




Best Web Hosting Provider In India 2024

Pushpa 2 OTT Streaming: మరో భాషలో పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్.. గ్లోబల్ రేంజ్ క్రేజ్‍కు మరింత బూస్ట్: వివరాలివే
Pushpa 2 OTT Streaming: పుష్ప 2 సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది. అయితే, ఇప్పుడు మరో భాష కూడా యాడ్ అయింది. దీంతో గ్లోబల్‍గా మరింత సత్తాచాటే అవకాశం ఉంది. ఆ వివరాలివే..
భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలుకొట్టిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ క్రమంలో మరో భాష కూడా ఓటీటీలో యాడ్ అయింది.

ఇంగ్లిష్ డబ్బింగ్‍లో..
పుష్ప 2: ది రూల్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ముందుగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జనవరి 30న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ఈ మూవీకి అంచనాలకు తగ్గట్టే భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఇండియాలో టాప్-1లో ఉన్న పుష్ప 2 గ్లోబల్ రేంజ్‍లోనూ ముందు నుంచి టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ తరుణంలో గ్లోబల్‍గా మరింత బూస్ట్ ఇచ్చేలా ఈ మూవీ ఇంగ్లిష్ డబ్బింగ్‍లోనూ నేడు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
గ్లోబల్‍గా మరింత ఊపు!
పుష్ప 2 చిత్రం సుమారు 20కు పైగా దేశాల్లో నెట్‍ఫ్లిక్స్ టాప్-10లో ట్రెండ్ అవుతోంది. దీంతో గ్లోబల్ లిస్టులోనూ టాప్-10లో ఉంది. చాలా మంది వెస్ట్రన్ ఆడియన్స్ కూడా ఈ మూవీని ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్‌తో చూసి ప్రశంసించారు. దీంతో ఇంగ్లిష్ ఆడియో అందుబాటులోకి తెస్తే గ్లోబల్ రేంజ్‍లో మరింత దుమ్మురేపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పుష్ప 2 చిత్రానికి ఇంగ్లిష్ డబ్బింగ్‍ను నెట్‍ఫ్లిక్స్ తీసుకొచ్చేసింది. దీంతో గ్లోబల్ రేంజ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.
పుష్ప 2: ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,850కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. వరల్డ్ వైడ్‍గా అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న భారతీయ చిత్రాల జాబితాలో రెండో ప్లేస్‍కు వచ్చింది. బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ హిట్ సహా మరిన్ని రికార్డులను అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ సృష్టించింది. ఈ రేంజ్‍లో భారీ హిట్ అవడంతో థ్యాంక్స్ మీట్‍ను తాజాగా నిర్వహించింది మూవీ టీమ్. ఈ సినిమా సక్సెస్‍కు డైరెక్టర్ సుకుమార్ ప్రధాన కారణం అంటూ అల్లు అర్జున్ చెప్పారు.
పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, జగదీశ్, సునీల్, అనసూయ, తారక్ పొన్నప్ప, అజయ్ కీలకపాత్రల్లో నటించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ రవిశంకర్ చిత్రాన్ని నిర్మించారు.
పుష్ప 3 సినిమాను కూడా డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి పుష్ప 3 ర్యాంపేజ్ అనే టైటిల్‍ను కూడా ఖరారు చేశారు. ఈ విషయంపై థ్యాంక్స్ మీట్‍లోనూ అల్లు అర్జున్ చెప్పారు. అన్నీ కలిసి వచ్చినప్పుడు పుష్ప 3 ఉంటుందనేలా మాట్లాడారు.
సంబంధిత కథనం