




Best Web Hosting Provider In India 2024

Thandel: అక్కినేని అభిమానులకు జోష్ ఇచ్చే మాట చెప్పిన నిర్మాత.. ఆర్డర్ చేసుకోండి అంటూ..
Thandel: తండేల్ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ తరుణంలో సక్సెస్ టూర్‌తో ప్రమోషన్ల జోరును మరింత పెంచింది టీమ్. అక్కినేని అభిమానులకు జోష్ కలిగే నిర్మాత బన్నీవాస్ మాట్లాడారు.
తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్ అందుకుంది. రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. తండేల్ సక్సెస్ దిశగా సాగుతుండటంతో థియేటర్ టూర్‌ను మూవీ టీమ్ మొదలుపెట్టింది. విజయవాడలోని ఓ థియేటర్‌కు నేడు (ఫిబ్రవరి 9) తండేల్ టీమ్ వెళ్లింది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు అక్కినేని అభిమానుల్లో జోష్ పెంచే కామెంట్లు చేశారు.

రూ.100కోట్ల పోస్టర్ పడబోతోంది
తండేల్ హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందూ, నిర్మాత బన్నీవాసు సహా మరికొందరు నేడు విజయవాడ వెళ్లారు. ముందు కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని శైలజ థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా బన్నీవాసు అక్కినేని అభిమానులకు ఓ మాట ఇచ్చారు.
తండేల్ సినిమా నుంచి రూ.100కోట్ల పోస్టర్ త్వరలో రానుందని, కేక్‍లు ఆర్డర్ చేసి పెట్టుకోవాలని బన్నీవాసు చెప్పారు. “రిలీజైన ఉదయాన్నే బెజవాడ తీసుకెళ్లాలని నాగచైతన్య అడిగారు. అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు తీసుకొచ్చాం. అక్కినేని అభిమానులు అందరూ కాలర్ ఎత్తారు కదా. మళ్లీ చెబుతున్నా.. మీరు బేకరీకి వెళ్లి పెద్ద కేక్ ఆర్డర్ చేసుకోండి. తొందరలోనే రూ.100కోట్ల పోస్టర్ పడబోతోంది. ఐదు సంవత్సరాలకు సరిపడే కేక్‍ను అభిమానులు సిద్ధం చేసుకోండి” అని బన్నీ వాసు చెప్పారు.
రెండు రోజుల కలెక్షన్లు ఇవే
తండేల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.41.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. తొలి రోజు ఈ మూవీ రూ.21కోట్ల గ్రాస్ సాధించినట్టు ప్రకటించింది. నాగచైతన్యకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా నిలిచింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూకుడు కొనసాగిస్తోంది. మూడో రోజైన ఆదివారం కూడా కలెక్షన్ల జోరు ఉండనుంది. టికెట్ల బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఇది అర్థమవుతోంది.
తండేల్ రూ.100కోట్ల కొట్టాలని అక్కినేని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇదే జరిగితే నాగచైతన్యకు ఇదే తొలి రూ.100కోట్ల చిత్రం కానుంది. ఎక్కువగా పాజిటివ్ టాక్ ఉండడం.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవటంతో తండేల్ కలెక్షన్ల దూకుడు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మార్కుకు ఈ మూవీ చేరుతుందా అనేది చూడాలి.
పాకిస్థాన్ జైలులో నెలల పాటు కష్టాలను ఎదుర్కొని స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం జాలర్ల నిజజీవిత ఘటనలతో తండేల్ చిత్రం తెరకెక్కింది. మత్య్సకారుడు రాజు పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయారు. సాయిపల్లవి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు.
ఈ మూవీలో కరుణాకరన్, ఆడుకాలం నరేన్, ప్రకాశ్ బెలవాది, బబ్లూ పృథ్విరాజ్, కల్పలత, చరణ్‍దీప్ కీరోల్స్ చేశారు. తండేల్ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు ప్రొడ్యూజ్ చేయగా.. అల్లు అరవింద్ సమర్పించారు.
సంబంధిత కథనం