




Best Web Hosting Provider In India 2024

Same Music Director: ప్రతి సినిమాలో ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటున్న హీరోలు, దర్శకులు! ఎవరికి ఎవరంటే?
Same Music Directors In Every Movie: సినిమాల్లో కొన్ని కాంబినేషన్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుంది. అందుకే, ఆ కాంబోలను రిపీట్ చేస్తుంటారు. అలా, తమ ప్రతి సినిమాలో ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకునే హీరోలు, దర్శకులు ఎవరో ఇక్కడ లుక్కేద్దాం. వారిలో బాలకృష్ణ నుంచి సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి వరకు ఉన్నారు.
Same Music Directors In Every Movie: సినిమాల్లో హీరో-డైరెక్టర్, హీరో-హీరోయిన్ ఇలా కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతుంటాయి. అందుకే వారితో రిపీటెడ్‌గా సినిమాలు చేస్తుంటారు. అలాగే, సినిమాను నిలబెట్టే బీజీఎమ్, సంగీతం విషయంలో కూడా ఇదే కాంబోను రిపీట్ చేస్తుంటారు హీరోలు, దర్శకులు.

ఒకే మ్యూజిక్ డైరెక్టర్
ఇక హీరోలకు తగినట్లు ఎలివేట్ ఇచ్చే సంగీత దర్శకులు కొంతమంది ఉంటారు. అందుకే వారిని కూడా తమ ప్రతి సినిమాలో అవకాశం ఇస్తుంటారు. ఇలా తమ ప్రతి సినిమాలో ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకున్న హీరోలు, దర్శకులు ఎవరో ఇక్కడ లుక్కేద్దాం.
సుకుమార్
పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన ఆర్య సినిమా నుంచి రీసెంట్ పుష్ప 2 వరకు అన్ని సినిమాలకు సంగీతం అందించిన ఒకే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. సుకుమార్ సినిమాకు సంగీతం ఇచ్చేది డీఎస్‌పీ ఒకరే అనేంతలా ఈ కాంబో రిపీట్ అయింది. మరి ఇదే జోడీ ముందు ముందు రిపీట్ అవుతుందో చూడాలి.
బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే డాకు మహారాజ్ మూవీతో మరో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణకు మ్యాచ్ అయ్యే బీజీఎమ్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అందరూ ఈజీగా చెప్పే పేరు తమన్. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ మూవీలో కూడా బీజీఎమ్, సంగీతం అదిరిపోయిందని టాక్ వచ్చింది. అఖండతో మొదలైన బాలయ్య-తమన్ కాంబినేషన్ రిపీట్ అవుతూనే ఉంది.
విక్రమ్ కే కుమార్
13బీ, మనం, 24, హలో, నాని గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. గతేదాడి నాగ చైతన్యతో ధూత వెబ్ సిరీస్ తీసి ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలాంటి విక్రమ్ కే కుమార్ సగం కంటే ఎక్కువ సినిమాలకు సంగీతం అందించింది మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్.
రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఎన్నో ఏళ్లుగా వందల చిత్రాలతో అలరిస్తున్నారు. కానీ, ఇటీవల కాలంలో రజనీకాంత్ సినిమాలకు మ్యూజిక్ కొట్టాల్సింది అనిరుధ్ రవిచందర్ అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంటుంది. దర్బార్ మూవీలో మొదటగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన జైలర్ సినిమాలోని బీజీఎమ్, సాంగ్స్ ఒక రేంజ్‌లో హిట్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి రజనీకాంత్-అనిరుధ్ కాంబో రిపీట్ అవుతూనే ఉంది.
హను రాఘవపూడి
క్లాసిక్ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన హను రాఘవపూడి సీతారామం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక హను రాఘవపూడి చిత్రాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి హను రాఘవపూడి ఇప్పటికీ ఐదు సినిమాలకు దర్శకత్వం వహిస్తే.. అందులో మూడింటికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ప్రభాస్‌తో హను రాఘవపూడి తీసే ఫౌజీ మూవీకి కూడా విశాల్ చంద్రశేఖరే మ్యూజిక్ ఇవ్వనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్