Best Web Hosting Provider In India 2024
Allu Arjun: పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ సుకుమార్‌దే – థాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్
Allu Arjun: పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ సుకుమార్‌దేనని అన్నాడు అల్లు అర్జున్. పుష్ప 2తో తెలుగు ఇండస్ట్రీని గర్వపడేలా సుకుమార్ చేశాడని చెప్పాడు. పుష్ప 2 థాంక్స్ మీట్‌లో సుకుమార్ గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
హీరోలు, కెమెరామెన్లు, కొరియోగ్రాఫర్లు సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి హిట్టు ఇచ్చేది డైరెక్టర్ ఒక్కడేనని అల్లు అర్జున్ అన్నాడు. పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ సుకుమార్‌దేనని అల్లు అర్జున్ చెప్పాడు. అతడు హీరోగా నటించిన పుష్ప 2 థాంక్స్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో పుష్ప 2 సక్సెస్‌పై అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ పలుమార్లు ఎమోషనల్ అయ్యాడు. ఈ థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ…
సుకుమార్ వల్లే…
ఈ సినిమాలో నా యాక్టింగ్‌పై చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి.ఆ ప్రశంసలన్నీ సుకుమార్ వల్లే దక్కాయి సుకుమార్‌కు థాంక్స్ చెప్పడం తక్కువే అవుతుంది. ఈ సినిమా కోసం పనిచేసిన వేల మంది థాంక్స్ చెప్పాల్సింది ఒక్క సుకుమార్‌కే అని బన్నీ అన్నాడు.
ఆర్టిస్ట్ గొప్పతనం కాదు…
సినిమాలో పాట , ఫైట్, సీన్ ఏది బాగున్నా అది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గొప్పతనం కాదు…డైరెక్టర్ గొప్పతనం. సరైన గైడెన్స్ లేకపోతే ఎంత గొప్ప నటుడైనా నా దృష్టిలో బ్యాడ్ యాక్టరే. సుకుమార్ లాంటి గొప్ప డైరెక్టర్ గైడెన్స్ నాకు దక్కడం అదృష్టం. సుకుమార్ గురించి ఎంత చెప్పిన తక్కువే. పుష్ప 2తో మా అందరిని గెలిపించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని గర్వపడేలా చేశారు సుకుమార్. సుకుమార్ సీన్ చెబుతుంటే పిచ్చెక్కిపోతుంది. చాలా ఎంజాయ్ చేస్తుంటాను. ఆయనకు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్‌ను సుకుమార్ జీనియస్ డైరెక్టర్
ఐదేళ్ల జర్నీ…
పుష్ప కోసం ఐదేళ్లు జర్నీ చేశాం. షూటింగ్ అయిపోయింది అనగానే టెన్షన్ మొత్తం పోయినట్లుగా అనిపించింది. ఒక్కసారిగా ఐదేళ్ల కష్టం మొత్తం గుర్తొచ్చింది. ఐదేళ్లు సుకుమార్ ఏం చెబితే అదే ఫాలో అయ్యాం. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మీనింగ్‌ఫుల్ మూవీగా పుష్ప2 ఉండాలని కోరుకున్నా. ఐదేళ్ల శ్రమకు ప్రతిఫలం దక్కాతే చాలనుకున్నా. మా అందరిలైఫ్‌ను మీనింగ్‌ఫుల్ చేసింది మాత్రం సుకుమారే.
కష్టం మీది ఇమేజ్ నాది…
పుష్ప 2లో ఐదు నిమిషాల నుంచి ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ వేదికగా థాంక్స్ చెబుతున్నాను. పుష్ప 2లో నా పోస్టర్‌ను చూసినప్రతిసారి దాని వెనుక ఉన్న వెయ్యి, రెండు వేల మంది ఎనర్జీ ప్రేమ కనిపించేది. కష్టం మీది ఇమేజ్ నాది.
వాళ్లు లేకపోతే పుష్ప 2 లేదు…
నవీన్ యెర్నేని, రవిశంకర్ లేకపోతే పుష్ప 2 లేదు. మా అందరిని నమ్మారు. ఐదేళ్లు మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మిలియన్స్ సాంగ్స్ ఎలా చేస్తారు అని నేను అనుకునేవాడిని. కానీ దేవిశ్రీ ప్రసాద్ నాకు బిలియన్ సాంగ్స్ ఇచ్చారు. దేవిని లేకుండా పుష్ప, పుష్ప 1ను ఊహించడం కష్టం. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కోసం 18 రోజుల పాటు రోప్ షాట్స్ చేశాం. ఫైట్ మాస్టర్స్ కష్టం వల్లే చిన్న గీత పడకుండా ఆ సీన్ అద్భుతంగా పూర్తిచేయగలిగా.
అల్లు అర్జున్ మాట్లాడుతోన్న టైమ్‌లో సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్‌పైకి వచ్చి అల్లు అర్జున్‌ను కౌగిలించుకున్నారు. సుకుమార్‌కు అల్లు అర్జున్‌తోపాటు పుష్ప 2 టీమ్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ థాంక్స్ మీట్‌లో పుష్ప 2 ఆర్టిస్టులతో పాటు టెక్నిషియన్లు పాల్గొన్నారు. సునీల్, దేవిశ్రీప్రసాద్, సుకుమార్‌తో పాటు నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.
సంబంధిత కథనం