



Best Web Hosting Provider In India 2024
virat kohli: లండన్ లో రియల్ ఎస్టేట్ పై కోహ్లి ఇంట్రస్ట్.. పీటర్సన్ తో డిస్కషన్.. ఇంగ్లండ్ లెజెండ్ ఏమన్నాడు?
virat kohli: ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ సిరీస్ లో కోహ్లీ, కెవిన్ పీటర్సన్ మధ్య ఇంట్రస్టింగ్ చర్చలు సాగుతున్నాయి. కెమెరా కళ్లలో వీళ్లు పడ్డారు. లండన్ లోని రియల్ ఎస్టేట్ గురించి పీటర్సన్ ను కోహ్లి అడుగుతున్నాడేమో అనే ఊహాగానాలు వస్తున్నాయి.
పీటర్సన్ తో కోహ్లి చర్చలు

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇంగ్లండ్-భారత్ వన్డే సిరీస్ కోసం కామెంటేటరీ విధుల్లో ఉన్న పీటర్సన్ ను కోహ్లి తరచూ కలుస్తున్నాడు. తాజాగా రెండో వన్డే సందర్భంగా బౌండరీ లైన్ బయట వీళ్లు మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తొలి వన్డేకు ముందు కూడా వీళ్లు కలిసి మాట్లాడుకున్నారు.
రియల్ ఎస్టేట్ పై ఇంట్రస్ట్
లండన్ లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్న కోహ్లి అక్కడి రియల్ ఎస్టేట్ గురించి ఆరా తీస్తున్నాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయాల గురించి తరచుగా పీటర్సన్ తో కోహ్లి డిస్కషన్ పెడుతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే కోహ్లీకి లండన్ లో ఓ ఇల్లు ఉంది. ఇంకా ఇతర ప్రాపర్టీల కోసం అతను పీటర్సన్ తో మాట్లాడుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి.
లండన్ లోనే సెటిల్
క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత లండన్ లోనే సెటిల్ అయ్యేందుకు కోహ్లి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. కోహ్లి లండన్ లోనే సెటిల్ అవుతాడని అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కూడా ఇటీవల పేర్కొన్నాడు. ఈ మధ్య కాలంలో సమయం దొరికితే చాలు కోహ్లి లండన్ లోనే ఉంటున్నాడు. అతని భార్య అనుష్క శర్మ కొడుకు అకాయ్ కు అక్కడే జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
పీటర్సన్ క్లారిటీ
పీటర్సన్ తో కోహ్లి చర్చల గురించి కామెంటర్ ఆకాశ్ చోప్రా ‘‘కోహ్లి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నాడు. అతను లండన్ లోని రియల్ ఎస్టేట్ గురించి చర్చిస్తుండొచ్చు’’ అని చెప్పాడు. కానీ ఆ తర్వాత పీటర్సన్ ‘‘ఊహాగానాలు వద్దు. గోల్ఫ్ ఆడటం ప్రారంభించాలని మాత్రమే కోహ్లీకి చెప్పా’’ అని కామెంటరీలో పేర్కొన్నాడు.
Best Web Hosting Provider In India 2024
Source link