Telugu Serial: క‌న్న‌డంలోకి డ‌బ్ అవుతోన్న బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్స్‌ తెలుగు సీరియ‌ల్ – టైటిల్ ఫిక్స్‌!

Best Web Hosting Provider In India 2024

Telugu Serial: క‌న్న‌డంలోకి డ‌బ్ అవుతోన్న బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్స్‌ తెలుగు సీరియ‌ల్ – టైటిల్ ఫిక్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Feb 08, 2025 06:24 PM IST

Telugu Serial: తెలుగు సీరియ‌ల్ జాన‌కి క‌ల‌గ‌న‌లేదు క‌న్న‌డంలోకి డ‌బ్ అవుతోంది. క‌న్న‌డ వెర్ష‌న్‌కు జాన‌కి ర‌మ‌ణ అనే టైటిల్ ఖ‌రారైంది. క‌ల‌ర్స్ క‌న్న‌డ ఛానెల్‌లో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతోంది. జాన‌కి కల‌గ‌న‌లేదు సీరియ‌ల్‌లో అమ‌ర్ దీప్ చౌద‌రి, ప్రియాంక జైన్ లీడ్ యాక్ట‌ర్స్‌గా న‌టించారు.

తెలుగు సీరియ‌ల్
తెలుగు సీరియ‌ల్

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్ దీప్ చౌద‌రి లీడ్ రోల్‌లో న‌టించిన తెలుగు సీరియ‌ల్ జాన‌కి క‌ల‌గ‌న‌లేదు క‌న్న‌డంలోకి డ‌బ్ అవుతోంది. క‌న్న‌డ వెర్ష‌న్‌కు జాన‌కి ర‌మ‌ణ అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. క‌ల‌ర్స్ క‌న్న‌డ ఛానెల్‌లో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతోంది. త్వ‌ర‌లోనే సీరియ‌ల్ లాంఛింగ్ డేట్‌ను, టెలికాస్ట్ టైమ్‌ను రివీల్ చేస్తామ‌ని క‌ల‌ర్స్ క‌న్న‌డ ఛానెల్ పేర్కొన్న‌ది.

yearly horoscope entry point

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్స్‌…

జాన‌కి క‌ల‌గ‌న‌లేదు సీరియ‌ల్‌లో బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 ర‌న్న‌ర‌ప్స్‌ అమ‌ర్ దీప్ చౌద‌రి, ప్రియాంక జైన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. టాలీవుడ్ హీరోయిన్ రాశితో పాటు అనిల్ అల్లం, విష్ణుప్రియ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. అరియానా గ్లోరీ, రాజా ర‌వీంద్ర, ప్రియాంక సింగ్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ న‌టుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఈ సీరియ‌ల్‌లో గెస్ట్ రోల్స్‌లో క‌నిపించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

ఎనిమిదేళ్ల పాటు…

స్టార్ మా ఛానెల్‌లో 2015 నుంచి 2023 వ‌ర‌కు ఎనిమిదేళ్ల పాటు ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అయ్యింది. మొత్తం 662 ఎపిసోడ్స్‌తో మేక‌ర్స్ ఈ సీరియ‌ల్‌కు శుభం కార్డు వేశారు. తెలుగులో టీఆర్‌పీ ప‌రంగా టాప్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా జాన‌కి క‌ల‌గ‌న‌లేదు నిలిచింది. ప్రారంభ‌మైన మొద‌టివారంలోనే అత్య‌ధిక మంది వీక్షించిన టాప్ ఫైవ్ తెలుగు సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా కాలం పాటు రేటింగ్స్‌లో టాప్‌లో కొన‌సాగుతూ వ‌చ్చింది.

అమ‌ర్‌దీప్‌కు స్టార్‌డ‌మ్‌…

బుల్లితెర‌పై అమ‌ర్‌దీప్ చౌద‌రికి స్టార్‌డ‌మ్‌ను తీసుకొచ్చిన సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా జాన‌కి క‌ల‌గ‌న‌లేదు నిలిచింది. అత‌డి కెరీర్‌లో అత్య‌ధిక రోజులు టెలికాస్ట్ అయినా సీరియ‌ల్ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. జానకి కలగనలేదు కంటే ముందు సిరిసిరి మువ్వలు, ఉయ్యాలా జంపాలాతో పాటు మరికొన్ని సీరియల్స్‌లో అమ‌ర్‌దీప్‌ నటించాడు. నా పబ్ జీ వైఫ్, లవ్ యూ జిందగీ, పిజ్జా వర్సెస్ గోంగూర, మంగమ్మ గారి మనవడు, గ‌ర్ల్‌ఫ్రెండ్ ఊరెళితేతో పాటు మ‌రికొన్ని షార్ట్ ఫిలిమ్స్‌, వెబ్‌సిరీస్‌లు చేశాడు.

విన్న‌ర్ అవుతాడ‌నుకుంటే…

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అమ‌ర్‌దీప్ చౌద‌రి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. అత‌డే టైటిల్ గెలుస్తాడ‌ని అభిమానులు భావించారు. కానీ అమ‌ర్‌కు షాకిస్తూ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విన్న‌ర్‌గా నిలిచాడు. అదే బిగ్‌బాస్ సీజ‌న్ 7లో ప్రియాంక జైన్ కూడా ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. ఫోర్త్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. తెలుగులో ప్రియాంక జైన్ మౌన‌రాగం సీరియ‌ల్‌తో పాటు ఎవ‌డు త‌క్కువ కావ‌ద్దు, విన‌రా సోదర వీర‌కుమారా సినిమాలు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024