




Best Web Hosting Provider In India 2024

Daaku Maharaj OTT: డాకు మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యం.. ఎప్పుడు రావొచ్చు!
Daaku Maharaaj OTT: డాకు మహరాజ్ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యమైంది. నేడు స్ట్రీమింగ్కు వస్తుందంటూ పుకార్లు గట్టిగానే వచ్చినా అలా జరగలేదు. ఈ మూవీ ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చంటే..
డాకు మహరాజ్ చిత్రం కలెక్షన్లలో అదరగొట్టింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజైంది. ప్రేక్షకులకు మెప్పించి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంచనాలను అందుకుంది. అయితే, డాకు మహారాజ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ నిరాశ ఎదురైంది.

స్ట్రీమింగ్ ఆలస్యం!
డాకు మహారాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై రూమర్లు బలంగా వచ్చాయి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 9న నేడు స్ట్రీమింగ్కు రానుందంటూ అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో చాలా మంది నిరీక్షించారు. అయితే, ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేడు అడుగుపెట్టలేదు. స్ట్రీమింగ్ రావడం ఆలస్యమైంది.
డాకు మహరాజ్ చిత్రాన్ని థియేటర్లలో రిలీజైన 28 రోజులకు స్ట్రీమింగ్కు తీసుకొచ్చేలా మూవీ టీమ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని టాక్ బయటికి వచ్చింది. దీంతోనే ఫిబ్రవరి 9నే రానుందని రూమర్లు వచ్చాయి. అయితే, అది జరగలేదు. నేడు ఈ చిత్రం స్ట్రీమింగ్కు రాలేదు.
మరో వారంలోనే డాకు మహరాజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఓటీటీలో పుష్ప 2 సత్తాచాటుతుండటంతో ఈ మూవీ స్ట్రీమింగ్‌ను కాస్త వాయిదా వేసినట్టు రూమర్లు ఉన్నాయి. మరి డాకు మహరాజ్‌ను నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి.
డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టారు.ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్‌పాండే కీరోల్స్ చేశారు. ఈ మూవీని పక్కా యాక్షన్ మూవీగా ఈ తీసుకొచ్చారు డైరెక్టర్ బాబీ. బాలయ్య అభిమానులకు యాక్షన్ ధమాకా చూపించడంలో సక్సెస్ అయ్యారు.
బాలయ్యకు మరో హిట్
డాకు మహరాజ్ చిత్రంతో బాలకృష్ణ మరో హిట్ కొట్టారు. ఈ చిత్రం రూ.150కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని మూవీ టీమ్ ప్రకటించింది. బాలయ్య గత మూడు చిత్రాలు కూడా రూ.100కోట్ల మార్క్ దాటాయి. వరుసగా నాలుగోసారి ఆ మైల్‌స్టోన్‌ను బాలయ్య దాటారు. బ్లాక్‌బస్టర్ జోష్ కొనసాగించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య.. డాకు మహారాజ్ సినిమాను ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దుమ్మురేపేశారు. థమన్పై భారీగా ప్రశంసలు వచ్చాయి.
సంబంధిత కథనం