Valentines Day 2025: దూరంగా ఉన్న ప్రేమికులతో “ప్రేమికుల రోజు” జరుపుకోవడం ఎలాగో అర్థం కావడం లేదా? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Best Web Hosting Provider In India 2024

Valentines Day 2025: దూరంగా ఉన్న ప్రేమికులతో “ప్రేమికుల రోజు” జరుపుకోవడం ఎలాగో అర్థం కావడం లేదా? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Ramya Sri Marka HT Telugu
Feb 08, 2025 02:30 PM IST

Valentines Day 2025: ప్రేమికుల రోజు అంటే ప్రేమ పక్షులకు పెద్ద పండగ. అలాంటి పండగకు ప్రేమించిన వారు దగ్గరగా లేకపోతే ఎంత వెలితిగా, ఎంత బాధగా ఉంటుందో తెెలుసు కదా. మీ బాధను తగ్గించుకోవాలంటే దూరంగా ఉన్న మీ ప్రియుడు లేదా ప్రియురాలితో “ప్రేమికుల రోజు”ను సంతోషంగా జరుపుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు.

దూరంగా ఉన్న ప్రేమికులతో “ప్రేమికుల రోజు” జరుపుకోవడం ఎలాగో అర్థం కావడం లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దూరంగా ఉన్న ప్రేమికులతో “ప్రేమికుల రోజు” జరుపుకోవడం ఎలాగో అర్థం కావడం లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

ప్రేమికుల పండుగ వచ్చేసింది. ఇప్పటికే మొదలైన వాలెంటైన్ వీక్ సందడి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రోజ్ డేతో మొదలుకొని వాలెంటైన్స్ డే వరకూ వారం రోజుల పాటు రకరకాలుగా పద్ధతుల్లో తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రేమ పండుగను ఘనంగా జరుపుకుంటారు ప్రేమికులు. ప్రతి రోజూ కలుసుకోవడం పువ్వులు, చాక్లెట్లు, టెడ్డీలతో పాటు ప్రేమతో కూడిన ముద్దులు, హగ్గులు, ప్రత్యేకమైన గిఫ్టులతో కలిపి పెద్ద పండుగలా జరుపుకుంటారు. అయితే ఇదంతా దగ్గరలో ఉన్న ప్రేమికుల సంగతి. దూరంగా ఉన్నవారి విషయంలో అలా ఉండదు కదా.

yearly horoscope entry point

చదువుల కోసం, ఉద్యోగాల కోసం కొందరు, కుటుంబ పరిస్థితుల రీత్యా మరికొందరు ప్రేమికులు ఎక్కడో దూరంగా ఉంటూనే ప్రేమించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ మాత్రమే కలుసుకుని మాట్లాడుకుంటారు. దేశవిదేశాలకు వెళ్లిన వారి పరిస్థితి ఇంకా బాధాకరం. వీరి నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడానికి కొన్ని సార్లు ఏళ్ల సమయం కూడా పడుతుంది. అలా దూరంగా ఉంటూ కూడా గాఢంగా ప్రేమించుకునే వారికి ఈ వాలెంటైన్ వీక్ చాలా బాధగా గడుస్తుంది.అలాంటి వారు కూడా ప్రేమికుల రోజును సంతోషంగా గడపడానికి తమ భాగస్వామితో ప్రేమికుల రోజుకు సంబంధించి కొన్ని మధురమైన క్షణాలను మలచుకోవడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫాలో అవ్వండి.

దూరంగా ఉంటున్నా కూడా ప్రేమికులు వాలెంటైన్స్ డేను సంతోషంగా జరుపుకోవాలంటే ఏం చేయాలి?

వీడియో కాల్‌కు సమయం నిర్ణయించుకోండి

దూరంగా ఉండి ప్రేమించుకునేవారు ఎంత మదనపడతారో.. ప్రేమించిన ప్రతి మనసుకి అర్థమవుతుంది. అలాంటప్పుడు చుట్టూ ఉండే వాతావరణమంతా వాలెంటైన్స్ డే శుభాంకాంక్షలు చెప్పుకుంటూ ఉంటుంటే ఇంకా వేదనగా ఉంటుంది. శారీరకంగా దగ్గరగా లేకపోయినా మనసంతా తమ ప్రేయసి/ప్రియుడి కోసం పరితపిస్తుంటుంది. ఒక్కసారైనా చూసి శుభాకాంక్షలు తెలియజేయాలనే కుతూహలం కనిపిస్తుంటుంది. అటువంటి సమయంలో మీరు మీ శుభాకాంక్షలను వీడియో కాల్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ పరస్పరం చూసుకుంటూ డిన్నర్ చేస్తూ ఆ క్షణాలను అనుభూతి చెందవచ్చు.

మీరే లేఖ రాసి పంపండి

ప్రేమికుల దినోత్సవం రోజున, దూరంగా ఉన్న తమ ప్రేయసి/ప్రియుడికి కార్డులు, బహుమతులు, ప్రేమ సందేశాలను పంపడం ద్వారా చాలామంది తమ ప్రేమను చూపుతారు. ఈ రెడీమేడ్ ఐటమ్స్ ఇవ్వడం కంటే, మీ మనస్సులో భావాలను మీరే ఓ కాగితంపై రాసి, వారికి నచ్చే సువాసనతో మీ ప్రియుడికి పంపండి. ఇది మీ భాగస్వామికి చాలా నచ్చుతుంది.

కేర్ ప్యాకేజ్ గిఫ్ట్ చేయండి

తాజా రోజుల్లో, ‘కేర్ ప్యాకేజ్ గిఫ్ట్స్’ను వివిధ కంపెనీలు ఆన్‌లైన్ దుకాణాలలో అమ్ముతున్నాయి. అందులో ఆహారం, సౌందర్య సాధనాలు, దుస్తులు, చాక్లెట్లు, పూలు, అనేక రొమాంటిక్ వస్తువులు ఉంటాయి. మీరు వారి ఎంపికకు అనుగుణంగా బహుమతులను ఎంచుకొని ఈ రోజును మరపురానిదిగా చేయండి. దీనివల్ల వారిపై మీరు కనబరిచే శ్రద్ధ, ప్రేమ మరింత బలపడుతుంది.

ఇద్దరూ కలిసి ట్రిప్ ప్లాన్ చేయండి

ఇద్దరూ వేరువేరు ప్రదేశాలలో ఉన్నప్పటికీ, ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ముందుగానే కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీరు కలుసుకోవాలనుకుంటున్న ప్రదేశం ఎంపిక పరిపూర్ణంగా ఉండాలి. ఈ సమావేశం మీ ఇద్దరినీ వేరే లోకానికి తీసుకెళ్లేలా ఉండాలి. మీ మనసులో ఉన్న ప్రేమను తెలియజేసి ఆ సమయాన్ని ఆస్వాదించండి.

సర్‌ప్రైజింగ్‌గా కలవండి

మీరు మీ ప్రేయసి/ప్రియుడిని చాలా రోజులుగా కలవకపోతే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా కలవడానికి సిద్ధంగా ఉండండి. వారికి నచ్చే బహుమతులను తీసుకొని, అకస్మాత్తుగా వారి ముందుకు వెళ్లడం ద్వారా రొమాంటిక్‌గా సర్‌ప్రైజ్ ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల మీరు వారిపై ఉంచిన అపారమైన ప్రేమ వ్యక్తీకరమవుతుంది. మీ సంబంధం మరింత బలపడేందుకు తోడ్పడుతుంది.

 

 

 

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024