




Best Web Hosting Provider In India 2024

OTT Bold Web Series: ఓటీటీలోకి మరో బోల్డ్ వెబ్ సిరీస్.. అమ్మాయిలను ఎలా పడేయాలో చెప్పే ప్రొఫెసర్.. ఫ్రీగా చూసేయండి
OTT Bold Web Series: ఓటీటీలోకి మరో బోల్డ్ వెబ్ సిరీస్ వస్తోంది. వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా అమ్మాయిలను ఎలా పడేయాలో చెప్పే ప్రొఫెసర్ వస్తున్నాడు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూడొచ్చు.
OTT Bold Web Series: బోల్డ్ మూవీస్, వెబ్ సిరీస్ కు కేరాఫ్ అయిన ఓటీటీ అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్. ఈ ఓటీటీలోకి ఇప్పుడు అలాంటిదే మరో వెబ్ సిరీస్ రాబోతోంది. దీని పేరు ప్యార్ కా ప్రొఫెసర్ (Pyaar Ka Professor). తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 12) ఈ సిరీస్ ట్రైలర్ ను ఆ ఓటీటీలో రిలీజ్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా యువ ప్రేక్షకులకు ఈ గిఫ్ట్ ను ఇవ్వనుంది.

ప్యార్ కా ప్రొఫెసర్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్
ప్యార్ కా ప్రొఫెసర్ పేరుతో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి మరో బోల్డ్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ బాడీ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ రాత్రి పూట యువకులకు అమ్మాయిలను ఎలా పడేయాలో చెబుతుంటాడు. ఓ అమ్మాయి మనకు పడిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలో కూడా వాళ్లకు వివరిస్తుంటాడు.
అలాంటి యువకుడి చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఇది. ఈ ప్యార్ కా ప్రొఫెసర్ వెబ్ సిరీస్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులోని మొత్తం కంటెంట్ లాగే ఈ కొత్త వెబ్ సిరీస్ ను కూడా ఫ్రీగా చూసే వీలుండటం విశేషం.
ఈ విషయాన్ని మంగళవారం (ఫిబ్రవరి 11) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఎంఎక్స్ ప్లేయర్ వెల్లడించింది. “వాలెంటైన్స్ డే క్రాష్ కోర్స్ కోసం ప్యార్ కా ఫ్రొఫెసర్ తన అడ్మిషన్లను మొదలుపెట్టాడు. ప్యార్ కా ప్రొఫెసర్ ఫిబ్రవరి 14 నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.
ప్యార్ కా ప్రొఫెసర్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
యువతను ఆకట్టుకునేలా ఎన్నో బోల్డ్ మూవీస్, వెబ్ సిరీస్ ను ఈ అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఇప్పటికే తీసుకొచ్చింది. ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ప్యార్ కా ప్రొఫెసర్ ను తీసుకురాబోతోంది. అవతలి వ్యక్తితో మాట్లాడే సమయంలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో చెప్పే నిపుణుడైన ఓ యువకుడు.. రాత్రి పూట మాత్రం అమ్మాయిలను ఎలా పడేయాలో యువకులకు క్లాస్ లు ఇస్తుంటాడు.
ఈ నేపథ్యంలో అదే యువకుడికి ఓ రాజకీయ నేతకు అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో చెప్పేందుకు ఓ అవకాశం వస్తుంది. అయితే అది కాస్తా తర్వాత అతని జీవితం తలకిందులయ్యేలా చేస్తుంది. ఇంతకీ అతని జీవితం ఎలా మలుపు తిరిగింది? ఆ నేత నుంచి ఎలా తప్పించుకుంటాడన్నది ఈ ప్యార్ కే ప్రొఫెసర్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. ఫిబ్రవరి 14 నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం