Nagarjuna: వస్తున్నాం.. కొడుతున్నాం..: తండేల్ సక్సెస్ మీట్ లవ్ సునామీలో నాగార్జున, నాగ చైతన్య కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Nagarjuna: వస్తున్నాం.. కొడుతున్నాం..: తండేల్ సక్సెస్ మీట్ లవ్ సునామీలో నాగార్జున, నాగ చైతన్య కామెంట్స్

Hari Prasad S HT Telugu
Feb 11, 2025 09:12 PM IST

Nagarjuna: లవ్ సునామీ పేరుతో హైదరాబాద్ లో జరిగిన తండేల్ మూవీ సక్సెస్ మీట్ లో నాగార్జున, నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వస్తున్నాం.. కొడుతున్నాం అంటూ ఈ తండ్రీకొడుకులు అనడం విశేషం.

వస్తున్నాం.. కొడుతున్నాం..: తండేల్ సక్సెస్ మీట్ లవ్ సునామీలో నాగార్జున, నాగ చైతన్య కామెంట్స్
వస్తున్నాం.. కొడుతున్నాం..: తండేల్ సక్సెస్ మీట్ లవ్ సునామీలో నాగార్జున, నాగ చైతన్య కామెంట్స్

Nagarjuna: తండేల్ మూవీ సక్సెస్ మీట్ లవ్ సునామీ పేరుతో హైదరాబాద్ లో మంగళవారం (ఫిబ్రవరి 11) జరిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జున స్పెషల్ గెస్టుగా రాగా.. మూవీ టీమ్ నాగ చైతన్య, చందూ మొండేటితోపాటు చైతూ భార్య శోభితా ధూళిపాళ్ల కూడా వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 2025లో ఇది ముహూర్తం మాత్రమే.. వస్తున్నాం.. కొడుతున్నాం అని అనడం గమనార్హం.

yearly horoscope entry point

వస్తున్నాం.. కొడుతున్నాం..: నాగార్జున

తండేల్ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తనయుడు నాగ చైతన్య నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కొడుకు కాబట్టి పొగడకూడదు అంటూనే.. ఈ సినిమాలో చైతన్య నటన చూస్తుంటే తనకు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గుర్తొచ్చారని అనడం విశేషం.

సినిమా చాలా బాగుందని, క్లైమ్యాక్స్ అద్భుతంగా తీశావంటూ డైరెక్టర్ చందూ మొండేటిని ప్రశంసించాడు. అయితే 2025లో ఇది కేవలం ముహూర్తమే అని, వస్తున్నాం.. మిగతాది వాడితోనే చెప్పిస్తా అని నాగార్జున అనగానే.. కొడుతున్నాం అని చైతన్య అన్నాడు. ఈ తండ్రీ కొడుకుల కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రూ.100 కోట్ల సినిమా మొదలైందే అల్లు అరవింద్‌తో..

ఇక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పైనా నాగార్జున ప్రశంసలు కురిపించాడు. ఇండియాలో తొలి రూ.100 కోట్ల కలెక్షన్ల మూవీ గజినీ అని, దానికి నిర్మాత అల్లు అరవింద్ అని ఈ సందర్భంగా నాగార్జున గుర్తు చేశాడు.

“రూ.100 కోట్ల క్లబ్ ప్రారంభించిన తొలి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. గజినీ మూవీలో రూ.100 కోట్ల క్లబ్ మొదలుపెట్టారు. మాకు మూడు హిట్స్ ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్. చైతన్యను ఈ మూవీకి తీసుకున్నందుకు కృతజ్ఙతలు” అని నాగార్జున అన్నాడు.

చైతన్యతో హిస్టారికల్ మూవీ: చందూ మొండేటి

ఇక తండేల్ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ చందూ మొండేటి కూడా మాట్లాడాడు. భవిష్యత్తులో చైతన్యతో కలిసి ఓ హిస్టారికల్ మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా చైతన్య పక్కనే కూర్చొన్న శోభిత గురించి కూడా చందూ మాట్లాడాడు.

ఆమె తెలుగు చాలా బాగా మాట్లాడుతుందని, ఆ తెలుగును తమ హీరోకి కూడా అలాగే ట్రాన్స్‌ఫర్ చేయాలని అడిగాడు. చైతన్యతో కలిసి భవిష్యత్తులో చారిత్రక మూవీ చేస్తున్నామని, ఒకప్పుడు ఏఎన్నార్ తీసిన తెనాలి రామకృష్ణ మూవీని ఈ తరానికి ఎలా చూపించాలో అలా చూపిస్తామని చందూ మొండేటి వెల్లడించాడు. ఆ సినిమాలో నాగేశ్వరరావు చేసిన అభినయం చైతన్య చేస్తారని, దానిని మనం చూడబోతున్నామని అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024