




Best Web Hosting Provider In India 2024

CBN on IAS: ఫైల్స్ క్లియర్ చేయడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది సమయం.. ఐఏఎస్ అధికారుల తీరుపై చంద్రబాబు చురకలు
CBN on IAS: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో కొన్ని శాఖల్లో ఫైల్స్ క్లియర్ చేయడానికి ఆరు నెలలకు మించి సమయం పట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు పట్టారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటీవల శాఖల వారీగా ఫలితాలు అలా ప్రకటించినవేనని చెప్పారు.
CBN on IAS: ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్‌కు ఆర్నెల్ల నుంచి ఏడాది సమయం పట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు పట్టారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కొన్ని శాఖల్లో మితిమీరిన జాప్యాన్ని సీఎఉం తప్పు పట్టారు. ఇటీవల శాఖల వారీగా ఫైల్స్ క్లియర్ చేస్తున్న తీరు తన దృష్టికి రావడంతో విడుదల చేసినట్టు చెప్పారు.

కొంతమంది అధికారులు ఫైళ్ల క్లియరెన్స్‌చేయడానికి అధిక సమయం తీసుకుంటున్నారని, కొందరు వ్యక్తులు, సెక్రటరీలు ఆర్నెల్ల నుంచి ఏడాది సమయం తీసుకుంటున్నారని సీఎం అన్నారు. అంత సమయం తీసుకోడానికి కారణం ఏమిటి, ఎవరు ఎందుకు క్లియర్ చేయడం లేదో అధికారులకు స్పష్టత ఉంటుందన్నారు.
అన్ని శాఖల్లో అందరు కార్యదర్శులు స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవాలని వేగంగా నిర్ణయం తీసుకోవాలని, ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలన్నారు. కొంతమంది వ్యక్తుల్ని ఎత్తి చూపడానికి చెప్పడం లేదని, ఇటీవల ఫైల్స్ క్లియర్ అవుతున్న తీరు తన దృష్టికి రావడంతో జాబితా విడుదల చేసినట్టు చెప్పారు. వ్యవస్థల్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఫైల్స్ సరి చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అధికారులు ఆలోచించాలన్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్ టెక్నాలజీ వాడుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో ఫ్యామిలీ యూనిట్‌గా పథకాలను అమలుచేయాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గ్రామంలో వీధి దీపాలు, డ్రైనేజీ, చెత్త సేకరణ వంటి కనీస అవసరాలు మెరుగ్గా ఉండాలని సూచించారు. జలజీవన్ మిషన్ వంటి ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తున్నాయని గుర్తు చేశారు.
కేంద్రం బడ్జెట్‌కు అనుగుణంగా మన బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలని, శాఖల వారీగా అందుకు కసరత్తు చేయాలని చెప్పారు. ఈ ఏడాది చేసిన ఖర్చుకు అనుగుణంగా వచ్చే ఏడాది బడ్జెట్ చేయాలని అడుగుతున్నారని అది సరికాదన్నారు. 2047 లక్ష్యాలను అధిగమించాలని చంద్రబాబు కార్యదర్శులకు సూచించారు
చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు ప్రజలు సంతోషంగా ఉండేలా పనిచేయాలని సూచించారు. మాటలు చెప్పే వారు కనుమరుగై, యాక్షన్‌లో చూపించే వారు మాత్రమే మనుగడలో ఉంటారని రాజకీయాల్లో రుజువైందని, అధికారులు బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయాలన పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా విధానాలు ఉండాలన్నారు.
కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. మార్చిలోగా ఖర్చు చేయాల్సిన పనులు పూర్తి చేసి నిధులకు యూసీలు ఇవ్వాలని నిధులు ఎక్కువగా తెచ్చుకోడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు. కేంద్రం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. రైతులకు అనుకూల విధానలు అమలు చేయాలి. అక్వా, హార్టికల్చర్, కాఫీ, నేచురల్ ఫార్మింగ్‌లో అడ్వాన్స్ స్టేజీలో ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఏఐ టెక్నాలజీని అన్ని శాఖల్లో వినియోగించుకోవాలని, 95లో ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐను అందిపుచ్చుకోవాలన్నారు. టెక్నాలజీ పూర్తిగా ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్