




Best Web Hosting Provider In India 2024

NNS 11th February Episode: అనామికగా అరుంధతి.. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిలోకి.. మనోహరిపై అమర్‌లో పెరిగిన అనుమానం
NNS 11th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్లో అనామికగా మారబోతోంది అరుంధతి. చిత్రగుప్తుడు ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఇష్టం లేకపోయినా సరే అంటుంది. అటు మనోహరిపై అమర్ లో అనుమానం పెరుగుతుంది.
NNS 11th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసంలో ఈరోజు (ఫిబ్రవరి 11) ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఓవైపు కాళీ, మంగళ.. మరోవైపు రణ్‌వీర్.. ఇంకోవైపు భాగీ.. మరోహరిని టార్గెట్ చేస్తారు. దీంతో మనోహరి ఎటూ పాలుపోని పరిస్థితిలో పడిపోతుంది.

మనోహరికి మంగళ, రణ్‌వీర్ ఫోన్
కాళీ జైలు నుంచి వచ్చేశాడని, మీరు చెప్పిన చోటు వేచి చూస్తున్నాడని మనోహరికి ఫోన్ చేసి చెబుతుంది మంగళ. వస్తున్నాను అక్కడే ఉండమని చెప్పి విసుగ్గా ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. వెంటనే మరోసారి ఫోన్ రావడంతో మళ్లీ మంగళే చేసిందని మనోహరి మరింత విసుక్కుంటూ.. వస్తానని చెప్పాను కదా మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావని గట్టిగా నిలదీస్తుంది.
అయితే ఆ ఫోన్ వచ్చింది రణ్‌వీర్ నుంచి కావడంతో ఆమె షాక్ తింటుంది. అరగంటలోపు తన దగ్గరికి వచ్చిన నువ్వు చేసిన పనికి సరైన కారణం చెప్పకపోతే తర్వాతి ఫోన్ అమరేంద్రకే వెళ్తుందని రణ్‌వీర్ హెచ్చరిస్తాడు.
మనోహరికి భాగీ స్ట్రాంగ్ వార్నింగ్
రణ్‌వీర్ మూర్ఖుడు.. అన్నంత పని చేస్తాడని భయపడిన మనోహరి.. మంగళకు ఫోన్ చేసి గంట తర్వాత వస్తానని చెప్పి ముందుగా రణ్‌వీర్ ను కలవాలని భావిస్తుంది. అంతకుముందే తన మీద విసుక్కున్న మనోహరితో ఆడుకోవాలని అనుకున్న మంగళ.. అయితే రూ.6 లక్షలు ఇస్తే కాళీని గంట సేపు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటానని అంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తానని మనోహరి చెబుతుంది.
కంగారు పడుతూ బయటకు వెళ్తున్న మనోహరి కింద పడుతుంది. వెనుక నుంచి వచ్చిన భాగీ ఆమెను లేపుతూ అయ్యో దెబ్బ తగిలిందా అని అడుగుంది. ఏం లేదని మనో అనడంతో నీకు కాదు.. నేలకు తగిలిందేమో అని వెటకారం ఆడుతుంది. ఆ సమయంలోనే పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది. తన అక్క సైలెంట్ అయినా తాను వయోలెంట్ అని కూడా మనోహరికి భాగీ తేల్చి చెబుతుంది.
అరుంధతికి చిత్రగుప్తుడి బంపర్ ఆఫర్
అటు మనోహరి కంగారుగా వెళ్లడం చూసి ఆమెను ఫాలో చేసి పట్టించాలని అనుకుంటూ అరుంధతి ఆమె వెనుక వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆలోపు అక్కడికి వచ్చిన చిత్రగుప్తుడు ఆమెను అడ్డుకుంటాడు. నువ్వు చెప్పిన విషయంపై నేను నిర్ణయం తీసుకున్నాను.. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నిన్ను నీలాగే ఉన్న మరో అమ్మాయిలోకి తీసుకెళ్తానని అంటాడు. అరుంధతి ఇక అనామిక అవుతుందనీ చెబుతాడు. ఇవి విని అరుంధతి షాక్ అవుతుంది.
తనలాగే మరో అమ్మాయి ఉందంటే ఆరు నమ్మదు. దీంతో చిత్రగుప్తుడు ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ అమ్మాయిని తన మాయాశక్తితో అరుంధతికి చూపిస్తాడు. ఆమె కాసేపట్లో మరణించబోతోందని, అది ఆమె రాసుకున్న రాత అని అంటాడు. ఆమెలోకే తన ఆత్మను తీసుకెళ్తానని చెబుతాడు. మొదట్లో దీనికి అంగీకరించని అరుంధతి.. తర్వాత తన కుటుంబాన్ని మనోహరి నుంచి కాపాడుకోవడానికి తర్వాత అంగీకరిస్తుంది.
మనోహరిపై అమర్ అనుమానం
అటు రాథోడ్ తో కలిసి కారులో వెళ్తుంటాడు అమరేంద్ర. అయితే మనోహరి కోల్‌కతా వెళ్తానని అనడం, లగేజ్ సర్దుకునేలోపే మనసు మార్చుకోవడం గుర్తుకు వచ్చి ఆమె చేసే పనులు ఈ మధ్య వింతగా, అనుమానం రేకెత్తేలా ఉన్నాయని రాథోడ్ తో అమర్ అంటాడు. మీకూ అలాగే అనిపించిందా అని రాథోడ్ అంటాడు. మీకు కూడా అంటే నీకూ అలాగే అనిపించిందా అని అమర్ అడుగుతాడు. తనకు అరుంధతి మేడమ్ బతికి ఉన్నప్పటి నుంచీ మనోహరి చేష్టలు అనుమానాస్పదంగానే ఉన్నాయని రాథోడ్ అంటాడు.
దీంతో అమర్ లో అనుమానం మరింత బలపడుతుంది. ఆ బాబ్జీ సంగతి కూడా చూడండని రాథోడ్ చెబుతాడు. అతన్ని కచ్చితంగా పట్టుకొని ఆరును ఎందుకలా చేశారో కనుక్కొని తీరతానని అమర్ స్పష్టం చేస్తాడు. మరి మనోహరి నిజస్వరూపాన్ని అమర్ తెలుసుకుంటాడా లేదా తెలియాలంటే మంగళవారం (ఫిబ్రవరి 11) టెలికాస్ట్ అయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్