




Best Web Hosting Provider In India 2024

OTT Movies: ఓటీటీలోకి 4 రోజుల్లో వచ్చిన 26 సినిమాలు.. చూడాల్సినవి 11.. తెలుగులో మాత్రం 3.. ఎందులో అంటే?
OTT Movies Released This Week Telugu: ఓటీటీలోకి ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు దాదాపుగా 26 సినిమాల దాకా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలుగా 11 ఉండగా.. అందులో కూడా 3 మాత్రమే తెలుగులో ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో లుక్కేద్దాం.
OTT Releases This Week Telugu: ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు వస్తూ అలరిస్తుంటాయి. ఈ వారం కూడా ఎన్నో వివిధ జోనర్స్లో మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. అయితే, గత నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5, ఆహా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
కైండ ప్రెగ్నెంట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 4
అనూజ (అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్) – ఫిబ్రవరి 5
ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 5
సెలబ్రిటీ బేర్ హంట్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటిషన్ షో)- ఫిబ్రవరి 5
ఆపిల్ సైడర్ వెనిగర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 6
ది ఆర్ మర్డర్స్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6
కసాండ్రా (జెర్మనీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బేబీ జాన్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 5
54321 (తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 5
ఇన్విసిబుల్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6
గేమ్ ఛేంజర్ (తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 7
ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7
న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
స్వర్గం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7
ఓషానా (మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా)- ఫిబ్రవరి 7
వాలియెట్టన్ 4కె (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7
కోబలి (తెలుగు క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 4
లవ్ యు టు డెత్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఫిబ్రవరి 5
మెడికల్ డ్రీమ్స్ (హిందీ వెబ్ సిరీస్) గర్లియప్ప యూట్యూబ్ ఛానెల్- ఫిబ్రవరి 5
బ్రేకప్ కహానీ (హిందీ అంథాలజీ లవ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- సన్ ఎన్ఎక్స్టీ- ఫిబ్రవరి 5
వివేకానందన్ వైరల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా సినిమా) ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 7
మద్రాస్కారన్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- ఫిబ్రవరి 7
ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 7
మిసెస్ (హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా) -జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 7
ఐయామ్ నాట్ ఏ రోబోట్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 7
బడా నామ్ కరేంగే (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 7
స్పెషల్ 11- తెలుగులో 3
ఇలా 4 రోజుల్లో 26 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అనూజ, బేబీ జాన్, 5431, స్వర్గం, వివేకానందన్ వైరల్, మద్రాస్కారన్, మిసెస్ వంటి 8 సినిమాలతోపాటు కోబలి, ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్, న్యూటోపియా 3 వెబ్ సిరీస్‌లతో కలిపి చూడాల్సినవిగా 11 ఉన్నాయి. వీటిలో మూడు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం