



Best Web Hosting Provider In India 2024
Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో 11 మంది శిశువుల జననం.. మెుదటి బిడ్డ పేరు ఏంటో తెలుసా?
Maha Kumbh 2025 : మహా కుంభమేళా కొందరికి మరిచిపోలేని గుర్తులను ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆసుపత్రిలో 11 మంది శిశువులు జన్మించారు. వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక. నివేదికల ప్రకారం గత నెలలో దాదాపు 44 కోట్ల మంది భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ 44 కోట్ల మంది యాత్రికులలో మహా కుంభమేళా 11 మంది మహిళలకు, వారి కుటుంబాలకు మరింత ప్రత్యేకమైనదిగా మారింది. ఎందుకంటే ఈ మహిళలు కుంభమేళాలో ఏర్పాటు చేసిన కేంద్ర ఆసుపత్రిలో ప్రసవించారు.

11 మంది మహిళలు ప్రసవం
ఈ ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు సహా 105 మంది వైద్య నిపుణుల బృందం ఉంది. 11 మంది మహిళలను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు, ప్రసవాలకు సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌ల ద్వారా అక్కడికి తరలించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. మహా కుంభమేళా అధికారికంగా జనవరి 13, 2025న ప్రారంభమైనప్పటికీ, డిసెంబర్ నుండి యాత్రికులు ఈ ప్రాంతానికి రావడం మెుదలుపెట్టారు. మొదటి బిడ్డ డిసెంబర్ 29, 2024న ఆసుపత్రిలో జన్మించింది.
మొదటి బిడ్డ పేరు?
మొదటి బిడ్డ డిసెంబర్ 29, 2024న ఆసుపత్రిలో జన్మించింది. కౌశాంబికి చెందిన సోనమ్ (20) ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె కుటుంబం ఆ శిశువుకు కుంభ్ అని పేరు పెట్టింది. ఆమెకు ప్రసవ నొప్పి వచ్చినప్పుడు ఆమె భర్త రాజా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ జంట పని వెతుక్కుంటూ కుంభమేళాకు వచ్చి అక్కడే నివసిస్తున్నారు.
వివిధ ప్రాంతాలకు చెందినవారు
ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలు ఉత్తరప్రదేశ్‌లోని బందా, చిత్రకూట్, కౌశాంబి, జౌన్పూర్ వంటి వివిధ జిల్లాలకు చెందినవారు. దీనితో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చినవారు ఉన్నారు. కొందరు మహా కుంభమేళాలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల భార్యలు, మరికొందరు బంధువులతో కుంభమేళాకు వచ్చినవారు.
వివిధ రకాల పేర్లు
బందాకు చెందిన శివకుమారికి జన్మించిన బిడ్డకు గంగాగా నామకరణం చేశారు. ఆ తరువాత సంగం, యమునా, సరస్వతి, అమృత్.. ఇలా మహా కుంభమేళాకు సంబంధించిన పేర్లు వచ్చేలా పెట్టారు. మహా కుంభమేళా ప్రాంతంలోని పరేడ్ గ్రౌండ్ సమీపంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో ఓపీడీ, జనరల్ వార్డు, డెలివరీ సెంటర్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. పురుషులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక వార్డులను కలిగి ఉంది.
సెంట్రల్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనోజ్ కౌశిక్ ఇప్పటివరకు జరిగిన ప్రసవాలన్నీ సాధారణంగానే జరిగాయని ధృవీకరించారు. ఈ ఆసుపత్రిలో చివరిసారిగా ఫిబ్రవరి 6న జననం జరిగింది. బారాబంకికి చెందిన 30 ఏళ్ల కాంచన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
Best Web Hosting Provider In India 2024
Source link