




Best Web Hosting Provider In India 2024

Relationship Tips: రిలేషన్ బ్రేకప్ కాకుండా ఉండాలంటే, ప్రతిసారి గొడవ జరిగిన తర్వాత ఈ పనులు చేయకపోవడమే బెటర్!
Relationship Tips: రిలేషన్ షిప్‌లో మనస్పర్దలు కామన్, భార్యాభర్తల్లో గొడవలూ సాధారణం. కానీ, అవి కాసేపటి వరకే ఉండాలి. వెంటనే సర్దుకుపోయే బంధాలే కదా కలకాలం నిలిచేది. మరి అలా నిలబెట్టుకోవడానికి మీరేం చేయాలి. ఏం చేయకూడదో తెలుసుకుందామా..?
ప్రేమికులైనా, భార్యాభర్తలైనా, జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే, కొన్ని రకాల బిహేవియర్లను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ రిలేషన్‌ను నిలబెట్టడమే కాదు, బలంగానూ, సంతృప్తికరంగానూ ఉంచుతుంది. ప్రతి రిలేషన్‌లో కచ్చితంగా ఉండే ప్రేమ, నమ్మకం అనేవి గొడవ జరిగిన తర్వాత మళ్లీ మిమ్మల్ని కలిపేవి అవే. కానీ, ఆ ఆవేశంలో కొన్ని పనులు చేస్తే మాత్రం జీవితాంతం రిగ్రెట్ ఫీలవుతారని నిపుణులు చెబుతున్నారు. ఆ సలహాలేంటో తెలుసుకుందామా..

గొడవ సమసిపోక ముందు నిద్రపోకండి
మీరు గొడవ సమయంలో మీ మీద నియంత్రణ కోల్పోయి, అవమానకరమైన మాటలు అంటుంటారు. అయితే వాటి గురించి పరస్పరం చర్చించుకుంటేనే ఆవేశం తగ్గుతుంది. అలా కాకుండా మీరొక్కరే రియలైజ్ అయి నిద్రపోకండి. ఇద్దరూ గొడవను మరిచిపోయి నిద్రించడం అనేది ఉత్తమ మార్గం. ఇలా జరగడం వల్ల మీ సంబంధాన్ని శాశ్వతంగా దెబ్బతీసే పరిణామాలు రాకుండా ఉంటాయి. అలాగే, మీరు తప్పు చేశారని భావించి, తర్వాత క్షమించమని అడగవలసిన అవసరం తగ్గుతుంది.
బంధువుల మాటలు గొడవలో ప్రస్తావించకండి
మీ భాగస్వామితో ఏదైనా గొడవలు జరుగుతుంటే, కాస్త స్పృహలో ఉండి మాట్లాడండి. మీకు అనిపించిన, కనిపించిన విషయాలను మాత్రమే చర్చించండి. అలా కాకుండా మీ సోదరుడు/సోదరి, స్నేహితుడు, తల్లిదండ్రులు ఎవరి నుంచైనా విన్న మాటలను గొడవ సమయంలో అస్సలు చెప్పకండి. అలా చేయడం వల్ల, మీ భాగస్వామికి మీ బంధువుల పట్ల గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే, కొద్ది సమయం తర్వాత మీరు మీ భాగస్వామితో రాజీ పడిపోతారు కానీ, బంధువుల గురించి మీరు ప్రస్తావించిన మాటలను ఆమె మనసులో నుంచి తొలగించలేరు.
లోపాలను అంగీకరించడం చాలా ముఖ్యం
ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదనేది మీరు అర్థం చేసుకుంటే బంధాలు బలంగా ఉంటాయి. ఎదుటి మనిషిలో కేవలం లోపాలనే చూస్తూ ఉంటే, వైవాహిక జీవితమైనా, ప్రేమ బంధమైనా ఎక్కువ కాలం నిలవదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవన్ అంటారు. స్వర్గంలో కలిసిన బంధం సంతోషంగా ఉండాలి. కానీ, లోపాలను వెతుక్కుంటూ వాదనలతో కాదు. మీ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ఒక్కొక్క ఇటుకను పేర్చుకుని ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించుకోవాలి. చిన్న మనస్పర్దలకే లోపాలను ఎత్తిచూపి బంధాల గోడలను బద్దలు కొట్టకండి. కాబట్టి, మీ భాగస్వామి నుంచి కొన్ని మార్పులు కోరుకుంటే, మీలో కూడా మార్పులు చేసుకోండి. అప్పుడే సంబంధం ఎక్కువ కాలం ఉంటుంది.
ఏమేం పనులు చేస్తే మంచిది:
- మీరు ఒకరికొకరు అనుభవాలు, భావనలు పంచుకుంటే, ఆ బంధం మరింత బలపడుతుంది.
- పరస్పర భావాలను అర్థం చేసుకోవడంతో పాటు గౌరవించడం అలవాటు చేసుకోండి.
- బంధంలో విశ్వాసం చాలా ముఖ్యమైనది. మనసులోని భావాలను సరిగ్గా చెప్పడం, మౌనంగా ఉండకపోవడమే మంచిది.
- ఒకరికొకరు సమయం కేటాయించడం, వాళ్ళ అవసరాలు, అభిరుచులను గమనించి వాటిని తీర్చడం ముఖ్యం.
- ఏవైనా అడ్డంకులు ఎదురైతే, వాటిని రహస్యంగా లేదా పనికిరానివిగా పరిగణించకుండా, ఇద్దరూ కలిసి మాట్లాడి పరిష్కరించుకోండి.
- ఒకరి భావాలను గౌరవించి, సహనం చూపించి వ్యవహరించండి.
- వ్యక్తిగత స్థాయిలో అభిరుచులు, కొత్త పనులు చేయడం గురించి ఎప్పటికప్పుడు పునరాలోచించడం ముఖ్యం.
సంబంధిత కథనం
టాపిక్