



Best Web Hosting Provider In India 2024
Warangal : ఢిల్లీ టు చెన్నై వయా వరంగల్.. రైల్వేస్టేషన్‌కు రాహుల్ గాంధీ.. కారణం ఇదే!
Warangal : కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. పర్యటన గురించి ఎలాంటి ముందస్తు సమచారం లేదని తెలుస్తోంది. సడెన్‌గా రాహుల్ గాంధీ వస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, హస్తం పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ ఆకస్మికంగా పర్యటించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు శంషాబాద్‌కు రాహుల్ రానున్నారు. అక్కడినుంచి చాపర్‌లో వరంగల్ రానున్నారు. చెన్నై పర్యటన నేపథ్యంలో హనుమకొండలో ల్యాండింగ్ అవ్వనున్నారు. వరంగల్‌లో కాసేపు రాహుల్ గాంధీ రెస్ట్ తీసుకోనున్నారు. విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా ట్రైన్ ప్రయాణం చేయనున్నారు రాహుల్.

విద్యార్థులతో కలిసి..
ఢిల్లీ నుంచి చెన్నైకి తమిళనాడు విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ రైలు ప్రయాణం చేయాల్సి ఉంది. రాత్రి 7:30 గంటలకు రాహుల్ గాంధీ చెన్నై ప్రయాణం మొదలు కానుంది. ఈ ప్రయాణంలో భాగంగా.. వరంగల్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కనున్నారు రాహుల్. విద్యార్థులతో కలిసి ముఖాముఖిలో పాల్గొననున్నారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్ గాంధీ ప్రయాణించనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ నుంచి చెన్నై వరకు ట్రైన్‌లో విద్యార్థులతో కలిసి వెళ్లనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ..
తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై రాహుల్ గాంధీ ప్రజల రియాక్షన్ తెలుసుకోనున్నారని సమచారం. అలాగే రైల్వే ప్రయివేటీకరణ అంశంపై ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రైన్‌లో విద్యార్థులతో రాహుల్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. రాహుల్ ఆకస్మిక పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా మారింది.
కేబినెట్ విస్తరణపై చర్చ..
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో.. మంత్రివర్గ విస్తరణ, పీసీపీ కమిటీ నిర్మాణాలకు సంబంధించి ఏమైనా ఆదేశాలు వెలువడుతాయా అన్నదానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
టాపిక్