నాం అని తండ్రి అంటాడు. తర్వాత అమ్మాయని పక్కన కూర్చోబెట్టుకుని మురిసిపోతుంది వేదవతి. బాగా నచ్చిందని చెబుతుంది. పేరు అడిగితే.. వందన అని చెబుతుంది అమ్మాయి. దాంతో పేర్లు కూడా బాగా కుదిరాయి అని చందు ఫొటో తీసి చూపిస్తుంది వేదవతి.

 

కోడలిగా అడుగుపెట్టబోతున్నావ్

ఫొటో చూసి సిగ్గుపడుతుంది వందన. మా వాడు నీకు నచ్చాడ అని వేదవతి అడిగితే.. తల ఊపుతుంది వందన. మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి నచ్చుతుంది. మంచి ముహుర్తం చూసి పెళ్లి పెట్టుకుందామని వేదవతి సంతోషంగా అంటుంది. అలాగే అని వందన తండ్రి అంటాడు. త్వరలోనే నువ్ మా ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టబోతున్నాం అని వేదవతి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు కెమెరా మెన్‌ను తీసుకొచ్చి మామ హడావిడి చేస్తాడు.

మీ రెండు జంటలకు టైటానిక్ రేంజ్‌లో ఫొటోషూట్ ప్లాన్ చేశానని మామ అంటే.. నర్మద, సాగర్ సంతోషిస్తే.. ధీరజ్, ప్రేమ చిరాకుపడుతారు. వివాహమహోత్సవానికి మీరు ఆహ్వానిస్తున్నట్లు మీ ఫ్లెక్సీలు పెద్దగా వేయించాలి. పెద్దోడి పెళ్లి తర్వగా జరిపిస్తామని బావ చెప్పారుగా. ఇవాళ వెళ్లిన సంబంధం కచ్చితంగా సెట్ అయ్యేలా ఉంది. మీ నాన్న స్పీడ్ చూస్తుంటే పెద్దోడి పెళ్లి నాలుగైదు రోజుల్లో జరిపించేలా ఉన్నారు. అందుకే టెన్షన్ లేకుండా ముందే ఫ్లెక్సీలు రెడీ చేస్తున్నాను. అందమైన జంటలు అందంగా ఫొటోలు దిగండి అని మామ చెబుతాడు.

దాంతో ధీరజ్ కోప్పడతాడు. దాంతో ఇద్దరి ప్రేమ జంటల ఫొటోలు లేవురా, ఫొటోగ్రాఫర్‌ను మిస్ చేశార్రా అని మామ హడావిడి చేస్తుంది. నాకు ఫొటోలు ఇష్టంలేదు బాబాయ్ అని ప్రేమ అంటుంది. అది చూసి అసలు మీరిద్దరు నిజంగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా. ముందు అది చెప్పండి అనుమానంగా నిలదీస్తాడు మామ. అలా అడిగావ్ అని ధీరజ్ కంగారుపడుతాడు. మరేంట్రా భార్యభర్తలు ఫొటోలు దిగడానికి ఆలోచిస్తారేంటీ అని బలవంతంగా తీసుకెళ్తాడు మామ.

 

రుణం తీర్చుకుంటాను

మరోవైపు వస్తున్న రామరాజు ఓ చోట బండి ఆపి.. చందు గురించి చెబుతాడు. పెద్దోడు ఎంత మంచోడో అంత అమాయకుడు. వాడిని అర్థం చేసుకునే అమ్మాయి రావాలని రోజు దేవుడుని కోరుకునేవాన్ని. ఈ తండ్రి బాధను ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు. అందుకే ఆనందంతో కడుపు నిండి కన్నీళ్లు వస్తున్నాయని రామరాజు అంటాడు. చందు పెళ్లిన త్వరగా జరిపిద్దామని వేదవతి అంటుంది. వాడు నాకోసం వాడి ప్రేమను త్యాగం చేశాడు. ఒక తండ్రిగా నా కొడుకు రుణం తీర్చుకోవాలి. వాడి పెళ్లిన గొప్పగా చేసి నూరేళ్లసంతోషాన్ని ఇచ్చి రుణం తీసుకుంటాను అని రామరాజు ఎమోషనల్‌గా చెబుతాడు.

మరోవైపు అది జరగనివ్వను. నీ కంట్లో కన్నీళ్లు తప్పా ఇంట్లో సంతోషమే రానివ్వను అని చెప్పాను కదరా. మరి నీ కొడుకు పెళ్లిని ఎలా జరగనిస్తాను అని భద్రావతి అంటుంది. అమ్మాయి తండ్రికి కాల్ చేసి నేను రామరాజు పెద్దోడి కొడుకుకు సంబంధం మాట్లాడుకున్నారంట. ఏమైంది అని భద్రావతి అడుగుతుంది. అన్ని మాట్లాడేసుకున్నాం. ఇక మంచి రోజు చూసుకుని ముహుర్తం పెట్టుకోవాలి అని వందన తండ్రి అంటాడు.

అంటే, ఇద్దరి కొడుకుల పెళ్లి గురించి కూడా చెప్పాడా అని భద్రావతి అడుగుతుంది. అవును, ప్రేమ పెళ్లిళ్లు సహజం కదా అని తండ్రి చెబుతాడు. అవి ప్రేమ పెళ్లిళ్లు కాదు, బలవంతంగా లేపుకెళ్లి చేసుకున్న పెళ్లిళ్లు అని భద్రావతి అంటుంది. దాంతో షాక్ అవుతాడు తండ్రి. రామరాజు రెండో కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయికి వల వేసి లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు రామరాజును దాదాపు కొట్టేంత పని చేశారు, చిన్నోడు మా ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు అని భద్రావతి చెబుతుంది.

 

వలవేసి లేపుకెళ్లారు

ఇదంతా రామరాజు ప్లాన్ ప్రకారమే జరిగింది. తల్లిదండ్రులు లేని, ఇంటి పేరు కూడా తెలియని ఆ రామరాజు ఇంటికి ఎవరు పంపించరు కదా. అందుకే డబ్బున్న వాళ్లకు వలవేసి లేపుకెళ్లి పెళ్లి చేసుకోమ్మని ప్లాన్ వేశాడు. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెబుతాను విను. రామరాజు పెద్ద కొడుకు కూడా ఒక అమ్మాయని ప్రేమించి లేపుకెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, ఎక్కడో అది బెడిసికొట్టింది. ఇదిగో నీ మంచి కోసమే చెబుతున్నాను. మీ అమ్మాయికి వాళ్లతో పెళ్లి అంటే బండరాయి కట్టి ఊబిలో పడేయటమే. ఇక నీ ఇష్టం అని చెబుతుంది భద్రావతి.

ఇంటికి వచ్చిన రామరాజుకు అమ్మాయి తండ్రి ఫోన్ చేస్తాడు. అది వెనుక నుంచి భద్రావతి చూస్తుంది. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వట్లేదండి అని వందన తండ్రి చెబితే.. రామరాజు షాక్ అవుతుంది. ఇంతలోనే ఇలా క్యాన్సిల్ అంటారేంటండి అని అడుగుతాడు. మీ ఇద్దరు కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని చెప్పలేదు కదా. మీ పిల్లల పెంపకం సరిగా లేదని దీని బట్టే అర్థం అవుతుంది. అలాంటి ఇంటికి మా అమ్మాయిని పంపిస్తే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో. తెలిసి తెలిసి అంత ధైర్యం చేయలేను. వేరే సంబంధం చూసుకోండి అని వందన తండ్రి చెబుతాడు.

 

రొమాంటిక్ ఫొటో

అది విని భద్రావతి సంతోషిస్తుంది. రామరాజు బాధతో ఏం అర్థంకాక ఉంటాడు. ఇటు చూడగానే సాగర్, నర్మదతో రొమాంటిక్‌గా ఫొటో తీయిస్తాడు మామ. ధీరజ్, ప్రేమలను ఆటపటిస్తూ అంతా సంతోషంగా ఉంటారు. అది చూసి ఆవేశంతో రగిలిపోతుంటాడు రామరాజు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024