




Best Web Hosting Provider In India 2024

Sankranthiki Vasthunam OTT: అనూహ్యం.. ఓటీటీ కంటే ముందే టీవీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ఛానెల్
Sankranthiki Vasthunam on TV before OTT: సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలో కంటే ముందు టీవీ ఛానెల్‍లోకి రానుంది. ఈ విషయంపై టీవీ ఛానెల్ నుంచి అప్‍డేట్ కూడా వచ్చేసింది. ఇది అనూహ్యమైన విషయంగా ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ సాధించింది. టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. రూ.300కోట్ల మార్క్ దాటి చరిత్ర సృష్టించింది. ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ట్విస్ట్ ఎదురైంది. ఈ మూవీ ఓటీటీ కంటే ముందు టీవీలోకి రానుందని అప్‍డేట్ వచ్చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం ఏ ఛానెల్‍లో అంటే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అధికారికంగా ప్రకటించింది. ఓటీటీ కంటే ముందుగా టీవీలోకే వస్తుందని నేడు (ఫిబ్రవరి 10) వెల్లడించింది ఆ ఛానెల్. జీ తెలుగులో త్వరలో సంక్రాంతికి వస్తున్నాం టీవీ ప్రీమియర్‌కు వస్తుందని తెలిపింది.
ఓటీటీ కంటే ముందు తొలిసారి టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రానుందంటూ నేడు ఓ ప్రోమో రిలీజ్ చేసింది జీ తెలుగు ఛానెల్. మళ్లీ సంక్రాంతి వైబ్‍కు సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే టెలికాస్ట్ డేట్‍ను వెల్లడించే అవకాశం ఉంది.
ఓటీటీ కంటే ముందే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రావాల్సింది. ఫిబ్రవరిలో మూడో వారంలో స్ట్రీమింగ్‍కు రానుందనే రూమర్లు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఓటీటీ కంటే ముందే టీవీ ఛానెల్‍లో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. జీ తెలుగులో టీవీ ప్రీమియర్ కానుంది.
భారీ టీఆర్పీ ఖాయమేనా!
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే థియేటర్లలో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఓటీటీ కంటే ముందుగా టీవీ ఛానెల్‍లోకి వస్తుండటంతో మరింత ఇంట్రెస్టింగ్‍గా ఉంది. తొలిసారి ప్రసారంలో ఈ చిత్రానికి జీ తెలుగులో భారీ టీఆర్పీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఎంత టీఆర్పీ సాధిస్తుందో చూడాలి.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. టాలీవుడ్‍లో రీజనల్ చిత్రాల్లో అత్యధిక వసూళ్ల రికార్డును దక్కించుకుంది. ప్రాంతీయ చిత్రాల్లో ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. ఈ మూవీలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కామెడీ, ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో భారీ సక్సెస్ సాధించింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రం అంచనాలను దాటేసి భారీ కలెక్షన్లు సాధించింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి చివరి ఈవెంట్ జరగనుంది. విక్టరీ ఈవెంట్ పేరిట నేడు (ఫిబ్రవరి 10) ఈ ఈవెంట్ సాగనుంది. బ్లాక్‍బస్టర్‌ను మూవీ టీమ్ సెలెబ్రేట్ చేసుకోనుంది.
సంబంధిత కథనం