




Best Web Hosting Provider In India 2024

Thandel Collection: రెండో రోజు పెరిగిన తండేల్ కలెక్షన్స్.. ‘బ్లాక్ బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్ రిలీజ్!
Thandel 2 Days Worldwide Box Office Collection: నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ప్రేమకథా చిత్రం తండేల్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన తండేల్ మూవీ 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.
Thandel Movie Box Office Collection Day 2: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్‌గా మరోసారి నటించిన లవ్ అండ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ తండేల్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాకు కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు.

దేశభక్తి ఎలిమెంట్స్‌తో
ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన తండేల్ మూవీకి టాక్ బాగానే వస్తోంది. సినిమా బాగుందని, ముఖ్యంగా నాగ చైతన్య నటన అదిరిపోయిందని పలు రివ్యూలు తెలిపాయి. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు. దీంతో తండేల్ మూవికి బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగుంటున్నాయి.
తండేల్ డే1 కలెక్షన్స్
తండేల్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున రూ. 8.54 కోట్ల షేర్, 13.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఇండియాలో తొలి రోజున రూ. 11.5 నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. ఇందులో తెలుగు నుంచి 11.3 కోట్లు, హిందీ నుంచి 12 లక్షలు, తమిళం ద్వారా 8 లక్షలు రాబట్టినట్లుగా ఉన్నాయి.
తొలిరోజే 30 శాతం రికవరీ
అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 11.54 కోట్ల షేర్, రూ. 20.45 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయినట్లు సమాచారం. దీని ప్రకారం మొదటి రోజునే 30 శాతం వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. ఇక రెండో రోజున తండేల్ మూవీకి కలెక్షన్స్ పెరిగాయి. భారతదేశంలో రెండో రోజున తండేల్ సినిమాకు రూ. 12.63 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ తెలిపింది. ఈ లెక్కన 9.91 శాతం కలెక్షన్స్ పెరిగాయి. దీంతో రెండు రోజుల్లో ఇండియాలో తండేల్‌కు రూ. 25.99 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
రెండో రోజు పెరిగిన కలెక్షన్స్
ఇక రెండు రోజుల్లో తండేల్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 41.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ “బ్లాక్ బస్టర్ లవ్ సునామీ” అంటూ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఓవర్సీస్‌లో 500K డాలర్స్‌కుపైగా వసూలు అయినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఇలా కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న తండేల్ సినిమాకు ఓవరాల్‌గా రూ. 37 కోట్ల బిజినెస్ జరిగింది.
తండేల్ హిట్ కొట్టాలంటే
దీంతో తండేల్ చిత్రానికి రూ. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అంటే, తండేల్ చిత్రం హిట్ కొట్టాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38 కోట్లను రాబట్టాలి. అందుకు ఇంకా సుమారుగా రూ. 16 కోట్ల వరకు కలెక్షన్స్ రావాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్