Best Web Hosting Provider In India 2024
Tulsi for skin: చర్మాన్ని సహజంగానే కాంతివంతంగా మార్చే తులసి, మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఇ
Tulsi for skin: మీ చర్మాన్ని సహజమైన రీతిలోనే కాంతివంతంగా మార్చాలనుకుంటే, మీకు తులసీ బెస్ట్ ఛాయీస్. చర్మాన్ని రిపేర్ చేయడంలో, మచ్చలు పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. మరి తులసితో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయి? ఎలా వాడాలో తెలుసుకుందామా..?
రసాయనాలు వాడకుండానే చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవాలనుకుంటున్నారా? మీ స్కిన్ కేర్ రొటీన్ లో తులసీని యాడ్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందొచ్చట. కేవలం ఆరాధన కోసం మాత్రమే వినియోగించే ఈ తులసిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయా అని షాక్ అవకండి. ఆయుర్వేద, నేచురోపతిలో కొన్ని శతాబ్దాలుగా తులసిని వాడుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ ఫ్లమ్మేటరీ గుణాలు ఉండి చర్మానికి మెరుగైన సౌందర్యాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కారణంగా చర్మంపై ఏర్పడే మచ్చలకు, తరచుగా దురదతో ఇబ్బందిపడుతున్న వారికి ఇది సహజమైన సొల్యూషన్.
తులసి ద్వారా చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
మచ్చలకు దూరంగా
ప్రతిరోజూ ముఖంపై మచ్చలతో ఇబ్బందిపడే వారికి ఇది సహాయకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు బ్యాక్టీరియాతో పోరాడి మచ్చలను పోగొడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు చర్మాన్ని ఎర్రబారకుండా చేయడంతో పాటు దురదను తగ్గించి, మచ్చలు రాకుండా ఉంచుతుంది. తులసి ఆకుల రసం చర్మంపై ఉండే రంధ్రాల్లోకి పోయి మురికిని శుభ్రం చేస్తుంది. ఇంకా తులసి నూనె మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. రెగ్యూలర్ గా వాడటం వల్ల మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
కాంతివంతమైన చర్మానికి
సూర్యరశ్మి ప్రభావానికి గురై చర్మంపై తరచూ బ్లాక్ హెడ్స్ రాకుండా చేస్తుంది. శరీరంలో హార్మోన్ మార్పుల వల్ల కలిగే సమస్యలు కూడా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే విటమిన్ హైపర్ పిగ్మంటేషన్, అసాధారణ స్కిన్ నుంచి కూడా కాపాడుతుంది. ఇందులో చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాలు మిమ్మల్ని మునుపటి కంటే బెటర్ గా చూపిస్తాయి.
వృద్దాప్య లక్షణాలు రాకుండా
తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యాలు వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చేస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. ఫలితంగా మీరు యవ్వనంగా, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా మెరిసిపోతారు కూడా.
చర్మంపై ఇరిటేషన్ తగ్గించేదిగా
తులసి ఇన్‌ఫ్లమ్మేషన్ కారణంగా ఏర్పడే ఇరిటేషన్ వంటి లక్షణాల నుంచి కాపాడుతుంది. చర్మంపై ఉన్న బ్యాక్టీరియాతో పోరాడి ఇరిటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా దురదలు, దద్దుర్లు రావడం తగ్గుతుంది.
తులసిని ఏ విధంగా ఉపయోగిస్తే చర్మానికి ప్రయోజనం
తులసి, తేనెతో ఫేస్ మాస్క్
ఒక టేబుల్ స్పూన్ తులసి పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేనె సమకూరి యాంటీ బ్యాక్టీరియాల గుణాలను తగ్గిస్తుంది.
తులసీ యోగర్ట్ ఫేస్ మాస్క్
ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తులసీ పౌడర్ ను, ఒక టేబుల్ స్పూన్ యోగర్ట్ తో కలిపి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వడం వల్ల చర్మానికి అదనపు ఆయిల్ రాకుండా చేస్తుంది.
తులసి నిమ్మ ఫేస్ మాస్క్
ఒక టేబుల్ స్పూన్ తులసి పౌడర్, లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ కలిపి అప్లై చేసుకోవాలి. దానిని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకోవడం వల్ల సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీని వల్ల చర్మానికి కాంతి సమకూరి డార్క్ స్పాట్స్ రాకుండా చేస్తుంది.
సంబంధిత కథనం