Vijay Devarakonda’s VD12 అఫీషియల్.. విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు స్టార్ హీరోలు

Best Web Hosting Provider In India 2024

vd12

VD12: అఫీషియల్.. విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు స్టార్ హీరోలు

VD12 Title Teaser: VD12 టైటిల్ టీజర్ కోసం ముగ్గురు హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని అధికారికంగా వెల్లడైంది. ఇప్పటికే రూమర్లు రాగా.. నేడు అధికారికంగా ఖరారు చేసింది మూవీ టీమ్. ఆ వివరాలు ఇవే..

 
VD12: అఫీషియల్.. విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు హీరోలు
VD12: అఫీషియల్.. విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు హీరోలు
 

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లతోనే క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది. ఈ మూవీ విజయ్ వివిద గెటప్‍ల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పేరు వీడీ12గా ఉంది. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు సమయం దగ్గరపడింది. ఈ మూవీ టైటిల్ టీజర్ రేపు (ఫిబ్రవరి 12) విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా రేంజ్ మూవీ టీజర్‌కు ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీల స్టార్ హీరోలు భాగస్వాములయయ్యారు.

ముగ్గురు స్టార్ హీరోల వాయిస్ ఓవర్

వీడీ12 టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 11) అధికారికంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్‍కు టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తమిళ వెర్షన్‍లో స్టార్ హీరో సూర్య గొంతు ఉండనుంది.

వీడీ12 కోసం రణ్‍బీర్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఇవ్వనున్నారని కొంతకాలంగా రూమర్లు ఉన్నాయి. అయితే, మూవీ టీమ్ ఇప్పడు అధికారికంగా కన్ఫర్మ్ చేసేసింది. టైగర్ సింబల్‍ను నిర్మాత నాగవంశీ పోస్ట్ చేయటంతో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉండనుందని కన్ఫర్మ్ అయింది. సూర్య డబ్బింగ్‍కు వచ్చిన ఫొటోను సోమవారం మూవీ టీమ్ పోస్ట్ చేసింది. హిందీ టీజర్లో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఉంటుందని నేడు అధికారింగా వెల్లడించింది.

వీడీ12 నుంచి విజయ్ దేవరకొండ పోలీస్‍గా ఉన్న ఓ పోస్టర్.. తక్కువ హెయిర్‌తో ఇంటెన్స్ లుక్‍తో ఉన్నది మరొకటి వచ్చింది. టైటిల్ టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్లో ఓ కిరీటం ఉంది. రాజు కోసం కిరీటీం వేచిచూస్తోందని అందులో ఉంది. దీంతో ఈ మూవీలో విజయ్ ఎన్ని రోల్స్ చేస్తున్నారో.. స్టోరీలైన్ ఏంటోననే ఉత్కంఠ విపరీతంగా పెరిగిపోయింది.

 

వీడీ12 చిత్రం టైటిల్‍పై కూడా ఆసక్తి విపరీతంగా ఉంది. రేపు (ఫిబ్రవరి 12) టైటిల్ టీజర్ వచ్చాక.. చాలా విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ అందరూ ఊహిస్తున్న దాని కంటే గ్రాండ్ స్కేల్‍లో ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇప్పటికే చెప్పారు.

మూవీ విడుదల ఎప్పుడు!

ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. టైటిల్ టీజర్లో విడుదల తేదీ కూడా ఉండొచ్చు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

విజయ్ దేవరకొండకు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. గీతగోవిందం (2018) తర్వాత ఆ రేంజ్ హిట్ రాలేదు. గత మూడు చిత్రాలు లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో వీడీ12 మూవీ విజయ్‍కు అత్యంత కీలకంగా ఉంది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024