




Best Web Hosting Provider In India 2024

Bujji Thalli Song Sad Version Lyrics: గుండెల్ని మెలిపెట్టే ‘తండేల్’ బుజ్జితల్లి సాడ్ వెర్షన్ పాట.. లిరిక్స్ ఇవే
Bujji Thalli Song Sad Versions Lyrics: తండేల్ మూవీలో బుజ్జి తల్లి పాటకు సాడ్ వెర్షన్ కూడా ఉంది. థియేటర్లలో ఈ ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులను టచ్ చేసింది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో మొదటి నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది. మెలోడియస్ ‘బుజ్జితల్లి’ పాట రిలీజ్‍కు ముందే ఈ మూవీకి మంచి బజ్ తీసుకొచ్చింది. చాలా పాపులర్ అయింది. అయితే, తండేల్ సినిమాలో బుజ్జితల్లి పాటకు సాడ్ వెర్షన్ కూడా ఉంది. ఇది ఎమోషనల్‍గా మనసులను తాకేలా ఉంటుంది.

పాట సందర్భం ఇది
తండేల్ చిత్రంలో సత్య అలియాజ్ బుజ్జితల్లి (సాయిపల్లవి) కోపంతో ఓ దశలో రాజు (నాగచైతన్య)తో మాట్లాడదు. చేపల వేటకు వెళ్లిన రాజు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. తన మాట వినకుండా చేపల వేటకు గుజరాత్‍కు వెళ్లి రాజుపై కోప్పడి.. మాట్లాడకుండా ఉంటుంది. ఆ సందర్భంలోనే రాజు బాధను తెలిపేలా బుజ్జితల్లి సాడ్ వెర్షన్ పాట వస్తుంది. ఎమోషనల్‍గా హృదయాలను మెలిపెట్టేలా ఈ సాంగ్ బిట్ ఉంటుంది. దేవీ శ్రీప్రసాద్ ఈ పాటకు మంచి భావోద్వేగ ఫీలింగ్ ఉండేలా ట్యూన్ ఇచ్చారు. ఈ వెర్షన్‍ను జావేద్ అలీ పాడగా.. శ్రీమణి రిలిక్స్ ఇచ్చారు. ఆ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
బుజ్జితల్లి సాడ్ వెర్షన్ లిరిక్స్ ఇవే
ఏమి తప్పు చేశానే..
ఇంత శిక్ష వేశావే
ఊపిరాపి చంపేసే.. తీర్పు రాసి పంపావే
నిన్ను నన్ను ఈ దూరం..
వేరు చేయదన్నానే..
నాది ఎంత పేరాశో.. నేడు తెలుకున్నానే
ఏడు సంద్రాలను దాటి.. నాకై వస్తానన్నావే
వేడుకంటి ప్రేమను కోసి.. ఏడుపు నింపావే
నీకోసం.. నే వేచున్నా..
ఇన్నాళ్లు.. నా బుజ్జితల్లీ..
నా కోసం.. ఇక మిగిలాయి.. కన్నీళ్లూ..
ఓ బుజ్జితల్లి..
తండేల్ చిత్రంలో మొదట వచ్చిన రెగ్యులర్ బుజ్జితల్లి పాట సినిమాకు మంచి ప్రమోషన్లు తీసుకొచ్చింది. ఈ సాడ్ వెర్షన్ థియేటర్లలో జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఇది సాంగ్ బిట్‍లా ఉంది. ఈ సాడ్ వెర్షన్‍పై సోషల్ మీడియాలోనూ చాలా మంది పోస్టులు చేశారు. ఎమోషన్‍తో ఏడిపించేసిందని కామెంట్లు చేశారు. ఈ సాడ్ వెర్షన్ ఆడియోను తాజాగా యూట్యూబ్‍లో మూవీ టీమ్ రిలీజ్ చేసింది.
తండేల్ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు గడిపి ఆ తర్వాత భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం జాలర్ల నిజజీవిత కథతో తెరకెక్కించారు. ప్రేమకథ ప్రధానంగా ఈ మూవీ రూపొందింది. తండేల్ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.73.20 కోట్ల గ్రాస్ కలెక్షను దక్కించుకుందని మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మూవీని గీతా ఆర్ట్ పతాకంపై బన్నీ వాసు ప్రొడ్యూజ్ చేయగా.. అల్లు అరవింద్ సమర్పించారు.