Ration Card Applications : ‘ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా’..? ప్రభుత్వానికి హరీశ్ రావ్ ప్రశ్నలు

Best Web Hosting Provider In India 2024

Ration Card Applications : ‘ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా’..? ప్రభుత్వానికి హరీశ్ రావ్ ప్రశ్నలు

Maheshwaram Mahendra HT Telugu Feb 08, 2025 10:55 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 08, 2025 10:55 AM IST

BRS Harish Rao On Ration Card Applications : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. మీసేవా దరఖాస్తుల పేరిట రేషన్ కార్డుల విషయంలో మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

రేషన్ కార్డుల జారీలో మీసేవా దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

yearly horoscope entry point

“ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కుల గణనలో వివరాలు తీసుకున్నారు. గ్రామసభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మళ్లీ మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

దరఖాస్తులకు విలువ లేదా..? హరీశ్ రావ్

ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? అని హరీశ్ రావు నిలదీశారు. బిఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.

“పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే మీ ప్రభుత్వ దృష్టి ఉంది. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప… 14 నెలల పాలనలో మీరు చేసిందేముంది…?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని హరీశ్ రావ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవాలని హితవు పలికారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

BrsHarish RaoTelangana NewsTs PoliticsPraja Palana Applications
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024