




Best Web Hosting Provider In India 2024

Chocolate Day 2025: ఈ చాక్లెట్ డేకి చాక్లెట్ పేస్ట్రీతో నోరు తీపి చేసుకోండి, ఎగ్ లెస్ పేస్ట్రీ రెసిపీ చాలా ఈజీ!
వాలెంటైన్స్ వీక్‌లో మూడవ రోజు చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజున తమ ప్రియుడు లేదా ప్రియురాలికి చాక్లెట్ (తీపి పదార్థం) తినిపిస్తారు. మరి మీరు స్వయంగా తయారుచేసి చాక్లెట్ తినిపించాలనుకుంటున్నారా.. రండి ఈ రెసిపీతో ట్రై చేయండి.
వాలెంటైన్స్ వీక్ లో మూడవ రోజు చాక్లెట్ డే. ఫిబ్రవరి 9న స్పెషల్‌గా జరుపుకునే ఈ రోజున తమ ప్రియతమ వారి నోటిని తీపి చేసుకునేందుకు స్వీట్ లేదా చాక్లెట్ తినిపించుకుంటారు. మరి మీ ఛాయీస్ రుచికరమైన చాక్లెట్ పేస్ట్రీ ఎందుకు కాకూడదు? ఎగ్ లేకుండా దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. సింపుల్‌గా తయారుచేసేందుకు ఈ రెసిపీని ట్రై చేయండి. మైక్రోవేవ్ లేకుండానే రెడీ చేసుకోండి.

చాక్లెట్ పేస్ట్రీ తయారు చేయడానికి కావలసినవి
ఈ రుచికరమైన గుడ్డు లేని పేస్ట్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
- పాలు
- చిన్న ముక్కలుగా చేసిన డార్క్ చాక్లెట్
- కార్న్ ఫ్లోర్
- థిక్ క్రీమ్
- డైజెస్టివ్ బిస్కెట్లు
- మెత్తగా పొడి చేసిన చక్కెర
- కోకో పౌడర్
పేస్ట్రీ ఎలా తయారు చేయాలి
- చాక్లెట్ పేస్ట్రీ తయారు చేయడానికి, మొదట ఒక గిన్నెలో డార్క్ చాక్లెట్, పాలు తీసుకొని, డబుల్ బాయిలింగ్ ప్రక్రియలో కొన్ని సెకన్ల పాటు వేడి చేయండి.
- బిస్కెట్లను పొడిగా చేసి, ఈ మిశ్రమానికి బాగా కలపండి.
- ఇప్పుడు కేక్ తయారు చేసే ట్రేలో బటర్ పేపర్ వేసి, ఈ మిశ్రమాన్ని బాగా పరుచుకోండి.
- ఇప్పుడు ఒక పాన్ వేడి చేసి, దానిలో పాలు, కార్న్ ఫ్లోర్, కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, క్రీమ్ వేయండి.
- ఇది మృదువైన, గాఢమైన చాక్లెట్ మిశ్రమం అయ్యే వరకు బాగా కలపండి. అది మృదువుగా అయ్యాక, దీనిని కూడా మొదటి పొర పైన పరుచుకోండి.
- తరువాత ఒక గిన్నెలో ఒక కప్పు డార్క్ చాక్లెట్, అర కప్పు క్రీమ్ తీసుకొని, డబుల్ బాయిలింగ్ ప్రక్రియలో కొన్ని సెకన్ల పాటు వేడి చేయండి.
- బాగా కలిపిన తరువాత, దీని పొరను కూడా మిగిలిన రెండు పొరల పైన పరుచుకోండి.
- ఇప్పుడు ఈ పేస్ట్రీని డీప్ ఫ్రిజ్‌లో ఉంచండి.
- అలా ఉంచిన పేస్ట్రీని కనీసం 5 నుండి 6 గంటల తరువాత బయటకు తీసి, పేస్ట్రీ ఆకారంలో కోసి సర్వ్ చేయండి.
పేస్ట్రీని తక్కువ పరిమాణంలో మాత్రమే తయారు చేయాలనుకుంటే, చిన్న గాజు జార్లలోనూ తయారు చేయవచ్చు.
చాక్లెట్ పేస్ట్రీ టేస్ట్ కోసమే కాదు, ఇది మల్టీ పర్పస్‌గా కూడా వినియోగించుకోవచ్చు.
డెసర్ట్‌గా: చాక్లెట్ పేస్ట్రీని ప్రత్యేకమైన డెసర్ట్‌గా సర్వ్ చేయవచ్చు. ప్రియుడు/ప్రియురాలు కోసమే కాదు, ఫ్యామిలీ, అతిథుల కోసం మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది.
కాఫీ/టీతో పాటు: పేస్ట్రీను కాఫీ లేదా టీతో కలిపి మంచి స్నాక్‌గా తయారుచేసుకోవచ్చు.
ప్రత్యేక సందర్భాలు: పుట్టినరోజులు, అంగీకార వేడుకలు, క్రిస్మస్ లేదా ఇతర ముఖ్యమైన సందర్భాల్లో పేస్ట్రీలతో డెకరేట్ చేయవచ్చు.
గిఫ్ట్‌గా: పేస్ట్రీలు చాక్లెట్ లవర్స్ అయిన మీ వారికి గొప్ప గిఫ్ట్‌గా అందించవచ్చు.
స్నాక్‌గా: మంచి పేస్ట్రీను రోజంతా స్నాక్‌గా తినవచ్చు.
ఫస్ట్ కోర్సు లేదా బ్రేక్‌ఫాస్ట్: పేస్ట్రీని ఫస్ట్ కోర్సుగా లేదా బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ఉపయోగించవచ్చు.