




Best Web Hosting Provider In India 2024

Nalgonda : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.23 లక్షల బ్యాగ్ మాయం! పోలీసులకు ఫిర్యాదు
Nalgonda : ఓ వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడు. తన తోపాటు రూ.23 లక్షల బ్యాగ్‌ను తెచ్చుకున్నాడు. దారి మధ్యలో ప్రయాణికులు టిఫిన్ చేయడానికి బస్సును ఆపారు. అందరి తోపాటు ఆ వ్యక్తి కూడా బస్సు దిగాడు. మళ్లి వచ్చేసరికి డబ్బుల బ్యాగ్ మాయమైంది.
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.23 లక్షల బ్యాగ్ మాయమైంది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద బస్సులో రూ.23లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ చోరీ కలకలం రేపింది. ఆదివారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును.. టిఫిన్ చేసేందుకు నార్కెట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆపారు.

టిఫిన్ చేసేందుకు దిగగా..
అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి నగదు బ్యాగ్‌ను బస్సులో ఉంచి.. టిఫిన్ చేసేందుకు దిగారు. తిరిగి వచ్చి చూసి నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బస్సులో ప్రయాణించిన వారే చోరీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
అందుబాటులోకి ఈవీ బస్సులు..
హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త ఇది. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను.. బేగంపేటలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
విజయవాడ- విశాఖ మధ్య..
మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్- విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని.. ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా వెల్లడించారు. ఆ తర్వాత విజయవాడ- విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
99 రూపాయలతో..
ఈ సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని నిర్వాహకులు వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
టాపిక్