Cristiano Ronaldo: టాటూలు వేసుకోని రోనాల్డో.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఫుట్ బాల్ స్టార్ గొప్ప మనసు

Best Web Hosting Provider In India 2024


Cristiano Ronaldo: టాటూలు వేసుకోని రోనాల్డో.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఫుట్ బాల్ స్టార్ గొప్ప మనసు

Chandu Shanigarapu HT Telugu
Feb 10, 2025 01:07 PM IST

Cristiano Ronaldo: క్రీడాకారులు టాటూలు వేసుకోవడం చాలా కామన్. భారత క్రిికెట్ స్టార్ విరాట్ కోహ్లి ఒంటి నిండా పచ్చబొట్లు ఉంటాయి. కానీ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పటివరకూ ఒక్క టాటూ వేయించుకోలేదు. రీజన్ ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మరి అదెంటో చూసేయండి.

 ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో
ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (REUTERS)

టాటూలు వేయించుకోని రొనాల్డో

yearly horoscope entry point

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో ఇప్పటివరకూ ఒక్క టాటూ కూడా వేయించుకోలేదంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం.ఈ పోర్చుగల్ ఆటగాడు అసలు పచ్చబొట్ల జోలికే వెళ్లలేదు. దీని వెనుక ఓ మంచి కారణం ఉంది. రక్తదానం చేయడం కోసమే రొనాల్డో టాటూల జోలికి వెళ్లలేదు. తన శరీరంపై ఒక్క ఇంక్ చుక్క ను అతను పొడిపించుకోలేదు.

ఫుట్ బాల్ స్టార్ గ్రేట్ హార్ట్

గ్రౌండ్ లో అద్భుతమైన ప్రదర్శనతో సాగే రొనాల్డో.. బయట కూడా తన మేటి వ్యక్తిత్వంతో అభిమానుల మనసు గెలుచుకుంటున్నాడు. రక్త దానం చేయడం కోసమే టాటూలకు దూరంగా ఉండి తనది గ్రేట్ హార్ట్ అని చాటుకున్నాడు. టాటూలు వేయించుకుంటే రక్త దానం చేసే ముందు వెయిటింట్ పిరియడ్ ఫాలో కావాల్సి ఉంటుంది. టాటూల వల్ల ఈ ఇబ్బంది ఉండకూడదని రొనాల్డో అసలు పచ్చబొట్ల జోలికే వెళ్లలేదు.

రొనాల్డో రక్తదానం

ఫుట్ బాల్ స్టార్ రొనాల్డో క్రమం తప్పకుండా రక్త దానం చేస్తుంటాడు. అదే టాటూలు వేయించుకుంటే వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. అప్పుడు అవసరం ఉన్నవాళ్లకు ఎవరికైనా తాను రక్తం ఇవ్వలేకపోతానేమోననే కారణంతో రొనాల్డో టాటూలకు దూరంగా ఉంటున్నాడు. అంతే కాకుండా బ్లడ్ డొనేషన్ పై యూత్ ను ఎంకరేజ్ చేసేందుకు 2015లో క్యాంపేన్ కూడా రన్ చేశాడు.

వేలం వేసి

వివిధ మంచి కార్యక్రమాలకు రొనాల్డో ఎప్పుడూ సాయంగా ఉంటున్నాడు. 2011లో తన యురోపియన్ గోల్డెన్ బూట్ ను వేలం వేస్తే వచ్చిన సుమారు రూ.13 కోట్లను గాజాలోని పాఠశాలలకు విరాళంగా అందించాడు. బాలాన్ డి ఆర్ ట్రోఫీని అమ్మి 2013లో రూ.5.75 కోట్లను మేక్ ఏ విష్ ఫౌండేషన్ కు ఇచ్చాడు. సేవ్ ది చిల్డ్రన్, యునిసెఫ్, వరల్డ్ విజన్ తదితర సంస్థలకు రొనాల్డో మద్దతుగా నిలుస్తున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link