![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/mini_medaram_1739283995033_1739284000021.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/mini_medaram_1739283995033_1739284000021.jpg)
Mini Medaram Jatara 2025 : రేపటి నుంచి మినీ మేడారం జాతర, 200 స్పెషల్ బస్సులు నడపనున్న ఆర్టీసీ
Mini Medaram Jatara 2025 : సమ్మక్క, సారలమ్మ మినీ మేడారం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
Mini Medaram Jatara 2025 : ములుగు జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. బుధవారం నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుండగా, ప్రభుత్వపరంగా ఏర్పాట్లన్నీ చేశారు. కాగా ఈ జాతరకు దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
అందుకు వరంగల్ రీజియన్ పరిధిలోని బస్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వరంగల్ నగరంలోని హనుమకొండ, వరంగల్ బస్టాండ్ నుంచే ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకునే అవకాశం ఉండగా, వరంగల్ 1, వరంగల్–2 డిపోలతో పాటు హనుమకొండ డిపోలకు చెందిన బస్సులతో మేడారం స్పెషల్ ట్రిప్స్ నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
200 బస్సులతో ఆర్టీసీ సేవలు
మేడారం మినీ జాతర కోసం హనుమకొండ, వరంగల్ -1, వరంగల్ – 2 డిపోల నుంచి దాదాపు 200 బస్సులు నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఇతర డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా తొమ్మిది డిపోలు ఉండగా, అవసరాన్ని బట్టి ఆయా డిపోలన్నింటి నుంచి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అదికారులు చెబుతున్నారు.
పెద్దలకు 200.. పిల్లలకు 110
హనుమకొండ బస్టాండ్ నుంచి భక్తుల రాకపోకలు ఎక్కువగా సాగే అవకాశం ఉండగా.. ఈ మేరకు ఛార్జీలు కూడా అధికారులు ఖరారు చేశారు. మేడారం జాతరకు తరలివెళ్లే మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టిక్కెట్ ఇవ్వనున్నారు. ఇదిలాఉంటే గతేడాది మేడారం మహా జాతర సందర్భంగా పురుషులకు రూ.250, పిల్లలకు రూ.140 చొప్పున వసూలు చేశారు. ఈసారి మినీ జాతరకు మాత్రం ఎక్స్ ప్రెస్ బస్సుల్లో పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 ఛార్జీ చేయనున్నారు. ఈ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో పెద్దలకు రూ.210, పిల్లలకు రూ.120 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్
ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీల్లో మేడారం సమ్మక్క సారలమ్మ మేడారం మినీ జాతర జరగనుండగా హనుమకొండ బస్టాండ్ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా మేడారం జాతరకు బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం విజయభాను తెలిపారు. మేడారం ప్రత్యేక బస్సుల ఆపరేషన్ నిర్వహణ, ప్రజల సౌకర్యార్థం హనుమకొండ బస్టాండ్ , మేడారం బస్టాండ్ లో ఆర్టీసీ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. అన్ని బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని వివరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఎం విజయభాను స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్