Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు

Best Web Hosting Provider In India 2024

Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు

Bandaru Satyaprasad HT Telugu Feb 09, 2025 06:34 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Feb 09, 2025 06:34 PM IST

Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దుండగులు దాడి చేశారు. ప్రైవేట్ ఆర్మీగా చెప్పుకుంటున్న సభ్యులు కొందరు రంగరాజన్ ఇంటికి వెళ్లి…తమతో చేరాలని ఒత్తిడి చేశారు. అందుకు ఆయన నిరాకరించడంతో దాడి చేశారు.

 చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు
చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగింది. రామరాజ్యం స్థాపనకు ప్రైవేట్ ఆర్మీ అని చెప్పుకుంటున్న ఓ గ్యాంగ్ రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. తామను తాము ఇక్ష్వాకు వంశస్తులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఒక గ్యాంగ్ గా ఏర్పడి…రామరాజ్య స్థాపనకు తమతో కలిసి రావాలని పలువురిని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

yearly horoscope entry point

ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిథిలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ ఇంటికి వెళ్లారు. తమతో చేతులు కలపాలని రంగరాజన్‌పై ఒత్తిడి చేశారు. అయితే రంగరాజన్ ఒప్పుకోకపోవడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. తన కుమారుడిని విచక్షణారహితంగా కొట్టారని రంగరాజన్ తండ్రి సౌందర రాజన్ మెయినాబాద్ పోలీసులకు ఫిర్యాదులో చేశారు.

ఒకరు అరెస్ట్

అయితే ఈ విషయంపై అర్చకుడు రంగరాజన్, పోలీసులు ఏ సమాచారాం ఇవ్వడంలేదు. దాడికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. రంగరాజన్ తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ గ్యాంగ్ నాయకుడిగా భావిస్తున్న వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గ్యాంగ్ లోని మిగిలిన సభ్యుల కోసం మొయినాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ప్రైవేట్ ఆర్మీ హల్ చల్

తెలంగాణలో ఓ ప్రైవేట్ ఆర్మీ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్ష్వాకు వంశస్తులుగా చెప్పుకుంటూ గుంపులుగా తిరుగుతున్న గ్యాంగ్…నల్లబట్టలు, కాషాయం కండువాల ధరించి

తిరుగుతున్నారు. సీసీకెమెరాలో దృశ్యాల ఆధారంగా ఈ గ్యాంగ్ యువతీ యువకులు టక్ చేసుకుని ఉన్నారు. రామరాజ్యం స్థాపిస్తామంటూ గ్యాంగ్ నాయకుడు చెబుతున్న మాటలు వీడియోలో రికార్డు అయ్యాయి. రామరాజ్య స్థాపనకోసం తమతో కలిసి రావాలని ఈ గ్యాంగ్ సభ్యులు అర్చకులపై ఒత్తిడి చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaHyderabadTelugu NewsCrime Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024