![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/brahmanandam_1739012866731_1739012875648.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/brahmanandam_1739012866731_1739012875648.jpg)
Brahma Anandam Movie: బ్రహ్మా ఆనందం మూవీలో వెన్నెల కిషోర్‌ను హీరోగా అనుకున్నాం…కానీ..! – ప్రొడ్యూసర్ కామెంట్స్
Brahma Anandam: బ్రహ్మా ఆనందం సినిమాలో తొలుత హీరోగా వెన్నెలకిషోర్‌ను అనుకున్నామని నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా అన్నారు. టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది.
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ తో పాటు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. . ఈ కామెడీ డ్రామా మూవీతో ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో తొలుత హీరోగా వెన్నెలకిషోర్‌ను అనుకున్నట్లుగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు. బ్రహ్మా ఆనందం సినిమా గురించి రాహుల్ యాదవ్ నక్కా ఏం అన్నారంటే?
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
టైటిల్ దొరకలేదు…
బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే ఈ సినిమా చేయాలని అనుకున్నాం. కానీ ఆ టైటిల్ మాకు దొరకలేదు. బ్రహ్మా ఆనందంగా మార్చాం. తాత, మనవళ్ల కథ ఇది. ఇందులో తాత తాను చేసిన తప్పుల్ని రియలైజ్ అవుతాడు. మనవడు కూడా తన తప్పుల్ని తెలుసుకుంటాడు. ఓ అందమైన కథను వినోదాత్మకంగా చెప్పాం. సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుంది.
బ్రహ్మానందం లేకపోతే…
బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే దర్శకుడు నిఖిల్ నన్ను అప్రోచ్ అయ్యాడు. బ్రహ్మానందం నటించకపోతే ఈ సినిమా తీయలేం. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాం. కథ బ్రహ్మానందం గారికి కూడా చాలా నచ్చింది.రంగమార్తాండ చూశాక ఆడియెన్స్ బ్రహ్మానందాన్ని చూసే కోణం మారిపోయింది. కమెడియన్ అంటే కేవలం నవ్విస్తారనే ముద్ర వేస్తాం. కానీ బ్రహ్మానందం గారు అద్భుతమైన నటులు. ఇంత వరకు బ్రహ్మానందం చేయనటువంటి, చూడనటువంటి పాత్రలో, ఎమోషన్స్‌లో ఈ మూవీలో కనిపిస్తారు.
హీరోగా….
హీరో పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం. చివరకు హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం రికమండ్ చేశారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత. హీరో బ్రహ్మా కారెక్టర్ కాకుండా.. ఫ్రెండ్ కారెక్టర్ గిరి బాగుందని, అదే చేస్తానని వెన్నెల కిషోర్ గారు అన్నారు. ఆ తరువాత రాజా గౌతమ్ పేరు చర్చల్లోకి వచ్చింది. కానీ అతను చేస్తే బాగుంటుందా?అని నాలో అనుమానం కలిగింది. కానీ రాజాని కలిసిన తరువాత అభిప్రాయం మారింది.
తక్కువ బడ్జెట్లో…
సినిమాని కొన్ని లెక్కలతో తీస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. టార్గెట్ ఆడియెన్స్ ఎవరన్నది తెలుసుకోవాలి. లిమిటెడ్ బడ్జెట్‌తో, తక్కువ రోజుల్లో సినిమా చేస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. నాకు పెద్ద లాభాలు రావాలని కూడా ఉండదు. పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటా.
బ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే నేను హిట్లు, ఫ్లాపు గురించి చెప్పను. ఈ మూవీకి అందరూ బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను పాత్రను మనసులో మోసుకొని వెళ్తుతారు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ…బ్రహ్మా ఆనందం తర్వాత రాజా గౌతమ్‌తోనే వైబ్ అనే ఓ సినిమాను చేస్తున్నాను. ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సంబంధిత కథనం