Putin and Trump : పుతిన్, ట్రంప్ మధ్య సీక్రెట్ డీల్ జరిగిందా? ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ప్రకటన!

Best Web Hosting Provider In India 2024


Putin and Trump : పుతిన్, ట్రంప్ మధ్య సీక్రెట్ డీల్ జరిగిందా? ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ప్రకటన!

Anand Sai HT Telugu
Feb 11, 2025 04:53 PM IST

Putin and Trump secret deal : పుతిన్, ట్రంప్‌ల మధ్య సీక్రెట్ ఒప్పందం జరిగిందా? ఉక్రెయిన్‌లోని ఒక ముఖ్యమైన భాగం రష్యాతో విలీనం కావాలని కోరుకుంటోందని రష్యా మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఈ విధమైన అంశం గురించి ట్రంప్ ఒకరోజు ముందు మాట్లాడటం విశేషం.

ukraine russia war
ukraine russia war

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న తీవ్రమైన యుద్ధంపై మంగళవారం కొత్త అప్‌డేట్ వెలువడింది. ఉక్రెయిన్‌లోని ఒక ముఖ్యమైన భాగం రష్యాతో విలీనం కావాలని కోరుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. క్రెమ్లిన్ కార్యాలయం వాదనలతో యూరోప్‌లో కలకలం రేగింది. పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సీక్రెట్ ఒప్పందం జరిగిందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో ట్రంప్, ఉక్రెయిన్ లోని కొంతభాగం రష్యాలో విలీనం కావచ్చు అని అన్నారు.

yearly horoscope entry point

రష్యాలో విలీనం!

అయితే ఆ తర్వాత తాజాగా మంగళవారం రోజున ‘ఉక్రెయిన్‌లోని ఒక ముఖ్యమైన భాగం రష్యాలో విలీనం కావాలని కోరుకుంటోంది’ అని క్రెమ్లిన్ కార్యాలయం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్, ఉక్రెయిన్ ‘ఎప్పుడైనా రష్యాలో విలీనం కావచ్చు.’ అని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అన్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న సంఘర్షణపై ఆయన మాట్లాడుతూ, ఉక్రెయిన్ ఒప్పందం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. అవి ఎప్పుడైనా రష్యాలో విలీనం కావచ్చు లేదా కాకపోవచ్చు అని అన్నారు. అయితే ఈ ఒప్పందం అనే అంశంపై తెరపైకి రావడంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

క్రెమ్లిన్ కార్యాలయం ప్రకటన

ఈ విషయంపై స్పందిస్తూ, క్రెమ్లిన్ కార్యాలయ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారం.. ఉక్రెయిన్ పరిస్థితి ట్రంప్ వ్యాఖ్యలు సరిపోతాయని అన్నారు. ‘ఉక్రెయిన్‌లోని ఒక ముఖ్యమైన భాగం రష్యాలో విలీనం కావాలని కోరుకుంటోంది, ఇప్పటికే విలీనం అయింది.’ అని క్రెమ్లిన్ పేర్కొంది. 2022లో రష్యా నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను విలీనం చేసుకున్న విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి గుర్తుచేశారు.

యుద్ధం ముగిస్తానన్న ట్రంప్

ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను తాను పాటిస్తానని మళ్ళీ స్పష్టం చేశారు. ప్రపంచంలోని యుద్ధాలను ముగించడం తన ప్రాధాన్యత అని ఆయన అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోందన్నారు. అనేక మరణాలు, కోట్ల సంపద నష్టం జరిగిందని, ఈ యుద్ధం ముగియాలని పేర్కొన్నారు. తన అధ్యక్ష పదవి ప్రారంభ దశల్లోనే ఈ సంఘర్షణను ముగించడం తన ప్రాధాన్యత అని చెప్పారు. కానీ రెండు పక్షాలను చర్చలకు ఎలా తీసుకురాలో ఇంకా స్పష్టమైన ప్రణాళికను ఆయన ప్రవేశపెట్టలేదు.

ప్రైవేటుగా చర్చించారా?

రష్యా, ఉక్రెయిన్ రెండూ తమ సంఘర్షణను ముగించే ట్రంప్ డిమాండ్‌ను బహిరంగంగా స్వాగతించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్‌తో నేరుగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ట్రంప్ ఈ విషయంపై పుతిన్‌తో ఇప్పటికే ప్రైవేటుగా చర్చించాడని అంటున్నారు. అయితే క్రెమ్లిన్ కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి నిరాకరించింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link