![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/max_1739289851253_1739289858905.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/max_1739289851253_1739289858905.jpg)
Max OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. సంక్రాంతికి వస్తున్నాం బాటలోనే..
Max OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తోంది మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్యే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా ఇలాగే అనౌన్స్ చేయగా.. ఇప్పుడు కిచ్చా సుదీప్ మ్యాక్స్ మూవీ కూడా అదే బాటలో వెళ్లింది.
Max OTT Release Date: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో జీ5 రూటే సెపరేటుగా కనిపిస్తోంది. ఈ ఓటీటీ సొంతం చేసుకున్న సినిమాలు ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్నాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ హక్కులను సొంతం చేసుకున్న ఈ ఓటీటీ ముందుగా జీ తెలుగులో టీవీ ప్రీమియర్ చేయబోతోంది. ఇక ఇప్పుడు కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ కూడా జీ కన్నడలోనే ముందుగా రానుంది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
మ్యాక్స్ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే
కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ మూవీ గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. నెలన్నర రోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అతని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. వాళ్లందరికీ షాకిస్తూ మూవీ టీవీ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా వచ్చే శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి 7.30 గంటలకు జీ కన్నడ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. ఫిబ్రవరి 22 నుంచి మ్యాక్స్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
నిజానికి గతంలోనే ఈ మూవీ ప్రోమోను జీ కన్నడ ఛానెల్ రిలీజ్ చేసింది. కమింగ్ సూన్ అని ఆ ప్రోమో వచ్చినప్పుడే ఓటీటీ కంటే ముందే టీవీలోకి ఈ సినిమా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కంటే ముందే టీవీ ప్రీమియర్ డేట్ రావడంతో అవి నిజమే అయ్యాయి. ఈ మధ్యే వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ విషయంలోనూ జీ నెట్‌వర్క్ అలాగే చేసింది. జీ5 ఓటీటీ కంటే ముందే జీ తెలుగులోకి తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
మ్యాక్స్ మూవీ ఎలా ఉందంటే?
మ్యాక్స్ మూవీ కథ మొత్తం ఒక్క రాత్రిలోనే ఓ పోలీస్ స్టేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. కథ పరంగా చూసుకుంటే సింపుల్ పాయింట్. సుదీప్‌కు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న యాక్షన్ ఇమేజ్‌ను వాడుకుంటూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో దర్శకుడు మ్యాజిక్ చేశాడు.
ఒక్కో యాక్షన్ ఎపిసోడ్‌ను ఒక్కో రేంజ్‌లో చూపిస్తూ ప్రేక్షకులకు హై మూవ్‌మెంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్‌పై రౌడీలు ఎటాక్ చేసే సీన్స్… వాటిని సుదీప్ టీమ్ తిప్పికొట్టే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి.
ఖాకీ కథలు సిల్వర్ స్క్రీన్‌పై మాస్, హీరోయిజానికి చిరునామాగా నిలుస్తాయి. పోలీస్ పాత్రలు లిమిట్‌లెస్ యాక్షన్, రఫ్ క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్‌తో డిఫరెంట్‌గా సాగుతాయి. పోలీస్ పాత్రల్లో ఉంటే కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే అడపాదడపా స్టార్ హీరోలు ఖాకీ క థల్లో నటించడానికి ఆసక్తిని చూపుతుంటారు. మ్యాక్స్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత కిచ్చా సుదీప్ ఖాకీ కథను టచ్ చేశారు.
మాక్స్ ఇంట్రడక్షన్ సీన్‌తోనే సుదీప్‌లోని హీరోయిజం, ఎలివేషన్స్ సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటాయో దర్శకుడు హింట్ ఇచ్చేశాడు. మినిస్టర్ కొడుకుల అరెస్ట్…ఆ తర్వాత జరిగే పరిణామాలతో సినిమా కాస్తంత స్లో అయినట్లుగా అనిపిస్తుంది.
లోకేష్ కగనరాజ్ ఫార్ములా
మ్యాక్స్ మూవీతో లోకేష్ కనగరాజ్ ఫార్ములాను ఫాలో అయ్యాడు డైరెక్టర్ విజయ్ కార్తికేయ. కొన్ని చోట్ల మాక్స్ మూవీ కార్తి ఖైదీని తలపిస్తుంది. ఓ చిన్న పాయింట్‌ను తీసుకొని దర్శకుడు మాక్స్ కథను రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ తర్వాతే క్లైమాక్స్ ఏమిటన్నది అర్థమైపోతుంది. హీరోకు ధీటైన విలన్ పాత్ర సినిమాలో కనిపించదు.
స్టైలిష్ పోలీస్ ఆఫీసర్…
మ్యాక్స్ పాత్రలో కిచ్చా సుదీప్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టాడు. తన మ్యానరిజమ్స్‌తో మెప్పించాడు. గ్యాంగ్‌స్టర్‌గా సునీల్ విలనిజం బాగుంది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మరో హీరోగా నటించాడు. యాక్షన్ సీన్స్‌లో అతడి ఇచ్చిన బీజీఎమ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
సంబంధిత కథనం