




Best Web Hosting Provider In India 2024

OTT Malayalam: మూడు వారాలుగా ఓటీటీలో ట్రెండింగ్‍లో ఉన్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Malayalam: రైఫిల్ క్లబ్ అనే చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ లో బడ్జెట్ మలయాళ చిత్రం మూడు వారాలుగా ఓటీటీలో టాప్-10లో ట్రెండ్ అవుతూనే ఉంది.
ఓటీటీలో మలయాళ చిత్రాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీల్లో సత్తాచాటుతుంటాయి. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్‍లలోనూ వచ్చి మంచి వ్యూస్ దక్కించుకుంటుంటాయి. ఇదే ఇప్పుడు రిపీట్ చేసింది రైఫిల్ క్లబ్. ఈ మలయాళ యాక్షన్ చిత్రం ఓటీటీలో మూడు వారాలుగా టాప్-10లో ట్రెండ్ అవుతోంది. భారీ చిత్రాలు వచ్చినా.. ఇది మాత్రం ట్రెండింగ్‍లో నిలుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

మాడు వారాలుగా ట్రెండింగ్‍లో..
రైఫిల్ క్లబ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం మూడు వారాలుగా నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల టాప్-10లో ట్రెండింగ్‍లో ఉంటోంది. ఓ దశలో టాప్-2లోనూ నిలిచింది. ప్రస్తుతం (ఫిబ్రవరి 11) ఆరో స్థానంలో ట్రెండ్ అవుతోంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ.. భారీ చిత్రాల మధ్య మూడు వారాల నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సత్తాచాటుతుండడం విశేషం.
ఐదు భాషల్లో..
రైఫిల్ క్లబ్ చిత్రం గత డిసెంబర్ 19వ తేదీన మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. నెల తిరగకుండానే జనవరి 16వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మలయాళం ఒక్కటే విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచి ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కాయి. సోషల్ మీడియాలోనూ ఈ రైఫిల్ క్లబ్ చిత్రంపై పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది.
రైఫిల్ క్లబ్ చిత్రానికి ఆషిక్ అబూ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ నరేషన్‍తో పక్కా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయరాఘవన్, దిలీశ్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించారు. వాణి విశ్వనాథ్, అనురాగ్ కశ్యప్, హమన్కింద్, దర్శన రాజేంద్రన్, ఉన్నిమాయ ప్రసాద్, వినీశ్ కుమార్ కీరోల్స్ చేశారు.
రైఫిల్ క్లబ్ మూవీని ఓపీఎం సినిమాస్, ట్రూ స్టోరీ బ్యానర్లపై ఆషిక్ అబూ, విన్సెంట్ వడక్కన్, విశాల్ విన్సెంట్ టోనీ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం.. రూ.30కోట్ల కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఈ మూవీకి రెక్స్ విజయన్ మ్యూజిక్ ఇచ్చారు.
బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ మూవీ పుష్ప 2 ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హవా చూపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ జనవరి 30వ తేదీన స్ట్రీమింగ్‍కు రాగా.. ఇప్పటికీ టాప్-1లో ట్రెండ్ అవుతోంది. గత డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చి అనేక రికార్డులను బద్దలుకొట్టిన ఈ డైరెక్టర్ సుకుమార్ మూవీ ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గ్లోబల్‍గానూ టాప్-10లో ట్రెండ్ అవుతోంది.
సంబంధిత కథనం