![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/pexels-photo-733851_1739263622875_1739263649326.jpeg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/pexels-photo-733851_1739263622875_1739263649326.jpeg)
Daily Curd: రోజుకు ఒక కప్పు పెరుగు తింటే మీలో కలిగే పాజిటివ్ మార్పులు ఇవిగో
Daily Curd: ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కప్పు పెరుగు తింటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల మీలో కలిగే మార్పులు ఏమిటో తెలుసుకోండి.
రోజువారీ ఆహారంలో కచ్చితంగా తినాల్సినది పెరుగు ఒకటి. దీన్ని రోజూ మీరు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పెరుగు అనేక పోషకాలతో నిండి ఉంటుంది. పెరుగుతోనే మజ్జిగ, వెన్న, నెయ్యి ఇలా ఎన్నో తయారు చేస్తారు. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి శీతలీకరణ ప్రభావం పడుతుంది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
కొవ్వుతో కూడిన పెరుగును తీసుకోవడం కూడా మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగును యోగర్ట్ అని, కర్డ్ అని కూడా అంటారు. ఇది పోషకాల నిధి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.
జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది పొట్ట ఆరోగ్యానికి సహాయపడుతుంది. కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. పెరుగు మీ కడుపును చల్లగా ఉంచుతుంది. ఇది మీ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మీ శరీర జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ రుగ్మతలు లేదా అసిడిటీ వంటివి రాకుండా కాపాడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
మీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అది మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు పొట్ట నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల అనవసరంగా ఆహారం తినాలనే కోరికను నియంత్రిస్తుంది.
దంతాల, ఎముకల ఆరోగ్యానికి
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ దంతాలు, ఎముకలను బలపరుస్తుంది. ఇది మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆస్టియోపోరోసిస్ నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎముకలకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
హై బిపి రాకుండా నిరోధిస్తుంది
పెరుగులోని ప్రోబయోటిక్స్ మీ గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇది మీ శరీరంలో అధిక కొవ్వులు, హై బిపి స్థాయిలు రాకుండా నిరోధిస్తుంది. మీరు పెరుగును ఎంచుకునేటప్పుడు కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుతో కూడిన పెరుగును మాత్రమే ఎంచుకోండి. దీనివల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ప్రోబయోటిక్స్ తో పాటు పెరుగులో కాల్షియం, విటమిన్లు ఉంటాయి. విటమిన్ B12, విటమిన్ డి… మీ శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇవి మీ శరీర శక్తిని ఉత్పత్తి చేయడానికి చాలా ముఖ్యమైనవి. మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం అలవాటు చేసుకుంటే అది మీ శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
డయాబెటిస్
పెరుగు తినడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల మీకు టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ విషయాన్ని పరిశోధనలు కూడా నిరూపించాయి. పెరుగు లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాల జాబితాలో ఉంది కాబట్టి, ఇది డయాబెటిస్ ఉన్నవారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం