Best Web Hosting Provider In India 2024
Critics Choice Awards 2025: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 విజేతలు వీరే.. ఆ బోల్డ్ మూవీకి ఉత్తమ చిత్రంగా పురస్కారం!
30th Critics Choice Awards 2025 Winners List: 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 వేడుకలు శుక్రవారం (ఫిబ్రవరి 7) లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగాయి. గత నాలుగేళ్ల మాదిరిగానే ఈ సంవత్సరం జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా కామెడీ అండ్ బోల్డ్ మూవీ అనోరా అవార్డ్ సాధించింది.
30th Critics Choice Awards 2025 Winners List: సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 శుక్రవారం (ఫిబ్రవరి 7) రాత్రి లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. అయితే, గత నాలుగేళ్లుగా సినిమా, టెలివిజన్ నామినేషన్లు, విజేతలను విడివిడిగా ప్రకటిస్తున్నారు.
బోల్డ్ మూవీకి ఉత్తమ చిత్రం అవార్డ్
లాస్ ఏంజిల్స్‌ను అతలాకుతలం చేసిన కార్చిచ్చుకు కొన్ని వారాల తర్వాత 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో కాంక్లేవ్, విక్‌డ్ సినిమాలకు అత్యధికంగా 11 నామినేషన్లతో సత్తా సాధించగా.. షోగన్ వెబ్ సిరీస్ టీవీ విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. ఇక బోల్డ్ అండ్ రొమాంటిక్, కామెడీ మూవీ అనోరా ఉత్తమ చిత్రంగా అవార్డ్ కైవసం చేసుకుంది.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 విజేతల పూర్తి జాబితా:
ఉత్తమ నటనా బృందం: కాంక్లేవ్
కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: మైఖేల్ యురీ (ష్రింకింగ్)
కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి: హన్నా ఐన్‌బైండర్ (హ్యాక్స్)
లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్ కోసం రూపొందించిన సినిమాలో ఉత్తమ సహాయ నటుడు: లీవ్ ష్రైబర్ (ది పర్ఫెక్ట్ కపుల్)
లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్ కోసం రూపొందించిన సినిమాలో ఉత్తమ సహాయ నటి: జెస్సికా గన్నింగ్ (బేబీ రైన్డీర్)
డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: తడనోబు అసనో (షోగన్)
డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి: మోకా హోషి (షోగన్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ది వైల్డ్ రోబోట్
లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్ కోసం రూపొందించిన సినిమాలో ఉత్తమ నటుడు: కాలిన్ ఫారెల్ (ది పెంగ్విన్)
లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్ కోసం రూపొందించిన సినిమాలో ఉత్తమ నటి: క్రిస్టిన్ మిలియోటి (ది పెంగ్విన్)
ఉత్తమ లిమిటెడ్ సిరీస్: బేబీ రైన్డీర్
ఉత్తమ సహాయ నటి: జోయ్ సల్దానా (ఎమిలియా పెరెజ్)
కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటుడు: ఆడమ్ బ్రాడీ (నోబడీ వాంట్స్ దిస్)
కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటి: జీన్ స్మార్ట్ (హ్యాక్స్)
ఉత్తమ కామెడీ సిరీస్: హ్యాక్స్
ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్)
ఉత్తమ యువ నటుడు/నటి: మైసీ స్టెల్లా (మై ఓల్డ్ యాస్)
డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటుడు: హిరోయుకి సనాడ (షోగన్)
డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటి: కాథీ బేట్స్ (మ్యాట్‌లాక్)
ఉత్తమ డ్రామా సిరీస్: షోగన్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఎమిలియా పెరెజ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: పీటర్ స్ట్రాఘన్ (కాంక్లేవ్)
ఉత్తమ పాట: ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ దర్శకుడు: జోహ్మ్ ఎం చు (వికెడ్)
ఉత్తమ నటి: డెమీ మూర్ (ది సబ్‌స్టాన్స్)
టెలివిజన్ కోసం నిర్మించిన ఉత్తమ చిత్రం: రెబెల్ రిడ్జ్
ఉత్తమ స్కోరు: ట్రెంట్ రెజ్నోర్, అట్టికస్ రాస్ (ఛాలెంజర్స్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నాథన్ క్రౌలీ అండ్ లీ సాండల్స్ (వికెడ్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పాల్ టేజ్‌వెల్ (వికెడ్)
ఉత్తమ ఎడిటింగ్: మార్కో కోస్టా (ఛాలెంజర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: జారిన్ బ్లాష్కే (నోస్ఫెరాటు)
ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ హెయిర్ అండ్ మేకప్: ది సబ్‌స్టాన్స్ హెయిర్ అండ్ మేకప్ టీమ్ (ది సబ్‌స్టాన్స్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ లాంబెర్ట్, స్టీఫెన్ జేమ్స్, రైస్ సాల్కోంబ్, గెర్డ్ నెఫ్జర్ (డూన్: పార్ట్ టూ)
ఉత్తమ కామెడీ: డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్, ఎ రియల్ పెయిన్ (టైడ్)
ఉత్తమ యానిమేటెడ్ సిరీస్: ఎక్స్-మెన్ ‘97
ఉత్తమ టాక్ షో: జాన్ ములానీ సమర్పణ: ఎవ్రీబడీస్ ఇన్ ఎల్ఏ
ఉత్తమ కామెడీ స్పెషల్: అలీ వాంగ్: సింగిల్ లేడీ
ఉత్తమ విదేశీ భాషా సిరీస్: స్క్విడ్ గేమ్
ఉత్తమ చిత్రం: అనోరా
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 ఓటీటీ
ఇక 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవ వేడుక ఇండియాలో లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో శనివారం (ఫిబ్రవరి 8) ఉదయం 5:30 నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి.
సంబంధిత కథనం